For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎంబపె మెరుపులు, విరాళంగా మూడున్నర కోట్ల రూపాయలు

Frances 19-year-old wonderkid is donating his World Cup winnings to charity - and the total could be more than $500,000

హైదరాబాద్: ఫుట్‌బాల్ గోల్స్‌తోనే కాదు.. తన ఔదార్యంతోనూ అభిమానుల మనస్సు గెలుచుకున్నాడు ఎంబపే. రష్యా వేదికగా ముగిసిన ఫిఫా ప్రపంచకప్‌ పోటీల్లో ఫ్రాన్స్‌ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఫైనల్లో గోల్‌ కొట్టి ఫ్రాన్స్‌కు ఆధిక్యాన్ని అందించాడు. అంతేకాదు ప్రపంచకప్‌ ఫైనల్లో గోల్‌ కొట్టిన పిన్న వయస్కుడిగా కూడా ఎంబపె రికార్డు సృస్టించాడు. దీంతో ఈ 19 ఏళ్ల యువ సంచలనం ఇప్పుడు ఫ్రాన్స్‌ హీరో అయ్యాడు.

తాను అందుకునే మొత్తాన్ని ఛారిటీకి

తాను అందుకునే మొత్తాన్ని ఛారిటీకి

ఈ టోర్నీ ద్వారా తాను అందుకునే మొత్తాన్ని ఛారిటీకి ఇస్తున్నట్లు ప్రకటించి అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు. ప్రపంచకప్‌ టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడినందుకు అతడికి 22,500 డాలర్లతో పాటు ఫైనల్‌లో విజేతగా నిలిచినందుకు సుమారు 3.5లక్షల డాలర్లను అదనంగా అందుకోనున్నాడు. ఫిఫా ప్రపంచకప్‌ టోర్నీ ద్వారా ఎంబపె అసలు అందుకోవాల్సింది సుమారు 5లక్షల డాలర్లు.

 క్రీడాభివృద్ధికి, అనారోగ్యంతో బాధపడుతోన్న

క్రీడాభివృద్ధికి, అనారోగ్యంతో బాధపడుతోన్న

భారత కరెన్సీలో సుమారు రూ.3.4 కోట్లకు పైనే. ఈ మొత్తాన్ని అతడు ఛారిటీకి ఇవ్వనున్నట్లు తెలిపి తన దాతృత్వాన్ని చాటాడు. క్రీడాభివృద్ధికి, అనారోగ్యంతో బాధపడుతోన్న చిన్నారులకు ఈ మొత్తాన్ని వాడాలని స్వచ్ఛంద సంస్థను ఎంబపె కోరాడట.

అభిమాన ఆటగాళ్లకు హైఫై

అభిమాన ఆటగాళ్లకు హైఫై

అభిమానులతోనూ అదే స్థాయిలో స్పందిస్తున్నాడు. క్రొయేషియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌ 53వ నిమిషంలో ఓ నలుగురు అభిమానులు ఆకస్మాత్తుగా మైదానంలోకి దూసుకొచ్చారు. దీంతో కొద్దిసేపు ఆటకు అంతరాయం కలిగింది. అయితే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. మైదానమంతా పరుగెత్తారు. అంతటితో ఆగకుండా అభిమాన ఆటగాళ్లకు హైఫై ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం ఓ మహిళా అభిమానికి ఫ్రాన్స్‌ స్టార్‌ ప్లేయర్‌ ఎంబాపే హైఫై ఇచ్చాడు.

ట్రోఫీని ముద్దాడుతూ.. ఫోజిచ్చిన ఫొటో

ట్రోఫీని ముద్దాడుతూ.. ఫోజిచ్చిన ఫొటో

మ్యాచ్‌ అనంతరం 'మైలవ్‌' అనే క్యాప్షన్‌తో ట్రోఫీని ముద్దాడుతూ.. ఫోజిచ్చిన ఫొటోను ఎంబాపె ట్వీట్‌ చేశాడు. అయితే ఈ ట్వీట్‌కు పీలేనే తొలుత స్పందించడం విశేషం. 'కైలిన్‌ నా రికార్డును సమం చేశాడు.. ఇక నా బూట్లకున్న దుమ్ముదులిపి బరిలోకి దిగాల్సిందే' అని ట్వీట్‌ చేశాడు. అంతకు ముందు 'వెలకమ్‌ టూ ది క్లబ్‌' అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ వైరల్‌ అయ్యాయి.

Story first published: Tuesday, July 17, 2018, 14:10 [IST]
Other articles published on Jul 17, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+