హవానా: వరల్డ్ కప్ ఫుట్ బాల్ మ్యాచ్ లు క్యూబాలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. క్యూబా ఫిఫా వరల్డ్ కప్ 2010 కు అర్హత సంపాదించలేకపోయినప్పటికీ ఈ కమ్యూనిస్టు దేశం క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించింది. 1994 నుంచి క్యూబాలో ఫుట్ బాల్ వరల్డ్ కప్ మ్యాచ్ లను టీవీలో చూపిస్తున్నారు. ఈ మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చేయబోవడం ఇదే ప్రధమం.
ఈ మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్న అతికొద్ది దేశాల్లో క్యూబా ఒకటని క్యూబన్ కమ్యూనిస్టు పార్టీ దినపత్రిక రాసింది. దక్షిణాఫ్రికాలో పగలు జరిగే మ్యాచ్ లు సమయ భేదం కారణంగా క్యూబాలో తెల్లవారుజామున ప్రత్యక్ష ప్రసారమవుతాయి. ఫుట్ బాల్ తో పాటు వాలీబాల్ వరల్డ్ కప్ ను కూడా క్యూబాలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. వాలీబాల్ పోటీలో క్యూబా పాల్గొనబోతోంది.