Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫుట్‌బాల్ దిగ్గజం జుల్ఫీకరుద్దీన్ కన్నుమూత

Former India footballer Mohammed Zulfiqaruddin dies at 83

హైదరాబాద్: ఫుట్‌బాల్‌ దిగ్గజం, మాజీ ఒలింపియన్‌ మొహమ్మద్‌ జుల్ఫికరుద్దీన్‌ (83) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. సుదీర్ఘ కాలంగా ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సికింద్రాబాద్‌లోని పద్మారావు నగర్‌‌లో ఆయన కుమార్తె నివాసంలో ఆదివారం తుదిశ్వాస విడిచారు.

విదేశాల్లో ఉన్న జుల్ఫికర్ తనయులు తిరిగి వచ్చిన అనంతరం ఆయన పార్థివదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని ఆయన అల్లుడు బాసిత్ మొయినుద్దీన్ తెలిపారు. జుల్ఫికర్‌ మృతికి తెలంగాణ ఫుట్‌బాల్‌ సంఘం సంతాపం తెలిపింది. భారత ఫుట్‌బాల్‌కు జుల్ఫికర్‌ చేసిన సేవ ఎన్నటికీ మరువలేనిదని అఖిల భారత ఫుట్‌‌ బాల్‌ సమాఖ్య అధ్యక్షుడు ప్రఫుల్‌ పటేల్‌ ప్రశంసించారు.

17 ఏళ్ల వయసులో జాతీయ జట్టుకు

17 ఏళ్ల వయసులో జాతీయ జట్టుకు

1954లో హైదరాబాద్ స్పోర్టింగ్ క్లబ్‌తో ఫుట్‌బాల్‌తో జుల్ఫీకరుద్దీన్ అనుబంధం మొదలైంది. సికింద్రాబాద్‌లోని పద్మారావు నగర్‌కు చెందిన జుల్ఫికరుద్దీన్‌ 17 ఏళ్ల వయసులో జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. అనంతరం అదే ఏడాదిలో ఆయన ఏపీ పోలీస్‌శాఖలో ప్రవేశించారు. 1956 నుంచి 1957 వరకు పోలీస్ ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా వరుసగా జాతీయస్థాయి టోర్నీలో బంగారు పతకాలు సాధించి పెట్టారు.

1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో

1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో

1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు సెమీస్ చేరుకుంది. అప్పటి జట్టు సాధించిన విజయాల్లో జుల్ఫీకరుద్దీన్‌ది కీలకపాత్ర. డ్రిబ్లింగ్‌లో అపార నైపుణ్యంతో ఎంతో ఒత్తిడిలోనూ గోల్ చేసేవాడని అప్పటి ఆయన సహచరులు చెప్పారు. సెమీపైనల్లో బల్గేరియాతో తలపడిన భారత్ 0-3తో ఓడి నాలుగోస్థానం సాధించింది. ఈ జట్టులో 17 ఏళ్ల జుల్ఫికర్‌ సహా మొత్తం ఆరుగురు హైదరాబాద్‌కు చెందిన వారు ఉండటం విశేషం.

మలేసియాలో జరిగిన మెర్డెకా కప్‌తో

మలేసియాలో జరిగిన మెర్డెకా కప్‌తో

ఆ తర్వాత మలేసియాలో జరిగిన మెర్డెకా కప్‌తో తొలిసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన జుల్ఫికర్‌ 1958 టోక్యో ఆసియా క్రీడల్లో కూడా పాల్గొన్నారు. కానీ, ఆ క్రీడల్లో ఆయన ఒక్క మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగలేదు. అయితే, 1959లో సింగపూర్‌లో జరిగిన మెడెకా కప్‌తో జుల్ఫికర్‌ తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడారు. భారత్‌ తరఫున మొత్తం మూడు మ్యాచ్‌ల్లో పాల్గొన్న ఆయన ఓ గోల్‌ చేశారు.

రిటైర్మెంట్ తర్వాత కోచ్‌గానూ

రిటైర్మెంట్ తర్వాత కోచ్‌గానూ

టోక్యో ఆసియా క్రీడల్లోనూ భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆయన.. 1953-1963 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ జట్టు కెప్టెన్‌గా మూడుసార్లు సంతోష్ ట్రోఫీతోపాటు దేశంలోని ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ డ్యురాండ్‌తోపాటు రోవర్ కప్‌లోనూ ఆయన ఆడాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కోచ్‌గానూ జుల్ఫికరుద్దీన్ రాణించారు.

Story first published: Monday, January 14, 2019, 10:37 [IST]
Other articles published on Jan 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+