బ్రెజిల్ ప్రముఖ ఫుట్‌బాల్ స్టార్ జూనియర్ నెయ్‌మర్ ఆన్‌లైన్‌లో పోకర్(పేకాట) గేమ్ కోట్లు పోగొట్టుకున్నాడు. 1 మిలియన్ యూరోలు అంటే భారత కరెన్సీ ప్రకారరం దాదుపు రూ.8 కోట్లకు పైగా లాస్ అయ్యాడు. గాయంతో గత మూడు నెలలు సాకర్ కు దూరంగా ఉన్న నెయ్ మర్ 1 మిలియన్ యూరోలు పేవడంతో కన్నీరు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెయ్ మర్ ఇంట్లో ఉండి పోకర్ గేమ్ ఆడి రూ. 8 కోట్లకు పైగా పోగొట్టకున్నాడు.
ఫ్రాన్స్ కేంద్రంగా నడుస్తున్న ఆన్‌లైన్ పోకర్ గేమ్‌లో మెంబర్‌గా ఉన్న నెయ్‌మర్ బుధవారం రాత్రి పేకాట ఆడాడు. అయితే గేమ్‌లో ఓడిపోవడంతో 1 మిలియన్ యూరోలు కోల్పోవాల్సి వచ్చింది. డబ్బులు పోవడంతే నెయ్ మర్ ఏడుస్తుండగా.. వెనకాల మ్యూజిక్ వస్తుంది.

ఆ తర్వాత తేరుకుని కేవలం సరదా కోసమే ఇలా చేసే అంటూ చెప్పాడు. పోకర్ గేమ్ లో డబ్బులు రావడం, పోవడం కామన్ అని చెప్పాడు. నెయ్ మర్ రూ.8 కోట్లు పోయినా భయపడకుండా మళ్లీ పోగొట్టుకున్న సొమ్మును తిరిగి సొంతం చేసుకున్నాడు.