Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్లాష్‌బ్యాక్ 2016: భారత్ పుట్‌బాల్‌కు సక్సెస్‌ఫుల్ ఇయర్

బెంగళూరు: గత దశాబ్ద కాలంలోనే భారతీయ ఫుట్ బాల్ క్రీడకు 2016 అత్యంత సక్సెస్ ఫుల్ ఇయర్ గా నిలిచిపోనున్నది. గణాంకాల ప్రాతిపదికన తీసుకున్నా ఈ ఏడాది ఆరు మ్యాచ్ ల్లో ప్రాతినిధ్యం వహించిన ఇండియన్ ఫుట్ బాల్ టీం నాలుగింటిలో విజయం సాధించింది. సెప్టెంబర్ లో పైర్టో రికోకు వ్యతిరేకంగా విజయం సాధించడంతో భారత కుర్రాళ్లు తమ విజయావకాశాలను 66 శాతానికి పెంపొందించారు.

ఆఫ్ఘనిస్థాన్ ను 2 - 1 స్కోర్ తేడాతో ఓడించిన భారత జట్టు ఏడోసారి ఎస్ఎఎఫ్ఎఫ్ చాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకున్నది. టోర్నీకి ఆతిథ్యమిచ్చిన జట్టుగా భారత్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి టైటిల్ చాంపియన్ షిప్ టైటిల్‌ను చేజిక్కించుకున్నది.

కానీ దురద్రుష్టవశాత్తు ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ కోసం జరిగిన పోటీల్లో ఆసియా పవర్ హౌస్ ఇరాన్ జట్టు చేతిలో 0 - 4 స్కోర్ తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూసింది. తుర్కెమినిస్థాన్ చేతిలోనూ ఓటమి పాలవ్వడంతో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించి అధికారికంగా వరల్డ్ కప్ గ్రూప్ దశ పోటీలకు దూరమైంది.

భారత జట్టు మేనేజర్‌గా స్టీఫెన్ కాంస్టాటైన్స్

భారత జట్టు మేనేజర్‌గా స్టీఫెన్ కాంస్టాటైన్స్

ఆసియా గ్రూప్‌లో చివరి స్థానానికి పరిమితమైంది. భారత జాతీయ టీం మేనేజర్‌గా స్టీఫెన్ కాంస్టాటైన్స్ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది. తర్వాత 2019 ఆసియా కప్ క్వాలిఫయర్ పోటీలో ఇండియా దిగువ శ్రేణి జట్టు లావోస్ తో తలపడింది. తొలి మ్యాచ్ లో ఇండియా సాఫ్ కప్ హీరో జెజె లాల్పెఖ్లౌ గోల్ సాధించి జట్టును గెలిపించాడు. తద్వారా మ్యాచ్ అనుకూలంగా మార్చాడు. ఐదు రోజుల గడువులోగా గత జూన్ ఏడో తేదీన రెండో దశ పోటీల కోసం లావోస్ భారత్ కు వచ్చింది. విజిటర్స్ కు ఘన స్వాగతం పలికిన భారత్ సాకర్ జట్టు.. గౌహతిలో అభిమానుల దన్ను మధ్య జరిగిన మ్యాచ్‌లో 6 - 1 స్కోర్ తేడాతో లావోస్ జట్టును మట్టి కరిపించింది. ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ చరిత్రలోనే భారత్ అతి పెద్ద విజయాన్ని నమోదుచేసింది.

