Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Fifa World Cup 2022: డెన్మార్క్‌పై గెలిపించిన ఎంబాపే.. నాకౌట్స్ చేరిన తొలి జట్టు ఫ్రాన్స్

France reaches knockouts after defeating Denmark 2-1

ఫిఫా వరల్డ్ కప్ నాకౌట్స్‌లో అందరి కన్నా ముందు ఫ్రాన్స్ అడుగు పెట్టింది. డెన్మార్క్‌పై 2-1 తేడాతో విజయం సాధించిన డిఫెండింగ్ ఛాంపియన్.. ఈ వరల్డ్ కప్‌లో నాకౌట్స్ చేరిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. గత మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 4-1తో చిత్తు చేసిన ఫ్రాన్స్.. డెన్మార్క్‌తో మ్యాచ్‌లో కూడా అదే జోరు కొనసాగించింది. అయితే డెన్మార్క్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. కానీ ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాపే చెలరేగి చివర్లో రెండు గోల్స్ సాధించడంతో డెన్మార్క్‌కు ఓటమి తప్పలేదు.

ఈ మ్యాచ్‌ తొలి హాఫ్‌లో రెండు జట్లూ బంతి పొసెషన్‌ను దాదాపు పంచుకున్నాయి. అయితే ఫ్రాన్స్ జట్టు 13 సార్లు గోల్ చేసేందుకు ప్రయత్నించింది. ఇదే సమయంలో డెన్మార్క్‌కు కేవలం రెండు సార్లు మాత్రమే గోల్ చేసే ఛాన్స్ దొరికింది. కానీ రెండు జట్లూ గోల్ చెయ్యలేకపోయాయి. దీంతో తొలి హాఫ్‌ 0-0తో ముగిసింది. సెకండ్ హాఫ్‌లో ఫ్రాన్స్ జట్టు ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది.

France reaches knockouts after defeating Denmark 2-1

చక్కని పాస్‌లతో డెన్మార్క్ గోల్ పోస్ట్ వరకు చేరుకున్న ఫ్రాన్స్ ఆటగాళ్లు పలుమార్లు స్కోర్ చేసే ప్రయత్నం చేశారు. చివరకు 61వ నిమిషంలో వారి ప్రయత్నాలు ఫలించాయి. ఎంబాపే చేసిన గోల్‌తో ఫ్రాన్స్ ఆధిక్యం సాధించింది. కానీ డెన్మార్క్ వెంటనే తేరుకుంది.

ఫ్రాన్స్ గోల్ చేసిన ఏడు నిమిషాల వ్యవధిలోనే డెన్మార్క్ కూడా గోల్ చేసి స్కోర్లు సమం చేసింది. అయితే మ్యాచ్ మరికాసేపట్లో ముగుస్తుంది అనగా.. 86వ నిమిషంలో మరో గోల్ చేసిన ఎంబాపే తన జట్టును గెలిపించుకున్నాడు. దీంతో ఈ గ్రూప్ నుంచి ఫ్రాన్స్ జట్టు నేరుగా నాకౌట్ చేరింది. డెన్మార్క్ జట్టు తర్వాతి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై నెగ్గితే నాకౌట్స్ చేరే అవకాశం ఉంటుంది.

Story first published: Sunday, November 27, 2022, 9:56 [IST]
Other articles published on Nov 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+