For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఐఎస్ఎల్‌లో విదేశీ ప్లేయర్లు: దేశీయ ఫుట్‌బాల్ పురోగతెప్పుడు?

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో విదేశీ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తే దేశీయ ప్లేయర్లు ఆడేదెప్పుడు? డెవలప్ అయ్యేదెప్పుడని ఇండియన్ టీం మాజీ కోచ్ కోల్మ్ జెసెఫ్ టోల్ ప్రశ్నించాడు.

By Nageshwara Rao

కోల్‌కతా: జాతీయంగా క్షేత్రస్థాయిలోకి ఫుట్‌బాల్‌ ఆట మెరుగుదల లక్ష్యంగా ప్రారంభించిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో విదేశీ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తే దేశీయ ప్లేయర్లు ఆడేదెప్పుడు? డెవలప్ అయ్యేదెప్పుడని ఇండియన్ టీం మాజీ కోచ్ కోల్మ్ జెసెఫ్ టోల్ ప్రశ్నించాడు. భారత్ టాప్ లీగ్‌లో ఆరుగురు విదేశీ ఆటగాళ్లు, ఐదుగురు భారతీయులతో కూడిన జట్టు పొందిక సరికాదని వ్యాఖ్యానించాడు.

2007 నుంచి ఏడేళ్ల పాటు భారత్ కోచ్‌గా వ్యవహరించిన టోల్ శిక్షణలో ఎదిగిన వారే జెజె లాల్పెఖ్లౌ, గురుప్రీత్ సింగ్ సంధూ వంటి ప్లేయర్లతోపాటు పలు యూత్ టీంల్లో కీలక పాత్ర పోషిస్తున్న వారు ఉన్నారు. 2014లో అఖిలభారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్)తో విభేదాలు రావడంతో 30 మందికి పైగా మెరికల్లాంటి ప్లేయర్లను తీర్చిదిద్దడంతోపాటు దేశీయంగా పలు క్లబ్‌లకు సేవలందించిన టోల్ మధ్యలోనే వైదొలిగి వెళ్లిపోయాడు.

రెండేళ్ల విరామం తర్వాత ఫ్లొరిడాలో నివసిస్తున్న టోల్.. ఐ - లీగ్ ఫ్రాంచైసీ మినర్వ పంజాబ్ ఎఫ్ సి జట్టు టెక్నికల్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. '11 మందితో కూడిన జట్టులో ఆరుగురు విదేశీ ఆటగాళ్లు ఉంటే భారతీయ ప్లేయర్లు ఆడే అవకాశాలు తగ్గుతాయి' అని టోల్ ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

'ఈ ఫార్ములా మార్కెటింగ్ కు సహాయ పడుతుండవచ్చు. నాకైతే తెలియదు. ఇప్పటికైనా లీగ్ నిర్వాహకులు దీనిపై ద్రుష్టి సారించి పరిష్కార మార్గాలు కనుగొనాలి' అని హితవు చెప్పాడు. ఇంతకుముందు ఆయన యు - 19, దోహాలో భారత క్లబ్ జట్లకు ఎఎఫ్‌సి కప్ అర్హత సాధనలో కీలకంగా వ్యవహరించాడు.

టోల్ శిక్షణ ప్రభావం

టోల్ శిక్షణ ప్రభావం

స్ట్రయికర్లు ఉదాంతా కుమార్ సింగ్, డానియల్ లాల్హ్ లింపుయియా, గోల్ కీపర్ విశాల్ కైథ్, డిఫెండర్ రూపర్ట్ నాగ్రం వంటి వారిపై టోల్ శిక్షణ ప్రభావం ఉంది. పాలియన్ ఆరోస్ టీం పూర్తిగా భారత ప్లేయర్లతోనే నింపేసిన సంగతిని టోల్ గుర్తుచేశారు. ఈ జట్టంతా యూత్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం (యుడిపి) ద్వారా తయారైన ఆటగాళ్లేనని చెప్పాడు. ‘అందరూ భారతీయులే. సీజన్ 1లో ఏడో స్థానంలో నిలిచారు. కానీ ఈ నాడు భారత్ తరఫున ఆడుతున్న ప్లేయర్లలో చాలా మంది ఆ జట్టులోని వారే. 90 నిమిషాల ఆటలో కీలక పాత్ర పోషిస్తున్నారు' అని అన్నాడు.