సునీల్ ఛెత్రి సారథ్యంలోని భారత జట్టు అసాధారణ ప్రతిభ

సునీల్ ఛెత్రి సారథ్యంలోని భారత జట్టు అసాధారణ ప్రతిభ

తర్వాత మ్యాచ్ టాప్ ర్యాంక్ జట్టు పైర్టో రికోతో ముంబై ఫుట్‌బాల్ ఎరినాలో జరిగింది. భారతీయులకు అత్యంత క్లిష్టతరమైన టీంగా పరిగణిస్తున్న తరుణంలో సునీల్ ఛెత్రి సారథ్యంలోని భారత జట్టు అసాధారణ ప్రతిభతో 4 - 1 స్కోర్ తేడాతో విజయం సాధించి అభిమానులను సైతం అబ్బుర పరిచింది. తద్వారా స్టీఫెన్ కాంస్టాటైన్ శిష్యుల ప్రతిభా పాటవాలకు నిదర్శనంగా నిలించింది. టాప్ ర్యాంక్ జట్టుపై భారత్ బెస్ట్ పెర్పార్మెన్స్‌కు గుర్తుగా ఫిఫా ర్యాంకింగ్స్ లో ఇండియా స్థానం 137 స్థానానికి ఎగబాకింది. గత ఆరేళ్లలో ఫిఫా ర్యాంకింగ్స్‌లో ఇదే భారత్ అత్యధిక ర్యాంక్.

ఏడో తేదీ నుంచి ఐ-లీగ్ ప్రారంభం

ఏడో తేదీ నుంచి ఐ-లీగ్ ప్రారంభం

వచ్చేనెల ఏడో తేదీ నుంచి ఐ లీగ్ టోర్నీ ప్రారంభం కానున్నది. డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు ఎఫ్ సి జట్టు.. షిల్లాంగ్ లాజోంగ్‌తోనూ.. కింగ్ ఫిషర్ ఈస్ట్ బెంగాల్ జట్టుతో ఐజ్వాల్ ఎఫ్ సి జట్టు తలపడనున్నాయి. టోర్నీలోకి నూతనంగా అడుగుపెట్టిన చెన్నై సిటీ ఎఫ్ సి, మినర్వా పంజాబ్ జట్లు ఎనిమిదో తేదీన తల పడతాయి. అదే రోజు గతేడాది రన్నరప్ మొహున్ బగాన్, చర్చిల్ బ్రదర్స్ జట్టుతో రవీంద్ర సారోబార్ స్టేడియంలో పోటీ పడతాయి. రెండు కోల్ కతా క్లబ్ లు వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న సిలిగిరిలోని కాంచన్ జుంగా స్టేడింలో పోటీ పడతాయి. గత ఏడాది ఐ - లీగ్ టైటిల్ గెలుచుకున్న బెంగళూరు ఎఫ్ సి జట్టు నూతన కోన్ అల్బర్ట్ రోచా సారథ్యంలో ఎఎఫ్ సి ఫైనల్స్ వరకూ వెళ్లి వచ్చి మంచి జోరుమీదున్నది.

బెంగళూరు ఎఫ్ సిలోకి ముగ్గురు సీనియర్లు

బెంగళూరు ఎఫ్ సిలోకి ముగ్గురు సీనియర్లు

ఐ-లీగ్ డిఫెండింగ్ చాంపియన్‌గా బెంగళూరు ఎఫ్ సి జట్టు మరింత శక్తి సామర్థ్యాలను సమకూర్చుకుంటున్నది. ఐఎస్ఎల్ టోర్నీలో చెలరేగిపోయిన ప్లేయర్లు అరిందం భట్టాచార్య, సేనా రాల్టే, మందార్ రావు దేశాయ్ లను తన జట్టులోకి తీసుకున్దని. గోల్ కీపర్ గా అరిందం భట్టాచార్య, మిడ్ ఫీల్డర్ గా మందార్ రావు దేశాయి, డిఫెండర్ గా లాల్హ్ మంగైహ్సాంగ సేన రాల్టే సేవలందించనున్నారు. జట్టులోకి వారి రాకను బెంగళూరు ఎఫ్ సి జట్టు అధికారికంగా ధ్రువీకరించింది. ఎఫ్ సి పుణె నుంచి అరిందం భట్టాచార్య, ఎఫ్ సి గోవా నుంచి మందార్ రావు దేశాయ్, ముంబై సిటీ సేనలో సేనా రాల్టే ప్రాతినిథ్యం వహించారు. ఇప్పటికే తమ జట్టు బలోపేతమైందని, ఈ ముగ్గురు ఆటగాళ్ల రాకతో మరింత బలోపేతం అవుతుందని బెంగళూరు ఎఫ్ సి కోచ్ అల్బర్ట్ రోచా వ్యాఖ్యానించాడు. అతి త్వరలో లీగ్ టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ముగ్గురు సీనియర్ల చేరిక జట్టుకు మరింత బలం చేకూరుస్తుందన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+