Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Carlton Chapman: భారత మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ కన్నుమూత!!

Former India football captain Carlton Chapman passes away

బెంగళూరు: భారత మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ కార్ల్‌టన్ చంపాన్ మరణించారు. ఆయన వయసు 49 సంవత్సరాలు. సోమవారం ఉదయం ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. కార్ల్‌టన్ ఆదివారం రాత్రి తీవ్రమైన వెన్ను నొప్పితో బెంగళూరులోని ఓ ఆసుపత్రి లో చేరిన అయన గుండె పోటుతో చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. కార్ల్‌టన్ మృతి పట్ల ఫుట్‌బాల్ దిగ్గజాలు సంతాపం ప్రకటించారు. కార్ల్‌టన్ మృతి దేశానికి తీరని లోటు అని ఆయన అభిమానులు అంటున్నారు.

ఇదివరకు కార్ల్‌టన్ చంపాన్.. తూర్పు బెంగాల్, జేసీటీ మిల్స్ మిడ్ ఫీల్డర్‌గా దేశానికి ఎనలేని సేవలందించారు. 2001లో రిటైర్మెంట్ ప్రకటించి.. కోచ్‌గా మారారు. 1980లో బెంగళూరులోని సాయ్ సెంటర్‌లో తన కెరీర్ ప్రారంభించారు చంపాన్. బెంగళూరు క్లబ్‌కి చెందిన సదరన్ బ్లూస్ తరపున అతను ఆడారు. 1971 ఏప్రిల్ 13న పుట్టిన ఇండియన్ ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్. క్వార్ట్ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అకాడమీకి ఆయన టెక్నికల్ డైరెక్టర్‌గా సేవలందించారు.

చంపాన్ 1990లో టాటా ఫుట్‌బాల్ అకాడెమీలో చేరారు. 1993 వరకూ క్లబ్‌తో ఉండి.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆపై ఈస్ట్ బెంగాల్ వెళ్లారు. అక్కడ రెండేళ్లు ఆడి.. 1995లో జేసీటీ మిల్స్ కి సైన్ చేశారు. 1993లో ఆసియన్ కప్‌లో బెంగాల్ ఫస్ట్ సీజన్‌లో హ్యాట్రిక్ కొట్టి.. ఇరాకీ క్లబ్ అల్ జవ్రాకి షాక్ ఇచ్చారు. జేసీటీ మిల్స్ తరపున 14 టోర్నమెంట్‌లు గెలిచింది చంపాన్ టీమ్. సంతోష్ ట్రోపీ కింద చంపాన్.. కర్ణాటక, పంజాబ్, బెంగాల్ తరపున ఆడారు.

1995 నుంచి 2001 వరకూ ఇండియన్ నేషనల్ ఫుట్‌బాల్ టీమ్‌కి మిడ్ ఫీల్డర్‌గా చంపాన్ చేశారు. కెప్టెన్‌గానూ సేవలందించారు. క్లబ్ లెవెల్లో ఆయనకు సక్సెస్‌ఫుల్ కెరీర్ ఉంది. ఈస్ట్ బెంగాల్, జేసీటీ మిల్స్ లో సత్తా చాటి.. ఇండియన్ ఫుట్‌బాల్‌కి గుర్తింపు తెస్తూ.. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో స్థానాన్ని సంపాదించారు. తన జీవితమంతా.. ఆటకే అంకితం చేసిన చంపాన్‌ సేవలను అభిమానులు స్మరించుకుంటున్నారు.

Story first published: Monday, October 12, 2020, 13:07 [IST]
Other articles published on Oct 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+