జెజె లాల్పెఖ్లౌ భారత జట్టులో కీలక భూమిక

జెజె లాల్పెఖ్లౌ భారత జట్టులో కీలక భూమిక

తొలి ఏడాది లీగ్ లో 26 మ్యాచ్ లు ఆడి కేవలం 29 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. కానీ ఇదే టీంలోని గురుప్రీత్ సింగ్ సంధూ ఒక గోల్ కీపర్‌గా యూరప్ లీగ్ లో ఆడుతున్న ఏకైక ఇండియన్ కాగా, జెజె లాల్పెఖ్లౌ భారత జట్టులో కీలక భూమిక వహిస్తున్నాడు. ఎఐఎఫ్ఎఫ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం నిలిచిపోవడంతో యారోస్ జట్టు యాజమాన్యం తర్వాత ‘పాలియన్' అనే సంస్థను స్పాన్సరర్‌గా ఎంచుకున్నది. దీంతో పాలియన్ యారోస్ జట్టుగా పేరొందింది.

నైపుణ్యానికి మెరుగులు

నైపుణ్యానికి మెరుగులు

ప్రస్తుతం ఆస్ట్రేలియన్ కోచ్ ఆర్థూర్ పాపాస్ సారథ్యంలో యారోస్ జట్టులో ప్రస్తుతం భారత్ స్టార్ ఆటగాళ్లు ప్రీతం కొటల్, ప్రబీర్ దాస్, ప్రొనయ్ హల్డర్, నారాయణ్ దాస్, మిలాన్ సింగ్, ధన్ పాల్ గణేశ్, షౌవిక్ ఘోష్ తదితరులు తమ నైపుణ్యానికి మెరుగులు దిద్దుకుంటున్నారని తెలిపాడు. ఇదంతా ఎఐఎఫ్ఎఫ్ మార్గదర్శకత్వంలోని వైడిపి సపోర్ట్ స్టాఫ్ కష్టపడి సాధించిన ప్రగతేనని టోల్ వ్యాఖ్యానించాడు. హై ర్యాంక్ జట్టు పౌర్టో రికోపై భారత జట్టు విజయంలోనూ యారోస్ జట్టు ఆటగాళ్లు ఉన్నారని గుర్తుచేశాడు.

యు-17లో భారత్‌లో గట్టి పునాది

యు-17లో భారత్‌లో గట్టి పునాది

‘పౌర్టె రికో జట్టుపై భారత జాతీయ జట్టు 4-1 స్కోర్ తేడాతో విజయం సాధించింది. భారత ఆటగాళ్లు చాలా బాగా ఆడారు. యారోస్ కుర్రాళ్లు ఆటలో ముఖ్యమైన పాత్ర పోషించారు' అని టోల్ అన్నాడు. ఈ ఏడాది చివరిలో జరిగే యు - 17 వరల్డ్ కప్ నిర్వహణతో భారత్ లో ఫుట్ బాల్ ఆటకు మరో గట్టి పునాది పడుతుందన్నాడు. భారీస్థాయిలో యువ జట్ల తయారీకి మార్గం సుగమం అవుతుందని టోల్ వివరించాడు. యు - 17 టోర్నీ నిర్వహణతో తప్పనిసరిగా భారత్ లో ఫుట్ బాల్ పట్ల ఆసక్తి పెరుగుతుంది. యు - 17 వయస్సు గల టీంల తయారీకి పెద్ద ముందడుగు అవుతుందని టోల్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం బ్రెజిల్ తదితర దేశాల్లో ఎక్స్ పోజర్ కోసం పర్యటిస్తున్న భారత్ యు - 17 జట్టు పెర్ఫార్మెన్స్ చాలా బాగుందన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+