రొనాల్డొ ఇచ్చిన టిప్‌యే రూ.16లక్షలు


హైదరాబాద్: ఇండోనేషియా రెస్టారెంట్‌లో డిన్నర్‌కే రూ.7 లక్షలు ఖర్చు పెట్టిన ఆకాశ్ చోప్రా మాట ఇక మర్చిపోవాల్సిందే. డిన్నర్‌కి కాదు కేవలం టిప్ కోసమే రూ. 16లక్షలు ఇచ్చాడట ఫుట్‌బాల్ దిగ్గజం. అద్భుత ప్రదర్శనతో యావత్ ప్రపంచమంతా పెద్ద ఎత్తున అభిమానులను సంపాందించుకున్నాడు పోర్చుగల్ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో.

రొనాల్డో.. హాలీడే ట్రిప్ కోసమని.. గ్రీస్‌కు
ఇటీవలే క్లబ్ బదిలీ అయిన రొనాల్డో.. రియల్ మాడ్రిడ్ చెల్లించిన 240 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేసుకుని ఇటలీకి చెందిన 340 మిలియన్ డాలర్లకు జ్యూవెంటస్‌తో కుదురుకున్నాడు. వరల్డ్‌కప్ నిష్క్రమణ తరవాత హాలీడే ట్రిప్ కోసమని రొనాల్డో తన కుటుంబంతో కలిసి గ్రీస్ సందర్శనకు వెళ్లాడు. ఈ క్రమంలో ఓ ఖరీదైన హోటల్‌లో దిగిన రొనాల్డో కొన్ని రోజుల పాటు అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సరదాగా గడిపాడు.

ఏకంగా రూ.16లక్షలు టిప్‌గా
తాజాగా తిరుగు ప్రయాణంలో స్వదేశానికి బయలుదేరిన ఈ పోర్చుగల్ ఫుట్‌బాలర్.. తాను బస చేసిన హోటల్ సిబ్బంది అందించిన సేవలకు మెచ్చి ఏకంగా రూ.16లక్షలు టిప్‌గా ఇచ్చేశాడట. మొదటి రోజు నుంచే హోటల్ సిబ్బంది రొనాల్డో కుటుంబానికి ప్రత్యేకంగా సేవలు అందిస్తూ వచ్చారట. దీంతో వారి సేవలకు ముగ్ధుడైన ఈ ఫుట్‌బాలర్ ఏకంగా ఇంత భారీ మొత్తంలో టిప్‌గా ఇచ్చినట్లు తెలిసింది.

హ్యాట్రిక్ గోల్స్‌తో
రష్యా వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో స్పెయిన్‌తో మొదటి మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిశాడు. ఆ తర్వాత మిగతా మ్యాచ్‌లలోనూ రాణించిన రొనాల్డో.. నాకౌట్‌లో ఉరుగ్వేతో పోరులో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో 1-2తేడాతో పోర్చుగల్ ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫలితంగా రొనాల్డోకు ప్రపంచకప్ ఇక ఎప్పటికీ అందని ద్రాక్షలానే మారింది.

రియల్ మాడ్రిడ్ తరఫున 292 మ్యాచ్‌లలో 311 గోల్స్
ఇదిలా ఉండగా, గత తొమ్మిదేళ్లుగా రియల్ మాడ్రిడ్ క్లబ్‌కు ఆడిన రొనాల్డో.. మొత్తం ఆ క్లబ్ తరఫున 292 మ్యాచ్‌లలో 311 గోల్స్ సాధించాడు. కాగా ప్రపంచకప్ అనంతరం ఇతనిని ఇటలీకి చెందిన ఫుట్‌బాల్ క్లబ్ జువెంటిస్ 100 మిలియన్ యూరోలు ౌఅఈ చెల్లించి దక్కించుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications