
హైదరాబాద్: మాజీ సెవెల్లా, ఆర్సెనల్ స్టార్ పుట్‌బాలర్ జొస్ అంటినో రెయెస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 35 ఏళ్ల జొస్ అంటినో రెయెస్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు స్పానిష్ క్రికెట్ క్లబ్ సెవెల్లా అధికారికంగా ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
"సెవెల్లా స్టార్ ఫుట్‌బాలర్ జొస్ అంటినో రెయెస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడనే దుర్వార్త తెలియజేస్తునందుకు చింతిస్తున్నాం" అని ఒక ట్వీట్‌లో పేర్కొంది. స్పెయిన్ తరఫున 21 సార్లు అంతర్జాతీయ క్యాప్‌లను అందుకున్నాడు. రాజధాని ఆండల్సియాకు కొద్ది మైళ్ల దూరంలో ఉన్న సెవెల్ల అకాడమీలో తన కెరీర్‌ను ఆరంభించాడు.
టీనేజర్‌గా సెవెల్లా క్లబ్ తరుపున అత్యధిక మనీని అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2003-04 ప్రీమియర్ లీగ్‌లో ఆర్సెనల్ జట్టుకు జొస్ అంటినో రెయెస్ ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత వరుసగా మూడేళ్ల పాటు ఆ జట్టుకే ఆడాడు. ప్రస్తుతం జొస్ ఎక్స్‌ట్రెమాడురా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.