ఫ్లాష్‌బ్యాక్ 2016: మెస్సీ మిస్.. చరిత్ర సృష్టించిన బెంగళూరు
బెంగళూరు: వరల్డ్ ఫుట్‌బాల్ 2016లో పలు ఒడిదొడుకులకు గురైంది. బార్సిలోనా టాప్ ప్లేయర్ లియానెల్ మెస్సీ రెండోసారి ఒక ఇంటర్నేషనల్ టైటిల్ గెలుచుకోవడంలో విఫలమైతే.. గ్రైజ్మన్ రెండు యూరోపియన్ టైటిళ్లను గెలుచుకోలేకపోయాడు. మన మది నుంచి మరో వసంతం ముగిసిపోయే క్షణాలు దగ్గరకు వస్తున్నాయి. మరో 48 గంటల్లో నూతన వసంతానికి స్వాగతం పలికేందుకు ప్రజలంతా సన్నద్ధం అవుతున్నారు.
ఈ దశలో ఈ ఏడాది కాలంలో ఫుట్‌బాల్ ఆటలో పేరొందిన అర్జెంటీనా ఆటగాడు లియానెల్ మెస్సీ విధ్వంసకరమైన పెనాల్టీ పాయింట్ మిస్సవ్వడం.. కొపా అమెరికా టైటిల్‌ను గెలుచుకునే అవకాశం అర్జెంటీనా మరోసారి కోల్పోవడం ఈ ఏడాది అతిపెద్ద తప్పు. ఇది వరుసగా అర్జెంటీనా మూడో అంతర్జాతీయ, రెండో కొపా అమెరికా టైటిల్ గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయింది.
లియానెల్ మెస్సీ అత్యంత ప్రతిభావంతుడైన ఫుట్‌బాలర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇంటర్నేషనల్ ట్రోఫీ ఆయన టీం ఇంకా అందని ద్రాక్షగానే మిగిలింది. ఈ వైఫల్యంతో నైరాశ్యానికి గురైన మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్పేశాడు. కాకపోతే తర్వాత తన నిర్ణయాన్ని ఉపసంహ రించుకున్నాడు. అలాగే ఫ్రాన్స్ ఇంద్రజాలికుడు అంటోనె గ్రైజ్మన్ మరో దురద్రుష్టకరమైన పుట్‌బాలర్‌గా నిలిచాడు. షూటౌట్‌లో యుఇఎఫ్ఎ టైటిల్ ను రియల్ మాడ్రిడ్ జట్టుకు కోల్పోగా, యూరో 2016 టైటిల్ ను పోర్చుగల్ కు వదులుకోవాల్సి వచ్చింది.
ఇండియన్ చాంపియన్లు బెంగళూరు ఎఫ్ సి ప్లేయర్లు ఈ ఏడాది చరిత్ర నెలకొల్పారు. తొలిసారి ఎఎఫ్‌సి ఫైనల్స్ లో అడుగు పెట్టారు. గత నెల ఐదో తేదీన జరిగిన టైటిల్ పోరులో ఇరాకీ క్లబ్ చేతిలో సునీల్ ఛెత్రి సేన ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచింది. దీనివల్ల 120 కోట్ల మంది భారతీయుల మనస్సు తప్పక గాయపడింది.
2016 ఫుట్‌బాల్ చరిత్రలో అద్వాన్న క్షణాలు:

కొపా అమెరికా టైటిల్ రెండోసారి మెస్సి మిస్
ఎఫ్‌సి బార్సిలోనా సూపర్ స్టార్ ప్లేయర్ లియానెల్ మెస్సీ ఈ ఏడాది కూడా కొపా అమెరికా టోర్నీ టైటిల్ గెలుచుకునే అవకాశం కోల్పోయాడు. చిలీతో టైటిల్ కోసం జరిగిన మ్యాచ్‌లో మెస్సీ పంపిన పెనాల్టీ కార్నర్ పాయింట్ మిస్సయింది. తద్వారా కొపా అమెరికా టోర్నీ టైటిల్ ను చిలీ ఎగురేసుకుపోయింది.

ఆంటోనే గ్రైజ్మన్‌కు డబుల్ రన్నరప్
లా లీగ టోర్నీలో కీలక ప్లేయర్‌గా పరిగణించే ఆంటోనే గ్రైజ్మన్ కు ఈ ఏడాది రెండు యూరోపియన్ ట్రోఫీలు గెలుచుకునే అవకాశం కొద్దిలో తప్పిపోయింది. యుఇఎఫ్ఎ చాంపియన్స్ లీగ్, యూరో 2016 టోర్నీల్లో గ్రైజ్మన్ ప్రాతినిథ్యం వహించిన జట్లకు ఫైనల్స్‌లో విజయం మొహం చాటేసింది. చాంపియన్స్ లీగ్ టైటిల్‌ను క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని రియల్ మాడ్రిడ్, యూరో 2016 కప్‌ను పోర్చుగల్ టీం గెలుచుకున్నాయి.

సెమీస్‌లోనే యూరోలో జర్మనీ ఔట్
ఇప్పటి వరకు అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడంలోగానీ, నాణ్యమైన ఆట ప్రదర్శించడంలో గానీ ప్రపంచంలోకెల్లా ఉత్తమ జట్టుగా జర్మనీకి పేరుండేది. కానీ 2016 యూరో కప్ టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన జర్మనీ జట్టు టైటిల్ గెలుచుకోవాలి. రెండోసారి వరుసగా టైటిల్ గెలుచుకోవాల్సిన జర్మనీ టీం.. సెమీ ఫైనల్స్ దశలోనే ఫ్రాన్స్ చేతిలో ఓటమితో వెనుదిరిగింది.

చరిత్ర నెలకొల్పిన బెంగళూరు ఎఫ్‌సి
ఇండియన్ చాంపియన్లు బెంగళూరు ఎఫ్‌సి చరిత్ర నెలకొల్పారు. భారతదేశ చరిత్రలో తొలిసారి 2016లో ఆసియా ఫుట్ బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్‌సి) ఫైనల్స్‌లో అడుగు పెట్టారు. కానీ అల్బర్ట్ రోచా శిక్షణలో ట్రోఫీ గెలుచుకోవడంపై ఆసక్తి ప్రదర్శించినా ట్రోఫీని కోల్పోయి నిరాశకు గురయ్యారు. టైటిల్ కోసం జరిగిన పోరులో ఇరాకీ క్లబ్ చేతిలో 1 - 0 స్కోర్ తేడాతో ఓటమి పాలై వట్టిచేతులతో వెనుదిరిగారు.

సౌరేజ్ బాల్లోన్ డి'ఓర్ టాప్ 3 నామినేషన్ మిస్
బార్సిలోనా ప్లేయర్ లూయిస్ సౌరేజ్.. ప్రస్తుత సీజన్ లా లీగ టోర్నీలో అత్యధికంగా 40 గోల్స్, యుఇఎఫ్ఎ చాంపియన్స్ లీగ్‌లో 13 గోల్స్‌తో రికార్డు నెలకొల్పాడు. ఎఫ్ సి బార్సిలోనా క్లబ్ తరఫున మెరుగైన పెర్ఫార్మెన్స్ సాధించినా ఈ ఉరుగ్వేయన్.. ఫిఫా ప్రతియేటా ప్రకటించే బాల్లోన్ డి' ఓర్ అవార్డు టాప్ 3 ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications