Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా వరల్డ్ కప్: తొలి సెల్ఫ్‌గోల్ కొట్టింది ఎవరో తెలుసా?

Flashback: 1994 World Cup, Colombian player executed for own goal

హైదరాబాద్: ఫిఫా వరల్డ్ కప్ అంటేనే ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడిలో ఉంటారు. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ మెగా టోర్నీలో జట్టును గెలిపిస్తే దేశమంతా నీరాజనాలు అందుకుంటున్నారు. అంతేకాదు ఆయా ప్రభుత్వాలు ఆటగాళ్లకు అవార్డులు, రివార్డులు కూడా ప్రకటిస్తాయి.

పుట్‌బాల్ చరిత్రలో వరల్డ్ కప్ హీరోలంటే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేది మాత్రం పీలే.. మరాడోనా.. రొనాల్డో.. జిదాన్. ప్రస్తుతం రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌లో పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో, అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ పేర్లు వినిపిస్తున్నాయి.

ఇప్పటివరకు వరల్డ్ కప్‌లో 44 సెల్ఫ్‌ గోల్స్ నమోదుకాగా.. రష్యాలో జరుగుతున్న వరల్డ్ కప్‌లో నాలుగోరోజు ముగిసేసరికి 3 సెల్ఫ్‌గోల్స్ నమోదయ్యాయి. 1998లో ఫ్రాన్స్ వేదికగా జరిగిన ఫిపా వరల్డ్ కప్‌లో అత్యధికంగా 6 సెల్ఫ్‌ గోల్స్ నమోదయ్యాయి. ఈ సెల్ప్ గోల్స్ ఓ ఆటగాడి చావుకు కూడా కారణమయ్యాయి.

కొలంబియా ఓటమికి కారణమైన ఆండ్రెస్ ఎస్కోబార్‌

కొలంబియా ఓటమికి కారణమైన ఆండ్రెస్ ఎస్కోబార్‌

1994లో అమెరికాలో జరిగిన వరల్డ్ కప్‌లో సెల్ఫ్‌ గోల్‌ కొట్టి కొలంబియా ఓటమికి కారణమయ్యాడు. దీంతో కొలంబియా డ్రగ్స్ మాఫియా కొలంబియా ఆటగాడు ఆండ్రెస్ ఎస్కోబార్‌ను కాల్చి చంపించింది. ఈ ఘటన ఫిఫా వరల్డ్ కప్‌లో ఇప్పటికీ పెనువిషాదంగా మిగిలింది.

తొలి సెల్ఫ్‌గోల్ కొట్టింది ఎవరో తెలుసా?

తొలి సెల్ఫ్‌గోల్ కొట్టింది ఎవరో తెలుసా?

1930లో జరిగిన తొలి ఫిఫా కప్‌లో చిలీతో జరిగిన గ్రూప్ లీగ్ మ్యాచ్‌లో మెక్సికో ఆటగాడు మాన్యుయెల్ రోసాస్ తొలి సెల్ఫ్‌గోల్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 3-0 స్కోరుతో మెక్సికో ఓడింది. అప్పటి నుంచి తాజాగా జరుగుతున్న వరల్డ్ కప్ వరకు 44 మంది ఆటగాళ్లు సెల్ఫ్‌గోల్ నమోదు చేయడం విశేషం.

అత్యధిక సెల్ఫ్‌గోల్స్ నమోదైన వరల్డ్ కప్‌గా

అత్యధిక సెల్ఫ్‌గోల్స్ నమోదైన వరల్డ్ కప్‌గా

సెల్ఫ్‌గోల్ చేసినప్పుడు విజయం దక్కిన జట్లు కొన్ని మాత్రమే కాగా పరాజయం చవిచూసిన జట్లే ఎక్కువ కావడం విశేషం. ఫాన్స్ ఆతిథ్యం ఇచ్చిన 1998 వరల్డ్ కప్‌లో అత్యధికంగా 6 సెల్ఫ్‌ గోల్స్ నమోదయ్యాయి. ఫిఫా చరిత్రలో అత్యధిక సెల్ఫ్‌గోల్స్ నమోదైన వరల్డ్ కప్‌గా ఇప్పటివరకు అరుదైన రికార్డు సాధించింది.

ఫ్రాన్స్ ఇప్పటివరకు ఒక్క సెల్ఫ్‌గోల్ కొట్టలేదు

ఫ్రాన్స్ ఇప్పటివరకు ఒక్క సెల్ఫ్‌గోల్ కొట్టలేదు

2014లో బ్రెజిల్‌లో జరిగిన ప్రపంచకప్‌లో 5 సెల్ఫ్‌గోల్స్ నమోదు కాగా 1954లో స్విట్జర్లాండ్ అతిథ్యం ఇచ్చిన పిఫా వరల్డ్ కప్‌తో 2006లో జర్మనీలో ముగిసిన టోర్నీలో నాలుగేసి సెల్ఫ్‌గోల్స్ నమోదయ్యాయి. ఇప్పటివరకు ఫిపా వరల్డ్ కప్ చరిత్రలో ఫ్రాన్స్ జట్టు ఒక్క సెల్ఫ్‌గోల్ కొట్టలేదు. కాగా, ఫ్రాన్స్‌తో ఆడిన ప్రత్యర్థి జట్లు మాత్రం 5సార్లు సెల్ఫ్‌గోల్ నమోదు చేశాయి.

Story first published: Monday, June 18, 2018, 15:38 [IST]
Other articles published on Jun 18, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+