న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలో చిందులు వేసిన దేశాధ్యక్షుడు

French President Macron has plenty of fun at World Cup final

హైదరాబాద్: రష్యా వేదికగా జూన్ 14న మొదలై.. జూలై 15వరకూ జరిగిన క్రీడా సంరంభం ఫిఫా విజేతగా ఫ్రాన్స్ నిలిచింది. ఈ ఫైనల్ సమరాన్ని వీక్షించేందుకు రష్యా అధ్యక్షుడితో పాటు ఫ్రాన్స్, క్రొయేషియా అధినేతలు కూడా స్టేడియంకు విచ్చేశారు. ఈ క్రమంలో ఫ్రాన్స్ వరుస గోల్స్ చేస్తుండగా.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్ సంబరాలు జరుపుకున్నాడు.

1
958085

విజేతలను ఒక్కొక్కరిని ప్రత్యేకంగా

అత్యంత ఉత్సాహంగా కనిపిస్తూ కూర్చున్న సీట్‌లోంచి లేచి ఆటగాళ్లకు వైపు చూస్తూ ప్రోత్సాహాన్ని అందించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే స్టేడియంలో కనిపించిన ఎమ్యానుయేల్ పూర్తయ్యేవరకూ ఉండి.. ప్రపంచ కప్ గెలుచుకున్న విజేతలను ఒక్కొక్కరిని ప్రత్యేకంగా అభినందించారు. ఫ్రాన్స్ జట్టు ఆటగాళ్లు కిలాన్ ఎంబాపే, ఆంటోనీ గ్రీజ్‌మన్‌ను ప్రేమ పూర్వకంగా నుదుటిపై ముద్దు పెట్టి ఆశీర్వదించారు.

ప్రెసిండెంట్ బుగ్గలపై ముద్దు పెట్టి

ప్రత్యర్థి జట్టు క్రొయేషియా ప్రెసిడెంట్ గ్రాబర్-కిటారొవిచ్ కూడా తమ జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న దృశ్యాన్ని చూసేందుకు విచ్చేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత వారిద్దరూ స్నేహపూర్వకంగా కలుసుకున్నారు. ఈ క్రమంలో.. క్రొయేషియా ప్రెసిండెంట్ బుగ్గలపై ముద్దు పెట్టి తన ఆనందాన్ని తెలియజేశాడు.

పుతిన్‌ మాత్రమే తడవకుండా

స్టేడియంలో ఏర్పాటు చేసిన స్టేజీపై ఎంతో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరుగబోతుండగా.. ఒక్కసారిగా వర్షం పడింది. ప్రపంచ అధినేతలందరూ వర్షంలోనే తడిసిముద్దవుతూ.. ఈ వేడుకను ఎంజాయ్‌ చేస్తుండగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మాత్రం చినుకు సైతం తనపై పడకుండా.. గొడుగు వేసుకుని నిల్చున్నారు. అంతటి వర్షంలోనూ ఆటను వీక్షించేందుకు గొడుగు కోసమని వెనక్కి తగ్గలేదు. వర్షంలో తడుస్తూనే మ్యాచ్‌ను వీక్షించారు.

క్రొయేషియాను అధినేత ప్రేమపూర్వకంగా:

ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీలో విజయానికి ఒక్క అడుగుదూరంలో ఆగిపోయిన క్రొయేషియాను తమ దేశ అధినేత ప్రేమపూర్వకంగా ఓదార్చారు. గేమ్ ఓడిపోయినా ఆటగాళ్ల ఆటతీరును మెచ్చుకుంటూ ప్రశంసించారు. వారితో ఫొటోలు దిగి వారిని ఉత్తేజపరిచారు.

Story first published: Monday, July 16, 2018, 12:09 [IST]
Other articles published on Jul 16, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X