న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

మిన్నంటిన ఫ్రాన్స్ ఫుట్‌బాల్ అభిమానుల సంబరాలు (వీడియో)

 France fans celebrate in Paris after side reaches the World Cup final – video

హైదరాబాద్: ప్రపంచ ఖ్యాతి గడించిన ఫుట్‌బాల్‌‌.. మెగా సంబరమైన ఫిఫా వరల్డ్ కప్ 2018 సెమీస్ దశకు చేరుకుంది. గ్రూపు దశ నుంచే నిష్క్రమణ మొదలవడంతో.. క్వార్టర్స్‌ను దాటి సెమీస్‌లోకి అడుగుపెట్టింది ఫ్రాన్స్.. ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్లోకి ఫ్రాన్స్ జట్టు అడుగుపెట్టడంతో ఆ దేశంలో సంబరాలు మిన్నంటాయి. దేశంలోని ఫుట్‌బాల్ అభిమానులు రోడ్లపైకి భారీగా తరలివచ్చి సంబరాలు చేసుకున్నారు.

ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక

మ్యాచ్ మొదలుపెట్టడమే బెల్జియం ఫేవరేట్‌గా బరిలోకి దిగడంతో.. ఫ్రాన్స్ ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూశారు. మొదటి అర్థభాగం పూర్తి అయినా ఒక్కగోల్ కూడా నమోదు కాకపోవడంతో.. విజయంపై మరింత ఆసక్తి పెరిగింది. సరిగ్గా అదే సమయంలో.. 51వ నిమిషంలో శామ్యూల్ ఉమ్మటి హెడర్‌ గోల్‌తో ఫ్రాన్స్‌కి 1-0తో ఆధిక్యం అందించాడు.

దీంతో.. ఒత్తిడికి గురైన బెల్జియం ఆఖరి వరకూ ఆధిక్యాన్ని సమం చేసేందుకు ప్రయత్నించినా.. ఆ జట్టుకి నిరాశే ఎదురై.. బెల్జియంతో మంగళవారం అర్ధరాత్రి జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 1-0 తేడాతో గెలిచిన ఫ్రాన్స్ జట్టు తుది పోరుకి అర్హత సాధించింది.

1998లో తొలిసారి ఫిఫా వరల్డ్‌కప్‌ను గెలిచిన ఫాన్స్.. ఆ తర్వాత 2006లో ఫైనల్‌ చేరినా.. అక్కడ ఇటలీ చేతిలో అనూహ్యంగా ఓడిపోయి కొద్దిలో కప్‌ను చేజార్చుకుంది. ఆ తర్వాత రెండు పర్యాయాలు నిరాశపరిచిన ఫ్రాన్స్.. తాజాగా ఫైనల్‌కి చేరడం అక్కడి అభిమానుల్లో చెప్పలేనంత ఉత్సాహం నింపింది. బుధవారం రాత్రి ఇంగ్లాండ్, క్రొయేషియా మధ్య జరగనున్న రెండో సెమీ ఫైనల్ విజేతతో ఆదివారం ఫ్రాన్స్‌ ఫైనల్ ఆడనుంది.

Story first published: Wednesday, July 11, 2018, 13:11 [IST]
Other articles published on Jul 11, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X