Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దాదాపు రెండున్నర కోట్ల ఆదాయాన్ని దానంగా ఇచ్చిన 19 ఏళ్ల ఫుట్‌బాలర్..!!

France Star Kylian Mbappe Donating World Cup Bonus to Child Disability

హైదరాబాద్: 1958వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ ఒక్క ప్లేయర్ కూడా ఒకటి మించిన గోల్స్ చేయలేకపోయారు. ఇప్పుడు ఆ రికార్డును ఎంబపె దాటేశాడు. రష్యా వరల్డ్ కప్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అతని పేరు మారుమోగి పోతుంది. ఈ 19 ఏళ్ల ఫ్రాన్స్‌ కుర్రాడు ప్రపంచకప్‌లో అర్జెంటీనాతో జరిగిన నాకౌట్‌ మ్యాచ్‌లో రెండు గోల్స్‌ చేసి.. మెస్సి జట్టును ఇంటికి పంపడంలో కీలకపాత్ర పోషించాడు.

నాలుగు నిమిషాల(64వ, 68వ నిమిషంలో) వ్యవధిలోనే రెండు గోల్‌లు చేసి అప్పటివరకూ సమానంగా సాగుతున్న మ్యాచ్‌ను ఒక్కసారిగా ఫ్రాన్స్‌వైపు తిప్పాడు. 16ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్‌ ఫుట్‌బాలర్‌గా కెరీర్‌ ఆరంభించిన ఈ ఫ్రెంచ్‌ ఆటగాడు అతి తక్కువ కాలంలోనే జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఒకవైపు ఆటలో అత్యుత్తమ ప్రదర్శనతో మైదానంలో ఆకట్టుకుంటున్న ఈ యువ ఆటగాడు.. మరోవైపు దాతృత్యంలోనూ తన ఉదారత్వాన్ని చాటుకుంటున్నాడు.

'ఎంబపే ప్రపంచకప్‌లో ఫ్రాన్స్‌ తరఫున ఆడినందుకు వచ్చే మ్యాచ్‌ ఫీజును(ఒక్కో మ్యాచ్‌కు రూ.16లక్షలు) విరాళంగా ఓ స్వచ్ఛంద సంస్థకు ఇవ్వనున్నట్లు' తాజాగా తెలిసింది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి ఆటగాళ్లకు డబ్బు అవసరం లేదని ఎంబపే నమ్మకం. పారిస్‌లోని ఒక స్వచ్ఛంద సంస్థకు సంరక్షకుడిగా ఉన్న ఎంబపే.. అక్కడి వికలాంగ పిల్లలకు క్రీడా కార్యక్రమాలు నిర్వహించడానికి గానూ ప్రపంచకప్‌ ద్వారా తనకొచ్చే ఆదాయాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిసింది.

అంటే.. ఒక్కో మ్యాచ్‌కు వచ్చే రూ.15 లక్షల పైగా ఆదాయాన్ని దాంతో పాటుగా అతనికి వచ్చే బోనస్ కూడా కలిపి రెండున్నర కోట్లకు పైగా ఆదాయాన్ని దానం ఇస్తానని మాటిచ్చాడట. ఇంకా గతేడాది ఒప్పందం ప్రకారం.. మొనాకో జట్టు నుంచి అతనికి రూ.1500కోట్లకు పైగా ఆదాయం అతని ఖాతాలోకి చేరనుంది.

నాకౌట్‌లో అర్జెంటీనాను ఇంటికి పంపి ఫ్రాన్స్‌ క్వార్టర్స్‌కు చేరుకుంది. జులై 6న ఫ్రాన్స్‌ క్వార్టర్స్‌లో మరో మాజీ ఛాంపియన్‌ ఉరుగ్వేతో తలపడనుంది. పీలె కంటే రెండేళ్ల వయస్సు ఎక్కువగా ఉన్న ఎంబపేను ఫ్రాన్స్ స్టార్ ఆటగాడైన పీలె ఇప్పటికీ, మరెప్పటికీ ఎంబపే ఓ స్టార్ ఆటగాడిలా గుర్తుండిపోతాడంటూ పేర్కొన్నాడు.

Story first published: Monday, July 2, 2018, 16:07 [IST]
Other articles published on Jul 2, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+