18 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సాకర్ దిగ్గజం

హైదరాబాద్: స్పెయిన్ వరల్డ్‌కప్ విన్నింగ్ స్ట్రైకర్ ఫెర్నాండో టోర్రెస్ శుక్రవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 18 ఏళ్ల అంతర్జాతీయ పుట్‌బాల్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. గతేడాది జులైలో అట్లెటికో మాడ్రిక్‌కు వీడ్కోలు పలికి జపాన్‌కు చెందిన సగన్ టోసు క్లబ్‌లో జాయిన్ అయ్యాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అయితే, అట్లెటికో మాడ్రిక్ క్లబ్‌లో మాదిరి కెరీర్ అత్యున్నత స్థాయిని అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో తాను రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 23న జపాన్‌లో జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తన రిటైర్మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తానని ట్వీట్ చేశాడు.

2003లో స్పెయిన్ జాతీయ జట్టు తరుపున అరంగేట్రం
2003లో స్పెయిన్ జాతీయ జట్టు తరుపున అరంగేట్రం చేసిన ఫెర్నాండో టోర్రెస్ అట్లెటికో మాడ్రిడ్, లివర్ పూల్, చెల్సియా క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 2003 నుంచి 2014 స్పెయిన్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన టోర్రెస్ అత్యధిక గోల్స్ సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు.

2010లో ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌లో
డేవిడ్ విల్లా(59), రౌల్(44) గోల్స్‌తో మొదటి, రెండు స్థానాల్లో ఉన్నారు. 2008లో యూరో ఛాంపియన్‌షిప్‌తో పాటు 2010లో ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో స్పెయిన్ టైటిల్ విజేతగా నిలవడంలో ఫెర్నాండో టోర్రెస్ కీలకపాత్ర పోషించాడు. 2012 యూరో ఛాంపియన్‌షిప్‌లో స్పెయిన్ తరుపున అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.

2007 నుంచి 2011 వరకు లివర్‌పూల్ తరుపున
2007 నుంచి 2011 వరకు లివర్‌పూల్ తరుపున 142 గేమ్స్ ఆడిన టోర్రెస్ 81 గోల్స్ చేశాడు. టోర్రెస్ కోసం లివర్‌పూల్ క్లబ్ యాజమాన్యం అత్యధికంగా 50 మిలియన్ పౌండ్లు చెల్లించి చెల్సియా నుంచి కొనుగోలు చేసింది. అట్లెటికో మాడ్రిడ్ తరఫున ఆడిన 394 గేమ్స్‌లో 128 గోల్స్, లివర్ పూల్‌కు ఆడిన 142 గేమ్స్‌లలో 81 గోల్స్, చెల్సియాకు ఆడిన 172 గేమ్స్‌లలో 45 గోల్స్ సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications