Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫుట్‌బాల్ ప్లేయర్ల కంటే.. ఇరగదీసేశాడు (వీడియో)

GAMBIA SPORTS NEWS: BEST FOOTBALL VIDEO FOR RUSSIA WORLD CUP 2018

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించే ఫుట్‌బాల్ ప్రపంచ కప్ టోర్నీ దిగ్విజయంగా కొనసాగుతోంది. దేశ విదేశాల నుంచి క్రీడా ఔత్సాహికులు స్టేడియాలకు చేరుకొని ఆటగాళ్లు బంతితో చేసే విన్యాసాలను, వాళ్లు గోల్ చేసే తీరును వీక్షించేందుకు నేరుగా తరలి రష్యాకు చేరుకున్నారు. ఈ తరుణంలో కిక్కిరిసిన స్టేడియాల నుంచి భావోద్వేగాలతో వినిపిస్తున్న ఈలలు, గోలలే కాదు. ఇదిగో ఈ వింత అభిమాని ఫిఫా జరుగుతున్న సమయంలో తన ఓ ప్రైవేటు వీడియో నెట్‌లో ఉంచి హల్‌చల్ చేస్తున్నాడు.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

ఈ నేపథ్యంలో.. యావత్‌ ప్రపంచాన్ని కుదిపేస్తున్న సాకర్‌ వరల్డ్ కప్ సమయంలో విడుదల అవడంతో.. ఈ వీడియోకు మరింత క్రేజ్ తెచ్చి పెట్టించింది. మైదానంలో అభిమాన ఆటగాళ్లు ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టి గోల్స్‌ సాధిస్తుంటే... ఆ విజయం తమదే అన్నంతగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

సాకర్‌ ఫీవర్‌ కేవలం మైదానంలోనే కాదు... బయట కూడా ఉందనడానికి ఈ కింది వీడియోనే ఉదాహరణ. విదేశంలో రోడ్డు పక్కన ఓ అభిమాని చేస్తున్న ఫుట్‌బాల్‌ విన్యాసాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. సుమారు ఐదు నిమిషాలున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి బంతితో చేసిన విన్యాసాలు చూస్తే ఔరా అనాల్సిందే.

బంతిని చేతితో తాకకుండా శరీరంపై అవలీలగా ఆడిస్తూనే.. బంతిని ఒక కాలితో పట్టుకొని దీపపు స్తంబం ఎక్కడం.. బంతి కిందపడకుండా దుస్తులను ఒడపుగా తీయడం.. ఒంటికాలిపై నిల్చుని బంతిని గిరగిరా తిప్పడం.. ఇలా చాలా రకాల ఫీట్లతో అదరగొట్టేశాడు. దీంతో అతను చేసే ఫీట్లు మైదానంలో ఆడే ప్లేయర్ల కంటే గొప్పగా ఉన్నాయంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Story first published: Monday, June 18, 2018, 15:15 [IST]
Other articles published on Jun 18, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+