న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

Fifa World Cup 2022: ఆసీస్‌ను 4-1తో చిత్తు చేసిన ఫ్రాన్స్.. డిఫెండింగ్ ఛాంపియన్‌ ఘనమైన ఆరంభం

France begins their campaign at Fifa World Cup 2022 with a 4-1 win

ఫిఫా వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ ఈసారి తన ప్రయాణాన్ని ఘనంగా ఆరంభించింది. ఆస్ట్రేలియాతో జరిగిన తన తొలి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించింది. గ్రూప్-డీలో భాగంగా ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆరంభంలోనే ఆసీస్ జట్టు తొలి గోల్ చేసింది. దీంతో ఫ్రాన్స్ అభిమానులు టెన్షన్‌లో పడిపోయారు. ఆట మొదలైన 9వ నిమిషంలోనే ఆసీస్ ప్లేయర్ క్రెగ్ గుడ్‌విన్ అద్భుతమైన గోల్ చేశాడు. దీంతో ఆ జట్టు ఫ్రాన్స్‌పై 1-0 ఆధిక్యం సాధించింది.

అయితే ఆస్ట్రేలియా సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. ఈ ఒత్తిడి నుంచి వెంటనే తేరుకున్న ఫ్రాన్స్.. 27వ నిమిషంలో తొలి గోల్ చేసింది. ఆడ్రియన్ రాబియట్ ఈ గోల్ సాధించాడు. దీంతో రెండు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. మరో ఐదు నిమిషాల తర్వాత ఫ్రాన్స్ స్టార్ ఆలివియర్ గిరోడ్ మరో గోల్ చేశాడు. ఈ గోల్ సాయంతో ఫ్రాన్స్ ఈ మ్యాచ్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదే స్కోరుతో మ్యాచ్ తొలి అర్ధభాగం ముగిసింది.

సెకండ్ హాఫ్‌లో పూర్తిగా కంఫర్టబుల్‌గా కనిపించిన ఫ్రాన్స్ జట్టు మంచి కమాండ్ కనబరిచింది. మంచి అవకాశాలు సృష్టించుకుంది. అయితే ఇవేమీ చివరకు ఫలించలేదు. అలాంటి సమయంలో 68వ నిమిషంలో ఎంబాపే అద్భుతమైన హెడర్‌తో మరో గోల్ చేశాడు. దీంతో 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది ఫ్రాన్స్. ఇది జరిగిన ఐదు నిమిషాల వ్యవధిలోనే మరోసారి ఆలివియర్ గిరోడ్ సత్తా చాటాడు. మరో గోల్ చేశాడు. ఇదే ఈ మ్యాచ్‌లో చివరి గోల్. దీంతో ఆరంభంలో ప్రత్యర్థిదే పైచేయి అయినప్పటికీ చివరకు ఫ్రాన్స్ జట్టు 4-1 తేడాతో ఆస్ట్రేలియా టీంను చిత్తుగా ఓడించింది. తమ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాను ఘనంగా చాటుకుంది. ఇది చూసిన ఫ్రాన్స్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Story first published: Wednesday, November 23, 2022, 8:55 [IST]
Other articles published on Nov 23, 2022
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X