ఫ్లాష్ బ్యాక్ 2016: ఈ ఏడాది బెంగళూరు బెస్ట్
బెంగళూరు: భారతీయ ఫుట్ బాల్ చరిత్రలోనే బెంగళూరు ఎఫ్ సి క్లబ్ జట్టు ఈ ఏడాది మెరుగైన జట్టంటే అతిశేయోక్తి కాదు. మూడేళ్లలో రెండోసారి ఐ - లీగ్ టైటిల్ గెలుచుకుని చరిత్ర నెలకొల్పడంతోపాటు ఇదే ఏడాది ఎఎఫ్‌సి - 2016 టోర్నీలో ఫైనల్స్‌కు దూసుకెళ్లి మరో చరిత్ర స్రుష్టించిందీ గార్డెన్ సిటీ టీం. మొహున్ బగన్ జట్టుపై ఐ-లీగ్ టోర్నీ ఫైనల్ష్‌లో మూడో ఏడాది రెండోసారి గెలుచుకున్నది.
ఐ-లీగ్ టోర్నీతోపాటు జెఎస్‌డబ్ల్యు కంపెనీ స్పాన్సర్ షిప్ అందుకున్నది. గతేడాది కాంపిటిషన్ దశలోనే వెనుదిరిగింది. ఎఎఫ్‌సి టోర్నీలో ఎప్పటికప్పుడు తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ బెంగళూరు ఎఫ్‌సి నిత్య నూతన జట్టుగా రూపాంతరం చెందుతూ వచ్చింది. 16వ రౌండ్‌లో కిచీ ఎస్‌సి జట్టును ఓడించి తన పెర్పార్మెన్స్ రుజువు చేసుకుంది. తర్వాత తాపినెస్రోవర్స్ జట్టును ఓడించి క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్నది.
క్వార్టర్ ఫైనల్స్‌లో జొహొర్ దారుల్ తాజిమ్ జట్టును, సెమీ ఫైనల్స్ దశలో చరితాత్మక స్థాయిలో ఫైనల్స్‌లో అడుగు పెట్టింది. ఇరాక్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ జట్టుపై జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. సునీల్ ఛెత్రి సారధ్యంలోని బెంగళూరు ఎఫ్ సి జట్టు.. ఇరాక్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ జట్టు 0 - 1 స్కోర్ తేడాతో ఓటమి పాలైంది.
అయినా నూతన వసంతంలో భారతీయ ఫుట్‌బాల్‌కు బెంగళూరు ఎఫ్‌సి బ్రాండ్‌గా అవతరించనున్నది. ఈ తరుణంలో బెంగళూరు ఎఫ్ సి జట్టుకు చిరస్మరణీయమైన వసంతంలో చెప్పుకోదగిన ఘట్టాలివే. చరిత్రాత్మక బెంగళూరు ఎఫ్ సి కెరీర్‌లో ముఖ్యమైన ఘట్టాలివే:

ఐ-లీగ్ రెండో టైటిల్‌తో బెంగళూరు ఎఫ్ సి
బెంగళూరు ఎఫ్ సి 2016 ఏప్రిల్‌లో గత మూడు సీజన్లలో రెండోసారి ఐ - లీగ్ టైటిల్ గెలుచుకున్నది.

సంబరాలు చేసుకుంటున్న బెంగళూరు ప్లేయర్ సికె వినీత్
బెంగళూరు ఎఫ్ సి జట్టు ఎఫ్ సి షెడ్యూల్ ప్రకారం కొత్త ఎఎఫ్ సి కప్ సెషన్‌లో సింగపూర్ కు చెందిన తాంపినెస్ రోవర్స్ జట్టుతో తలపడాల్సి ఉన్నది. నగరంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా ఆడిన మ్యాచ్ లో సికె వినీత్ గోల్ సాధించి జట్టుకు తానెంత ముఖ్యమో తేల్చి చెప్పాడు.

ఎఎఫ్‌సి ఫైనల్స్‌కు చేరుకున్న బెంగళూరు
ఇండియన్ ఫుట్‌బాల్ చరిత్రలో మలేషియాకు చెందిన జొహొర్ దారుల్ తాజిమ్ జట్టును ఓడించిన నాడు చారిత్రాత్మక రోజుగా నిలిచింది. తద్వారా ఎఎఫ్‌సి టోర్నీలో ఫైనల్స్ లో అడుగు పెట్టింది. భారత చరిత్రలో ఫుట్ బాల్ క్లబ్ ఎఎఫ్ సి ఫైనల్స్‌కు చేరుకున్నది. 3 - 1 స్కోర్ తేడాతో బెంగళూరు ఎఫ్ సి జట్టు జొహోర్ జట్టుపై 3-2, 4-2 స్కోర్ తేడాతో విజయం సాధించింది.

బెంగళూరు ఎఫ్ సి జట్టు సారథిగా సునీల్ ఛెత్రి
ఎఎఫ్‌సి కప్ ఫైనల్స్ మ్యాచ్‌లో సునీల్ ఛెత్రి సారధ్యంలోని బెంగళూరు ఎఫ్ సి జట్టు ఇరాక్ ఎయిర్ ఫోర్స్ క్లబ్ జట్టుపై పోటీ పడింది.

ఎఎఫ్ సి ఫెయిర్ ప్లే అవార్డు అందుకుంటున్న సునీల్ ఛెత్రి
ఇరాక్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ జట్టుపై ఎఎఫ్‌సి ఫేర్‌ప్లే ట్రోఫీ ఫైనల్స్‌లో బెంగళూరు ఎఫ్ సి జట్టు 0-1 స్కోర్ తేడాతో ఓటమి పాలైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications