Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్లాష్‌బ్యాక్ 2016: యూరో పోర్చుగల్‌‌దే, మెస్సీ వీడ్కోలు

బెంగళూరు: ఇప్పటివరకు లైసెస్టర్ సిటీ మాదిరిగానే అండర్ డాగ్స్ మాదిరిగా ఉన్న పోర్చుగల్ జట్లు ముందుకు సాగి యూరో 2016 కప్ కోసం పోటీ పడ్డాయి. ఈ ఏడాది టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి లా లీగ జెయింట్ రియల్ మాడ్రిడ్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలో పోర్చుగల్ టీం యూరో కప్ విజేతగా నిలుస్తుందని ఏ ఒక్కరూ ఊహించలేదు.

గ్రూప్ దశలో ముందడుగు వేసేందుకు పోరాడిన పోర్చుగల్ నాకౌట్ దశకు అర్హత సాధించి మూడో స్థానంలో నిలిచింది. నాకౌట్ దశలోనూ 90 నిమిషాల మ్యాచ్ లో ఒక్కటి కూడా గెలుచుకోకున్నా కొన్ని సానుకూల అంశాల వల్ల ఫైనల్స్‌కు చేరుకున్నది. ఫైనల్స్‌లో ఆతిథ్యమిచ్చిన ఫ్రాన్స్ జట్టును 1-0 స్కోర్ తేడాతో ఓడించి ట్రోఫీ గెలుచుకున్నారు.

ఇది వ్యక్తిగతంగా క్రిస్టియానో రొనాల్డోను ఆనంద పారవశ్యంలో ముంచెత్తగా ఆయన ప్రత్యర్థి జట్టు ఎఫ్ సి బార్సిలోనా సూపర్ స్టార్ లియానెల్ మెస్సీ ఆధ్వర్యంలోని అర్జెంటీనా జట్టు కొపా అమెరికా టైటిల్ ను చిలీకి వదిలేసింది. నిర్ణయాత్మకమైన పెనాల్టీ గోల్ మిస్ కావడంతో లియానెల్ మెస్సీ మరో ఇంటర్నేషనల్ ట్రోఫీకి దూరమయ్యాడు.

అంతేకాదు అంతర్జాతీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్య పరుస్తూ అంతర్జాతీయ ఫుట్ బాల్ కు గుడ్ బై చెప్తున్నట్లు ఈ ట్రోఫీ ముగిసిన తర్వాత మెస్సీ ప్రకటించడం గమనార్హం. కానీ తర్వాత ఆయన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఇక రొనాల్డో మాదిరిగానే నేయ్మార్ కూడా ఇంటర్నేషనల్ సక్సెస్ పవరేమిటో రుచి చూశాడు.

ఇటీవల ముగిసిన రియో ఒలింపిక్స్ - 2016లో ఫుట్ బాల్ విభాగంలో నేయ్మార్ సారథ్యంలోని బ్రెజిల్ జట్టు స్వర్ణ పతకం సాధించి రికార్డు నెలకొల్పింది. బ్రెజిల్ పలు అంతర్జాతీయ టోర్నీలను గెలుచుకున్నా ఒలింపిక్ స్వర్ణ పతకం ఏనాడు గెలుచుకోలేదు. కానీ ఈ సారి ఫైనల్స్‌లో స్వర్ణ పతకం సాధించేందుకు బ్రెజిల్ జట్టుకు నేయ్మార్ స్ఫూర్తిగా నిలిచాడు.

2016 ఫుట్ బాల్ క్రీడలో కొన్ని అంతర్జాతీయ కీలక ఘట్టాలివే:

యూరో 2016 కప్ గెలుచుకున్న పోర్చుగల్

యూరో 2016 కప్ గెలుచుకున్న పోర్చుగల్

పోర్చుగల్ చరిత్రలో తొలిసారి యూరో 2016 గెలుచుకున్నది. అండర్ డాగ్స్ మాదిరిగా టోర్నమెంట్లో అడుగు పెట్టిన పోర్చుగల్ టీం అద్భుతమైన రీతిలో ప్రతిభ కనబరిచి క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలో సాధించిన విజయం.

గాయపడ్డ లియానెల్ మెస్సీ మనస్సు

గాయపడ్డ లియానెల్ మెస్సీ మనస్సు

కొపా అమెరికా కప్ ఫైనల్స్ కు అర్హత సాధించినా మరోసారి కప్ కోల్పోవడం లియానెల్ మెస్సీ మనస్సును గాయపరిచింది. ఈ టోర్నీలో వరుసగా రెండోసారి అర్జెంటీనాపై చిలీ విజయం సాధించింది. ఈ దఫా లియానెల్ మెస్సీ పెనాల్టీ మిస్సవడమే దీనికి కారణం. టోర్నమెంట్ ముగిసిన వెంటనే ఈ అర్జెంటీనా సూపర్ స్టార్ భావోద్వేగంతో ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. తర్వాత ఉపసంహరించుకోవడం వేరే సంగతి.

యూరో 2016 కప్‌తో రొనాల్డో

యూరో 2016 కప్‌తో రొనాల్డో

క్రిస్టియానో రొనాల్డో ఫుట్ బాల్ కెరీర్ లో యూరో 2016 కప్ గెలుచుకోవడం ఇదే తొలిసారి.

యూరో 2016లో ఐస్‌లాండ్ హైలేట్

యూరో 2016లో ఐస్‌లాండ్ హైలేట్

యూరో 2016 టైటిల్‌ను పోర్చుగల్ గెలుచుకున్నా టోర్నీలో ఐస్‌లాండ్ హైలేట్‌గా నిలిచింది. 16వ రౌండ్‌లో ఇంగ్లండ్ జట్టును ఓడించి రికార్డు నెలకొల్పి తన లాఘవం ప్రకటించింది.

బ్రెజిట్ టీం సభ్యులతో నేయ్మార్ (మధ్యలో వ్యక్తి)

బ్రెజిట్ టీం సభ్యులతో నేయ్మార్ (మధ్యలో వ్యక్తి)

రియో ఒలింపిక్స్‌లో బ్రెజిల్ తొలిసారి ఫుట్‌బాల్ ఆటలో స్వర్ణ పతకం గెలుచుకున్నది. ఫైనల్స్ మ్యాచ్‌లో జర్మనీ జట్టును ఓడించి రికార్డు నెలకొల్పింది. నేయ్మార్ సారథ్యంలోని సాంబా కుర్రాళ్లు చరిత్ర నెలకొల్పారు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+