Fifa World Cup 2022: పోలండ్‌ను ఓడించి క్వార్టర్స్ చేరిన డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్

ఫిఫా వరల్డ్ కప్ డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ క్వార్టర్స్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. పోలండ్‌తో జరిగిన రౌండ్ ఆఫ్ 16 గేమ్‌లో అద్భుతమైన ఆధిపత్యం చెలాయించిన జట్టు.. క్వార్టర్ ఫైనల్స్ చేరింది. ఈ మ్యాచ్‌లో ఒకానొక దశలో 3-0 ఆధిక్యంలో నిలిచింది ఫ్రాన్స్. అయితే చివర్లో పోలండ్ ప్లేయర్ తమకు దక్కిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచడంతో ఈ ఆధిక్యం 3-1కు తగ్గింది.

రెండు జట్ల ప్రయాణం..
ఈ ఏడాది ఫిఫా వరల్డ్ కప్‌ను ఫ్రాన్స్ జట్టు ఘనంగా ఆరంభించింది. గ్రూప్ డిలో ఆస్ట్రేలియా, డెన్మార్క్‌ను చిత్తు చేసిన ఫ్రాన్స్.. ట్యునీషియా చేతిలో ఓటమి పాలైంది. దీంతో ఆరు పాయింట్లతో ఆ గ్రూప్ టాపర్‌గా నాకౌట్స్ చేరింది. మరోవైపు పోలండ్ జట్టు గ్రూప్ సిలో నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ జట్టు పెద్దగా గోల్స్ చేయకపోయినా బలమైన డిఫెన్స్‌కు తోడు గోల్ కీపర్ వోజీక్ సెన్సీపై ఎక్కువగా ఆధార పడింది.

తొలి హాఫ్ చివర్లో ఫ్రాన్స్ పైచేయి..
ఈ రెండు జట్లు నాకౌట్ గేమ్‌ను బలంగా ఆరంభించే ప్రయత్నం చేశాయి. అయితే ఫ్రాన్స్ తమ ప్రత్యర్థిపై కొద్దిగా పైచేయి సాధించింది. తొలి హాఫ్‌లో 56 శాతం బాల్ పొసెషన్ సాధించిన ఫ్రాన్స్.. తొమ్మిది సార్లు గోల్ చేసే ప్రయత్నం చేసింది. అదే సమయంలో పోలండ్ కూడా ఎనిమిదిసార్లు గోల్ చేయడానికి ట్రై చేసింది. అయితే రెండు జట్లు గోల్ చెయ్యలేకపోయాయి. ఇలాంటి సమయంలో కిలియన్ ఎంబాపే నుంచి పాస్ అందుకున్న ఆలివియర్ గిరోడ్ ఈ మ్యాచ్‌లో తొలి గోల్ సాధించాడు. ఇది అతని కెరీర్‌లో ఫ్రాన్స్ తరఫున 52వ గోల్. దీంతో ఫ్రాన్స్ తరఫున అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా గిరోడ్ రికార్డు సృష్టించాడు.

ఎంబాపే డబుల్ గోల్స్..
సెకండ్ హాఫ్ ప్రారంభమైన తర్వాత కూడా రెండు జట్లు గోల్స్ చేయడానికి స్ట్రగుల్ అయ్యాయి. అయితే 74వ నిమిషంలో ఫ్రాన్స్ జట్టే మరో గోల్ చేసింది. ఒస్మాన్ డెంబెలే అందించిన పాస్‌ను ఎంబాపే గోల్‌గా మలిచాడు. సెకండ్ హాఫ్ స్టాపేజ్ టైంలో ఎంబాపే మరో గోల్ చేయడంతో ఫ్రాన్స్ జట్టు 3-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే చివర్లో కమిల్ గ్రోసికిని ఫ్రాన్స్ ఫౌల్ చేసింది. దీంతో పోలండ్‌కు పెనాల్టీ కిక్ లభించింది. మొదటి ప్రయత్నంలో గోల్ చేయలేకపోయిన ఆ జట్టు.. ఆ తర్వాతి ప్రయత్నంలో రాబర్ట్ లెవాండోస్కి గోల్ చేయడంతో పరువు నిలుపుకుంది. ఈ మ్యాచ్‌లో 3-1 తేడాతో విజయం సాధించిన ఫ్రాన్స్.. క్వార్టర్ ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications