న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

భారత జట్టు హెడ్‌ కోచ్‌గా 'ఐగర్‌ స్టిమాక్‌'

Former Croatia World Cupper Igor Stimac set to be new coach of India

భారత జట్టు ఫుట్‌బాల్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా ఐగర్‌ స్టిమాక్‌ (51) నియమితులయ్యారు. ఈ మేరకు అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. భారత ఫుట్‌బాల్‌హెడ్‌ కోచ్‌ పదవి కోసం స్టిమాక్‌ (క్రొయేషియా), లీ మిన్‌ సంగ్‌ (దక్షిణ కొరియా), ఆల్బర్ట్‌ రోకా (స్పెయిన్‌), హకాన్‌ ఎరిక్సన్‌ (స్వీడన్‌)లు దరఖాస్తు చేసుకున్నారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

గురువారం స్టిమాక్‌ నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కాగా.. మిగతావారు స్కైప్‌ ద్వారా సమాధానాలు ఇచ్చారు. అనంతరం సమావేశమైన ఏఐఎఫ్‌ఎఫ్‌ సుదీర్ఘంగా చర్చించి చివరకు స్టిమాక్‌కు బాద్యతలు అప్పగించింది. స్టిమాక్‌ 3 సంవత్సరాల పాటు భారత కోచ్‌గా పనిచేయనున్నారు. థాయ్‌లాండ్‌లో జూన్‌ 5 నుంచి జరుగనున్న కింగ్స్‌ కప్‌తో స్టిమాక్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

స్టిమాక్‌ క్రొయేషియా జట్టు తరపున 53 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 1996 యూరో కప్‌లో.. 1998 ప్రపంచ కప్‌లో క్రొయేషియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. రిటైర్మెంట్ అనంతరం ఐగర్‌ స్టిమాక్‌ 2012-13లో క్రొయేషియా జట్టుకు కోచ్‌గా పనిచేశారు. స్టిమాక్‌ ఆధ్వర్యంలోనే క్రొయేషియా జట్టు 2014 ప్రపంచ కప్‌నకు అర్హత సాధించింది.

Story first published: Friday, May 10, 2019, 10:39 [IST]
Other articles published on May 10, 2019
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X