U-17లోకి యువరక్తం: 4గురికి మాత్రమే ఛాన్స్
న్యూఢిల్లీ: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణాశిబిరాల నుంచి యు-17 జాతీయ జట్టులోకి నలుగురు కుర్రాళ్లు ఎంపికయ్యారు. దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు, గోవా, కల్యాణి నగరాల్లో ఎఐఎఫ్ఎఫ్ ఆధ్వర్యంలో ఇండియా మాజీ సారధి అభిషేక్ యాదవ్ సారధ్యంలో కొత్త కుర్రాళ్లకు శిక్షణనిస్తున్నారు. ఎఐఎఫ్ఎఫ్ స్కౌటింగ్ డైరెక్టర్‌గా అభిషేక్‌యాదవ్ వ్యవహరిస్తున్నారు.
ఇటీవల జరిగిన బ్రిక్స్ 'యు - 17' కప్‌లో భారత్ జట్టు ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు. మళ్లీ అదేజట్టును వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు ఎఐఎఫ్ఎఫ్ శిక్షణనిస్తున్నది. భారత్‌కు ఈ టోర్నీ అత్యంత ప్రతిష్ఠాత్మకం కానున్నది. సొంతగడ్డపై జరుగనున్న టోర్నీలో దేశీయ అభిమానుల మద్దతుతో యు - 17 కుర్రాళ్లు దూసుకెళ్లగలరని అంతా ఆశిస్తున్నారు.
'వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనేందుకు తమ కుర్రాళ్లకు మరో చాన్స్ లభిస్తుందని నేను హామీ ఇవ్వలేదు. కానీ మరో అవకాశాన్ని వారు సాధించుకుంటారని విశ్వాసంతో ఉన్నా. మా జట్టు బ్రెజిల్, రష్యా దేశాల్లో జరిగే టోర్నమెంట్లలో పాల్గొని తిరిగొచ్చిన తర్వాత నలుగురు కుర్రాళ్లు మాతో జాయన్ అవుతారు' అని జర్మనీ కోచ్ నికొలయ్ ఆడం తెలిపాడు.

శిక్షణా కార్యక్రమాల్లో చురుగ్గా
‘నేను కోచ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పూర్తిగా చురుగ్గా శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. నేను బాధ్యతలు నిర్వహిసున్న టీంలలో బెటర్‌గా ఉన్న జట్టు ఇది. మేం ఎంపిక చేసిన నలుగురు కుర్రాళ్ల ప్రతిభ నిజంగా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది' అని అన్నాడు. బెస్ట్ పెర్పార్మెన్స్‌పై భారత్ ఆశాభావంతో ఉంది. ట్రయల్స్‌లో భాగంగా ఎఐఎఫ్ఎఫ్ యు - 16 లీగ్ కోసం శిక్షణనిస్తున్న 55 టీంల నుంచి ముగ్గురు బెస్ట్ కుర్రాళ్లను పంపుతుందని భావిస్తున్నారు.

140 మంది కుర్రాళ్లకు శిక్షణ
ఢిల్లీ, గోవా, కల్యాణి పట్టణాల పరిధిలోని శిక్షణా శిబిరాల్లో 140 మంది కుర్రాళ్లకు చివరిదశ శిక్షణ కొనసాగుతున్నది. వీరి నుంచే తుది 11 మంది జట్టును ఎంపికచేసే అవకాశాలు ఉన్నాయి. వారిలో నుంచే నికోలయ్ ఆడం నలుగురు చాకుల్లాంటి కుర్రాళ్లను యు - 17 జట్టు కోసం ఎంపికచేశాడు. ఫుట్‌బాల్ పట్ల ఆసక్తిగల కుర్రాళ్లకు శిక్షణ ఇవ్వడం వల్ల దీర్ఘకాలికంగా భారత్ పుట్ బాల్ జట్టుకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని నికొలస్ ఆడం వ్యాఖ్యానించాడు.

నలుగురు కుర్రాళ్లు ఎంపిక
ఇప్పటివరకు జరిగిన వివిధ టోర్నమెంట్లలో జట్టు పేలవ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఎఐఎఫ్ఎఫ్.. కొత్త కుర్రాళ్లకు శిక్షణ ఇవ్వాలని కొత్త ఆలోచనను ఆచరణలోకి తీసుకొచ్చింది. ఎఐఎఫ్ఎఫ్ స్కౌటింగ్ డైరెక్టర్ అభిషేక్‌యాదవ్ మాట్లాడుతూ ‘ఎఐఎఫ్ఎఫ్ నిర్వాహకులకు వచ్చిన నోవెల్ ఐడియాను ఆహ్వానిస్తున్నాం. దీనివల్ల యు-16 క్లబ్‌ల నుంచి నలుగురు కుర్రాళ్లను ఎంపికచేయగలిగాం. ఫుట్ బాల్ ఆడాలని ఆసక్తిగల యువకుల కోసం వారు ఎలా ఆడాలి, ఎలా అవకాశాలు పొందాలనే అంశంపై చాన్స్ ఇవ్వాలని భావించాం. అందుకోసం మేం అదనపు రౌండ్ల శిక్షణ ఇవ్వడం అవసరమని భావించాం. నాకు ఎఐఎఫ్ఎఫ్ బోర్డు మంచి అవకాశం ఇచ్చింది. అత్యంత ముఖ్యమైన విధాన నిర్ణయం తీసుకునేందుకు సహకరించింది' అని అన్నాడు.

కుర్రాళ్లలో నైతిక విలువలు
అభిషేక్ పర్యవేక్షణలో కుర్రాళ్లు శిక్షణను పెంపొందిస్తూ నెట్‌వర్క్ విస్తరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కుర్రాళ్లలో నైతిక విలువలను పెంపొందించడంలో అద్భుతంగా వ్యవహరిస్తున్నాడని, కుర్రాళ్లను మెరికల్లా తీర్చిదిద్దడం వల్ల తమ పని తేలికవుతుందని నికోలయ్ ఆడం తెలిపాడు. వచ్చే ఏడాది అక్టోబర్‌లో జరిగే ఫిపా యు-17 వరల్డ్‌కప్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications