Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫోర్లాన్ హ్యాట్రిక్: కేరళపై ముంబై భారీ విజయం

ముంబై సిటీ: ముంబై సిటీ కుర్రాళ్లు సింహాల్లా గర్జించారు. డిఫెన్సివ్ వ్యూహం ప్రదర్శించే కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టును తుత్తునియలుచేశారు. ఐఎస్ఎల్ 3 ఎడిషన్‌లో తొలిసారి ముంబై సారధి డియాగో ఫోర్లాన్ హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. ఫలితంగా కేరళ జట్టుపై ముంబై సిటీ 5 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించింది. ముంబై అటాకింగ్ ముందు కేరళ బ్లాక్ బస్టర్స్ డిఫెన్స్ వెలవెలబోయింది.

మూడు సార్లు స్ట్రయికింగ్ చేసిన ఉరుగ్వే లెజెండ్ ప్లేయర్ ఫోర్లాన్‌తోపాటు సహచర సౌత్ అమెరికన్లు బ్రిటో అల్వెస్, మాటియాస్ ఫ్రెడెరికో అసాధారణమైన రీతిలో ప్రతిభ కనబరిచి ప్రత్యర్థి జట్టు కేరళ బ్లాక్ బస్టర్స్‌ను మట్టి కరిపించారు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగిన ఢిల్లీ డైనమోస్ జట్టును పక్కకు నెట్టేసి 11 మ్యాచ్‌లలో 19 పాయింట్లతో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు.

దారుణమైన రీతిలో అవమానకర ఓటమిని చవిచూసిన కేరళ బ్లాక్ బస్టర్స్ 11 గేమ్స్‌లో 15 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. టీం సారధి, ఉరుగ్వేయన్ స్ట్రయికర్ ఫోర్లాన్ 5,14, 63వ నిమిషాల్లో హోం టీం మద్దతుదారుల ఆనందహేల మధ్య ముంబైలోని సబర్బన్ ప్రాంతంలోని అంధేరి ముంబై ఫుట్ ఎరినా స్టేడియంలో గోల్స్ సాధించాడు.

మాటియాస్ డెఫెడెరికో సాయంతో

మాటియాస్ డెఫెడెరికో సాయంతో

మాటియాస్ డెఫెడెరికో సాయంతో బ్రెజిలియన్ ‘కాఫు' 69వ నిమిషంలోనూ, లుసియాన్ గోయాన్ 73వ నిమిషంలో గోల్ చేయడంతో ముంబై జట్టు స్కోర్ 5 - 0 ఆధిక్యం సాధించింది. ముంబై జట్టు సారధి డియాగో ఫోర్లాన్ పది 15 నిమిషాల్లోనే కళ్లు మిరిమిట్లు గొలిపేలా షాట్లు కొట్టి రెండు గోల్స్ సాధించడంతో ‘యెల్లో బ్రిగేడ్' మద్దతుదారుల గొంతులు మూగబోయాయి.

గ్రాహం స్టాక్‌ను అడ్డుకున్న గోల్ కీపర్

గ్రాహం స్టాక్‌ను అడ్డుకున్న గోల్ కీపర్

అర్జెంటైనియన్ ప్లేయర్ ఫ్రెడెరికో ముందుకు తీసుకెళ్తున్న బంతిని లాఘవంగా చేజిక్కించుకోవడంతోపాటు శరవేగంగా కేరళ బ్లాక్ బస్టర్స్ గోల్ కీపర్ గ్రాహం స్టాక్‌నూ దాటుకుని లెఫ్ట్ కార్నర్ ద్వారా కొట్టిన యాంగ్యులర్ షాట్ ఐదో నిమిషంలో నేరుగా గోల్‌పోస్ట్‌కు చేరిపోయింది. సొంతగడ్డపై అభిమానుల ప్రోత్సాహంతో కేరళ గోల్ కీపర్ స్టాక్‌ను పక్కకు తప్పించేసి 35 అడుగుల దూరం నుంచే గోల్ సాధించాడు.

ఫోర్లాన్ నుంచి వచ్చిన బంతిని

ఫోర్లాన్ నుంచి వచ్చిన బంతిని

ఫోర్లాన్ నుంచి వచ్చిన బంతిని బ్యాక్ వైపున ఉన్న భారత జట్టు సారధి సునీల్ ఛెత్రి కొట్టిన కిక్‌ను గ్రాహం స్టాక్ దిగ్విజయంగా అడ్డుకున్నాడు. కానీ 14వ నిమిషంలో కేరళ డిఫెన్స్ అడ్డుకుని మరీ ఫోర్లాన్ పంపిన ఫ్రీ కిక్ బంతిని మాత్రం స్టాక్ నిలువరించలేకపోయాడు. ఫస్టాఫ్ ముగియడానికి ఒక నిమిషం ముందు కేరళ బ్లాక్ బస్టర్స్ ప్లేయర్ డిడియర్ కాడియో గోల్ సాధించేందుకు విఫలయత్నంచేశాడు. కానీ అప్పటికే ముంబై జట్టు 2 - 0 స్కోర్ ఆధిక్యం సాదించింది.

అటాకింగ్ వ్యూహాం

అటాకింగ్ వ్యూహాం

అటాకింగ్ వ్యూహాన్ని అమలుచేసేందుకు సెకండాఫ్‌లో థోంగ్ ఖౌసియం స్థానే కేరళ బ్లాక్ బస్టర్స్ ప్రతీఖ్ చౌదరిని బరిలోకి దించింది. కానీ పలు దఫాలు గోల్ కోసం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. సెకండాఫ్ ప్రారంభంలోనే గోల్ సాధించే అవకాశం వచ్చినా సద్వినియోగంచేసుకోలేకపోయారు. సికె వినీత్, డెఫెడెరికో తదితరులు గోల్ చేసేందుకు ప్రయత్నించినా ముంబై గోల్ కీపర్ అమరీందర్ సింగ్ దిగ్విజయంగా అడ్డుకున్నాడు.

ఫోర్లాన్ గోల్ పోస్ట్‌కు పది అడుగుల దూరం నుంచే

ఫోర్లాన్ గోల్ పోస్ట్‌కు పది అడుగుల దూరం నుంచే

సెకండాఫ్‌లో మరోసారి ఫోర్లాన్ చెలరేగిపోయాడు. సెకండాఫ్ ప్రారంభమైన 18 నిమిషాల తర్వాత ఫోర్లాన్ గోల్ పోస్ట్‌కు పది అడుగుల దూరం నుంచే డైరెక్ట్ కొట్టిన ఫ్రీ కిక్ షాట్ నేరుగా గోల్ పోస్ట్‌కు చేరిపోయింది. ఆ తర్వాత మరో ఐదు నిమిషాలకు కాఫు టాప్ రైట్ కార్నర్ నుంచి పంపిన బంతి గోల్ పోస్ట్ దారి పట్టింది. మరో నాలుగు నిమిషాలకు లుసియాన్ గోవాన్ గోల్ సాధించడంతో కేరళపై ముంబై జట్టు 5 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+