బలవంతంగా పడకగదికి తీసుకెళ్లి రేప్ చేశాడు: రొనాల్డోపై మాజీ మోడల్

హైదరాబాద్: పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో చిక్కుల్లో పడ్డాడు. 2009లో లాస్‌వెగాస్‌లోని ఓ హోటల్ గదిలో రొనాల్డో తనపై అత్యాచారం చేశాడని కేథరిన్ మయోర్గా అనే అమెరికా మాజీ మోడల్ ఆరోపించింది. ఈ మేరకు గత నెలలో నెవడా కోర్టులో కేసు వేసింది. వద్దు వద్దంటూ తాను అరిచినా రొనాల్డో వినలేదని ఆమె అందులో పేర్కొంది.
లైంగిక దాడి చేశాక రొనాల్డో క్షమాపణలు చెప్పాడని, సాధారణంగా తాను మంచి మనిషినని తెలిపాడని వెల్లడించింది. అయితే, "నాపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం, అవి ఫేక్.. ఫేక్ న్యూస్"అంటూ క్రిస్టియానో రొనాల్డో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్ది సేపటికే ఆ పోస్ట్‌ను డిలీట్ చేయడం విశేషం.

అసలేం జరిగింది?
రొనాల్డో తనను అత్యాచారం చేశాడని తాజాగా ‘మీ టూ' ప్రోగ్రాంలో పాల్గొన్న అమెరికన్ మాజీ మోడల్ కేథరిన్ మయోర్గా తనపై జరిగిన లైంగిక దాడి గురించి వివరించి, కోర్టులో కేసు వేసింది. జూన్ 13, 2009 రోజున లాస్ వెగాస్‌లోని రొనాల్డో తన పెంట్‌హౌస్‌లో తనను హత్యాచారం చేశాడని ఆమె అందులో ఆరోపించింది. ‘‘2009లో లాస్‌వేగాస్‌లోని పామ్స్ హోటల్ రొనాల్డోను కలిశాను. హోటల్లోని తన గదికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. నేను వెళ్లాను" అని తెలిపింది.

రొనాల్డో పేరును పోలీసులకు చెప్పలేదు
"ఓ కార్యక్రమంలో పాల్గొనాలని, దుస్తులు మార్చుకోమని అన్నాడు. మార్చుకోవడానికి బాత్ రూమ్‌కు వెళ్లాను. అక్కడికి వచ్చి నన్ను బలవంతంగా పడకగదికి తీసుకెళ్లి.. వద్దు వద్దు అంటున్నా అత్యాచారం చేశాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. ముందు రొనాల్డో పేరును పోలీసులకు చెప్పలేదు. తర్వాత విచారణలో చెప్పాను. అయితే బ్లాక్‌మెయిల్ చేయడానికే తాను ఇలాంటి ఆరోపణలు చేస్తున్నానని రొనాల్డో వాదించే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు" అని కేథరిన్ వెల్లడించింది.

ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయా
"నాకు వైద్య పరీక్షలు చేసిన నర్సు కూడా ఆ మాటే చెప్పింది. దీంతో అప్పట్లో ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాను. అనంతరం భయపడిన రొనాల్డో తన లాయర్‌తో అగ్రిమెంట్ చేయించి కేసు బయటకి రాకుండా చేశాడు. ఇందుకోసం రొనాల్డో మనుషులు నాకు 3 లక్షల 75 వేల డాలర్లు చెల్లించి ఒప్పందం చేసుకున్నారు. మానసికంగా బలహీనంగా ఉన్న సమయంలో ఆ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అందుకే దానిని రద్దు చేయండి" అని తాను వేసిన దావాలో పేర్కొంది.

కేసును రీఓపెన్ చేసి దర్యాప్తు ప్రారంభించిన లాస్ వేగాస్ పోలీసులు
ప్రస్తుతం లాస్ వెగాస్ పోలీసులు కూడా ఆ కేసును రీఓపెన్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఏ రొనాల్డో అంటూ ఎక్కడ చెప్పకపోవడంతో అందరూ క్రిస్టియానో రొనాల్డో అని అనుకుంటున్నారు. అయితే అత్యుత్సాహం ప్రదర్శించిన జర్మన్ మ్యాగజైన్ క్రిస్టియానో రొనాల్డో ఫోటో కవర్ పేజీపై వేసి ఆ వార్త ప్రచురించింది. దీనిపై రొనాల్డో వ్యక్తిగత లాయర్ ఆ మ్యాగజైన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్య్కులేషన్‌ను పెంచుకునే భాగంగా ఇలాంటి నిరాధారిత వార్తలు రాయడం తగదని అన్నారు. జర్మన్ మ్యాగజైన్‌పై దావా వేయనున్నట్లు ప్రకటించారు. అది తప్పుడు వార్త అని, చట్టవ్యతిరేకమని తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications