Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తన పెళ్లిలో ప్రదర్శన చేయాలంటూ పాప్ సింగర్‌పై సాకర్ ఆటగాడి ఒత్తిడి

Gareth Bale wants Beyonce to perform at his wedding - but she won't come cheap

హైదరాబాద్: రియల్ మాడ్రిడ్, వేల్స్ స్టార్ గారెత్ బేల్ వచ్చే ఏడాది పెళ్లి చేసుకోనున్నాడు. తన పెళ్లిలో ప్రముఖ పాప్ సింగర్ బియాన్సీ నోల్స్‌తో ప్రదర్శన చేయించాలని చూస్తున్నాడు. దీనికోసం ఇప్పటికే బియాన్సీతో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి.

సుదీర్ఘకాలం పాటు డేటింగ్ చేసిన ఎమ్మా రిస్‌ను 2018లో గారెత్ బేల్ పెళ్లి చేసుకోనున్నాడు. తమ పెళ్లి వేడుక తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ బియాన్సీతో ప్రదర్శన ఇప్పించాలని ఈ జోడీ పట్టుదలగా ఉన్నట్లు వీళ్ల సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

ఎమ్మా రిస్‌ తండ్రి అమెరికాలో ఓ ఫ్రాడ్ కేసులో జైలుకెళ్లడంతో వీరి పెళ్లి ఇటీలీలో జరుగుతుంది. పెళ్లి అనంతరం అతికొద్ది మంది అతిథులకు మాత్రం వేల్స్‌లో పార్టీ ఇవ్వనున్నారు. బేల్, రిస్ కొన్నేళ్ల కిందటే టీనేజర్లుగా ఉన్న సమయంలో కలిశారు. అప్పటి నుంచి డేటింగ్‌లో ఉన్నారు.

ఈ జంటకు ఇప్పటికే ఐదేళ్లు, 20 నెలల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత వారమే వచ్చే సమ్మర్‌లో జరిగే ప్రీమియర్ లీగ్‌లో గారెత్ బేల్ తమ జట్టు తరుపున ఆడేందుకు గాను రియల్ మాడ్రిడ్ జట్టుతో £300,000 ఒప్పందం కుదుర్చుకుంది. 28 ఏళ్ల గారెత్ బేల్ స్పెయిన్ తరుపున ఆడిన సమయంలో మూడు ఛాంపియన్ లీగ్‌లు, ఒక లాలిగా టోర్నీని గెలిచాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, November 28, 2017, 16:14 [IST]
Other articles published on Nov 28, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+