For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గంగూలీ ఆశ నిరాశ: ఎన్నేళ్ల నుంచో ఎదురుచూస్తున్న..

Ganguly disappointed as Maradona gives exhibition match a miss

హైదరాబాద్: సాకర్ దిగ్గజం డిగో మారడోనా భారత మాజీ క్రికెటర్ గంగూలీని నిరాశకు గురిచేశాడు. మారడోనాకు వీరాభిమాని అయిన గంగూలీ తన హీరో మారడోనాతో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడాలని ఆరాటపడ్డాడు. కానీ మారడోనా అలసిపోయి వెనక్కి వెళ్లిపోవడంతో అది కాస్తా కల లానే మిగిలిపోయింది.

1986 ప్రపంచకప్ విజేత అర్జెంటీనా టీమ్‌లో కీలక ఆటగాడైన మారడోనా రావలసిన దానికంటే మూడు రోజులు ఆలస్యంగా కోల్‌కత్తాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతనికి బెంగాల్ టైగర్ గంగూలీకి 40 నిమిషాల పాటు జరగాల్సిన ఎగ్జిబిషన్ మ్యాచ్ 3 రోజులు వాయిదా పడింది. తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి సోమవారం కోల్‌కత్తాకు వచ్చిన మారడోనాను చూసి గంగూలీతో పాటు ఆయన అభిమానులు సంబరం చేసుకున్నారు.

మారడోనా పేరు ఓపెన్ చేసిన పార్కులో సంబరాలు చేసుకున్నారు. మారడోనా చేతుల మీదుగా పార్క్‌ను ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన 12 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం ఆయన గంగూలీతో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. కోల్‌కత్తా నగరానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది.

అయితే మంగళవారం మారడోనా(డిగో) ఓ ప్రైవేటు పాఠశాలలో జరుగుతున్న వర్క్‌షాప్‌కు హాజరై తన ఫుట్‌బాల్ ప్రావీణ్యం చూపించేసరికి అలసిపోయాడు. ఈ అలసటతో ఆడలేనని చెప్పి వెను దిరిగి వెళ్లిపోయాడు. పాపం 1986 నుంచి తన హీరోగా ఫీలవుతున్నా గంగూలీ ఆశలు అలానే ఉండిపోయాయి. డిగో వర్సెస్ దాదా మ్యాచ్ మళ్లీ వాయిదా పడింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 13, 2017, 10:29 [IST]
Other articles published on Dec 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+