Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యూరోపియన్ క్లబ్‌లో చోటు కోసం ధీరజ్‌సింగ్ ప్లాన్!!

Former Indian Arrows goalkeeper Dheeraj Singh offered Motherwell FC deal

హైదరాబాద్: ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని భావించిన ధీరజ్ సింగ్ ఈ ఏడాదైనా తన కల సాకారం చేసుకునేందుకు ఆరాటపడుతున్నాడు. ఈ క్రమంలో యూరోపియన్ క్లబ్ తరఫున ఆడేందుకు రంగం సిద్ధం అవుతున్నది. ఈ ఏడాది ప్రారంభంలోనే అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) తరఫున భారతదేశంలో క్రీడాకారుల అభివ్రుద్ధి కార్యక్రమాల నుంచి తప్పుకున్న ధీరజ్ సింగ్‌కు స్కాటిష్ ప్రీమియర్ లీగ్ పరిధిలోని మదర్ వెల్ ఎఫ్‌సీ నుంచి మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రతిపాదనలు వచ్చాయి.

 ముందు వర్క్ పర్మిట్ లభిస్తేనే ఒప్పందంపై ధీరజ్‌సింగ్ సంతకం

ముందు వర్క్ పర్మిట్ లభిస్తేనే ఒప్పందంపై ధీరజ్‌సింగ్ సంతకం

‘ప్రస్తుతానికి మదర్‌వెల్ ఎఫ్ సీ నుంచి ఎటువంటి కాంట్రాక్టు కుదరలేదు. ఇది కేవలం ఆఫర్ మాత్రమే. ఒకవేళ ఆయన వర్క్ పర్మిట్ పొందితే క్లబ్ యాజమాన్యంతో ఒప్పందంపై సంతకం చేస్తారు' అని ధీరజ్ సింగ్ ఏజెంట్ అనూజ్ కిచ్లూ పేర్కొన్నారు.

 ఫిబ్రవరి నుంచి మదర్‌వెల్ ఎఫ్‌సీ క్లబ్‌తో సంప్రదింపులు

ఫిబ్రవరి నుంచి మదర్‌వెల్ ఎఫ్‌సీ క్లబ్‌తో సంప్రదింపులు

ధీరజ్ సింగ్ ఫిబ్రవరి నుంచి ఈ క్లబ్‌తో పాటుగా ప్రయాణిస్తున్నారు. తన 18వ ఏట అడుగు పెడుతున్న ధీరజ్ సింగ్‌కు అన్ని సక్రమంగా జరిగితే వచ్చే జూన్ నెలలో వర్క్ పర్మిట్ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ విషయం ఆయనకు అతి పెద్ద సవాల్‌గా పరిణమించింది. ‘ఆయన వర్క్ పర్మిట్ పొందడానికి 10 శాతం అవకాశం మాత్రమే ఉంది. తొలి ప్రయత్నంలో అవకాశం లభించకపోవచ్చు. వచ్చే ఏడాది సీజన్‌కైనా రెండో ప్రయత్నంలో అవకాశం పొందుతారు' అని అనూజ్ కిచ్లూ తెలిపారు.

 దేశీయ ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 75 శాతం ప్రాతినిధ్యం

దేశీయ ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 75 శాతం ప్రాతినిధ్యం

ఒక ప్లేయర్ తప్పనిసరిగా తన దేశంలోని ఇంటర్నేషనల్ టోర్నమెంట్లలో 75 శాతం ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. క్రీడాకారులంతా అంతర్జాతీయ ప్రమాణాలు సక్రమంగా పాటించినప్పుడే ధీరజ్ సింగ్ లాంటి వాళ్లకు యునైటెడ్ కింగ్ డమ్ పరిధిలో రెండేళ్ల పాటు ఆడేందుకు వర్క్ పర్మిట్ లభిస్తుంది. ఒక దేశ జాతీయ జట్టుకు రెండేళ్ల పాటు ప్రాతినిధ్యం వహించడంతోపాటు ఫిఫా-70 ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకోవాల్సి ఉంటుంది.

 ధీరజ్ సింగ్ ప్రమాణాలన్నీ పూర్తి చేయాల్సిందే

ధీరజ్ సింగ్ ప్రమాణాలన్నీ పూర్తి చేయాల్సిందే

ఈ ప్రమాణాలన్నీ ధీరజ్ సింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మరో సీజన్ వరకు ఒక క్లబ్ లో ఆడాల్సి ఉంటుంది. అప్పుడే 2019 - 20 సీజన్‌లోనైనా మదర్ వెల్ క్లబ్ తరఫున ఆడేందుకు వర్క్ పర్మిట్ లభిస్తుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

లివర్‌పూల్ స్టార్ అలెక్స్ ‘సాకర్' సంరంభానికి దూరమే

లివర్‌పూల్ స్టార్ అలెక్స్ ‘సాకర్' సంరంభానికి దూరమే

లివర్‍పూల్ స్టార్ ఆటగాడు అలెక్స్ ఆక్లేడ్ చంబార్లియన్ వచ్చే జూన్ 14వ తేదీ నుంచి జరిగే సాకర్ సంరంభానికి దూరం కాక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. రష్యాలో జరిగే ఫిఫా వరల్డ్ కప్ టోర్నీకి వెళ్లే క్రీడాకారుల జాబితా నుంచి అలెక్స్ ఆక్లేడ్ చంబార్లియన్ పేరు కూడా తప్పించేశారు. యూసీఎల్ టోర్నీలో ఎఎస్ రోమ జట్టుపై జరిగిన మ్యాచ్‌లో మోకాలి స్నాయువు (లిగమెంట్)కు గాయపడటమే దీనికి కారణం.

 ప్రీమియర్ లీగ్ టోర్నీకి అలెక్స్ ఆక్లేడ్ చంబార్లియన్ దూరమే

ప్రీమియర్ లీగ్ టోర్నీకి అలెక్స్ ఆక్లేడ్ చంబార్లియన్ దూరమే

ఈ గాయంతో ప్రీమియర్ లీగ్ టోర్నీలో ఇకముందు జరిగే మ్యాచ్‌ల్లోనూ అలెక్స్ ఆక్లేడ్ చంబార్లియన్ ఆడలేడు. యూఈఎఫ్ఏ టోర్నమెంట్‌ ఫైనల్స్ నాటికైనా ప్రగతి సాధిస్తాడని రోమా జట్టు యాజమాన్యం ఆశాభావంతో ఉన్నా సంబంధిత క్లబ్ మెడికల్ టీం అటువంటి గ్యారంటీలేమీ ఇవ్వడం లేదు. అంతేకాదు అలెక్స్ ఆక్లేడ్ చంబార్లియన్ ఎప్పటివరకు కోలుకుంటాడని చెప్పలేమని తేల్చేసింది. కానీ ఆక్లేడ్ చంబార్లియన్ మాత్రం తనకు తాను త్వరితగతిన కోలుకునేందుకు ఫిట్ నెస్ సాధించేందుకు చర్యలు చేపట్టనున్నాడు.

Story first published: Thursday, April 26, 2018, 15:21 [IST]
Other articles published on Apr 26, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+