ఆ కౌగిలి మర్చిపోలేను: గంగూలీకి డబుల్ ట్రోఫీల స్పెషల్
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 3 ఎడిషన్ టైటిల్ విజేత అట్లెటికో డి కోల్ కతా (ఎటికె) సహ యజమాని సౌరవ్ గంగూలీని కౌగిలించుకోవాలని తన కల అని జట్టు గోల్ కీపర్ దేబ్జిత్ మజుందార్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుత టోర్నీలో ఎటికె టైటిల్ గెలుచుకోవడంలో దేబ్జిత్ అసాదారణ ప్రతిభ కనబరిచాడనడంలో సందేహం లేదు.
జట్టులో కీలక అథ్లెట్. కేరళ షూటౌట్లలో చివరిదాన్ని దిగ్విజయంగా తిప్పికొట్టడం ద్వారా జట్టు విజయాన్ని ఖరారుచేశాడు. మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత గంగూలీ జట్టు సభ్యులతో కరచాలనం చేశాడు. దేబ్జిత్ తోనూ కరచాలనంచేసిన దాదా ఉద్వేగభరితంగా కౌగిలించుకున్నాడు.
ఆ తర్వాత దేబ్జిత్ స్పందిస్తూ 'నా చిన్నతనంలో ఒక కల కనేవాడ్ని. ఎప్పటికైనా ఒకరోజు సౌరవ్ గంగూలీతో కరచాలనం చేయాలి. ఈ రోజు ఆ అవకాశం చిక్కింది. ఆయన కేవలం కరచాలనంతోనే సరిపెట్టలేదు. అభిమానంతో భావోద్వేగంగా హత్తుకున్నాడు. ఇది నా ఫుట్‌బాల్ కెరీర్‌లో మరిచిపోలేని అంశం' అని తెలిపాడు.
కేరళ కుర్రాడు సెడ్రిక్ హెంగ్బార్ట్ షూటౌట్ బంతిని తిప్పి కొట్టి మ్యాచ్ ఫలితం టై కాకుండా కాపాడినందుకు తనను అభినందించాడని చెప్పాడు. షూటౌట్లు, కార్నర్ బంతులను ఎలా అడ్డుకోవాలో తమ జట్టు జోస్ మొలీనా ట్రైనింగ్ లో వివరించేవాడన్నాడు. తామంతా ఆయన సలహాలే పాటించే వారమని తెలిపాడు. అయితే మానసికంగా సిద్ధం కాకపోతే ఇటువంటి షాట్లను గోల్ కీపర్లు ఎదుర్కోవడం సాధ్యం కాదన్నాడు.

డబుల్ ట్రోఫీలు స్పెషల్: గంగూలీ
కేవలం మూడేళ్లలోనే రెండోసారి తమ జట్టు ఐఎస్ఎల్ టైటిల్ గెలుచుకోవడం తనకు అత్యంత ప్రత్యేకమని అట్లెటికో డి కోల్ కతా సహ యజమాని సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. ‘రెండు విజయాలు ప్రత్యేకమే' అని వ్యాఖ్యానించాడు. ‘కుర్రాళ్లకు అభినందనలు, మ్యాచ్‌లో విజయం సాధించడంలో వారంతా ధ్రుడ సంకల్పం ప్రదర్శించారు' అని తెలిపాడు.

ఉద్వేగం, కేరింతలు చూసి భయపడ్డా
ఒకానొక దశలో కేరళ లీడ్‌లో ఉన్నప్పుడు ఎల్లో షర్టులతో కూడిన అభిమాన జన సందోహం ఉద్వేగం, కేరింతలు చూసి భయపడ్డానని పేర్కొన్నాడు. టైటిల్ కోసం సాగిన మ్యాచ్ ను వీక్షించేందుకు రెండు గంటల ముందే అభిమానులు రావడంతో స్టేడియంలో రద్దీ ఏర్పడింది.

ఇండియన్ ఫుట్‌బాల్ పునర్వ్యవస్థీకరణ దిశగా ఎఐఎఫ్ఎఫ్ అడుగులు
భారతీయ ఫుట్ బాల్ ను పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తామని అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) ప్రధాన కార్యదర్శి కుశాల్ దాస్ తెలిపారు. ఇందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటుచేశామని మీడియాకు చెప్పారు. ఈ టాస్క్‌ఫోర్స్‌లో ఏషియాన్ ఫుట్‌బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్‌సి), ఫిఫా ప్రతినిధులు సభ్యులుగా తమకు మార్గదర్శకత్వం వహిస్తారన్నాడు. ఇండియన్ సూపర్ లీగ్ ను సుదీర్ఘ కాలం నిర్వహించే అంశం ఒకటి, రెండేళ్లలో ఖరారవుతుందన్నాడు.

యు-17 వరల్డ్ కప్ టోర్నీ పూర్తైన తర్వాతే
తదుపరి ఐఎస్ఎల్ టోర్నీ వచ్చే ఏడాది యు-17 వరల్డ్ కప్ టోర్నీ పూర్తయిన తర్వాత మొదలవుతుందన్నారు. అయితే ఇది చాలా సంక్లిష్టమైన అంశమన్నాడు. ఇప్పటికే సుదీర్ఘ కాలంగా వారసత్వ క్లబ్ లుగా కొనసాగుతున్న వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నదన్నాడు. వచ్చే ఏడాది నుంచి ఐఎస్ఎల్ టోర్నీ సుదీర్ఘంగా సాగుతుందని సంకేతాలిచ్చాడు. ఐ - లీగ్ కేవలం రెండున్నర నెలలకు బదులు కొన్ని నెలల పాటు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నాడు. కానీ కొన్ని క్లబ్ ల యాజమాన్యాలు విభేదిస్తున్నాయని కుశాల్ దాస్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications