For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Argentina Vs Estonia : ఫుట్‌బాల్ చరిత్రలో అరుదైన రికార్డ్ సాధించిన లియోనల్ మెస్సీ

 First Time Lionel Messi Scored Five Goals in International Match While Argentina beats Estonia

స్పెయిన్‌లో ఆదివారం జరిగిన అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌లో 110వ ర్యాంక్‌ జట్టు అయిన ఎస్టోనియాపై.. అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ అయిదు గోల్స్ చేశాడు. ఒక ఇంటర్నేషనల్ టీం తరఫున మెస్సీ ఒకే మ్యాచ్‌లో 5గోల్స్ చేయడం ఇదే తొలిసారి. అలాగే ఇంటర్నేషన్ ఫుట్‌బాల్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక గోల్స్ స్కోరర్ లిస్టులో కూడా మెస్సీ తన పేరు లిఖించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో రెండుసార్లు మెస్సీ గోల్ చేశాడు. ఇందులో ఒక గోల్ పెనాల్టీ కిక్ ద్వారా వచ్చింది. ఇక మ్యాచ్ రెండో అర్ధభాగంలో మెస్సీ 3 గోల్స్ చేశాడు. మొత్తం 5గోల్స్ చేశాడు. ఇక ఈ 5-0 తేడాతో అర్జెంటీనా గెలుపొందింది. ఇక ఖతార్‌లో ఈ ఏడాది నవంబర్‌లో ప్రారంభమయ్యే ఫుట్ బాల్ ప్రపంచ‌కప్‌కు ముందు 34ఏళ్ల మెస్సీ తన అత్యుత్తమ ఫాంలోకి మళ్లీ రావడం అర్జెంటీనా జట్టుకు కలిసొచ్చేలా ఉంది.

2011 - 12 ఛాంపియన్స్ లీగ్ రౌండ్ ఆఫ్ 16లో బేయర్ లెవర్‌కుసెన్‌తో ఆడుతున్నప్పుడు మెస్సీ ఒక మ్యాచ్‌లో 5గోల్స్ చేశాడు. తదనంతం ఇప్పుడే ఇంటర్నేషన్ మ్యాచ్‌లో 5గోల్స్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ ముగిశాక.. మెస్సీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన ఫొటోలు షేర్ చేశాడు. అర్జెంటీనా తరఫున (దేశం తరఫున) ఆడడం ఎప్పుడూ ప్రత్యేకమేనన్న లియోనల్ మెస్సీ.. ఈ సీజన్ తమకు మరింత మెరుగ్గా ఉందని పేర్కొన్నాడు. అలాగే పాంప్లోనాలో స్నేహపూర్వక మ్యాచ్‌ని చూడటానికి వచ్చిన వేలాది మంది ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు.

మెస్సీ మాట్లాడుతూ.. 'మేము ఫైనల్‌సిమాలో గెలిచాం, ప్రపంచ‌కప్‌కు సిద్ధమవుతున్న సందర్భంగా మరింత ఉత్తేజ పూరితంగా ఎస్టోనియాపై గెలుపొందాం. ఈ మ్యాచ్ చూడ్డానికి స్టేడియానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ, టీవీల్లో చూసే వారందరికీ మరోసారి ధన్యవాదాలు. ఇక మేము కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోబోతున్నాము. అతి త్వరలోనే మళ్లీ ఉత్తేజంతో తిరిగి వస్తాము.' అని ఇన్‌స్టాగ్రామ్‌లో మెస్సీ రాశాడు. ఎఫ్‌సి బార్సిలోనాలో తన కెరీర్‌కు ఆకస్మికంగా ముగింపు పలికిన తర్వాత దిగ్గజ అర్జెంటీనా ప్లేయర్ అయిన మెస్సీ తన కొత్త క్లబ్ పారిస్ సెయింట్-జర్మైన్‌ తరఫున అంతగా రాణించలేక కాస్త టఫ్ టైం ఎదుర్కొన్నాడు. అతను ఛాంపియన్స్ లీగ్‌లో తన సత్తా చాటడంతో విఫలమయ్యాడు. ఇక మరిచిపోలేని పేలవ సీజన్‌ను ఎదుర్కొన్నాడు. మెస్సీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పేలవమైన సీజన్‌ను ఎదుర్కొవడానికి కారణం తాను మానసికంగా కాస్త దుర్భలంగా ఉండడమేనని, వచ్చే సీజన్ కోసం ఎదురు చూస్తున్నానని, అతను మరింత స్ట్రాంగ్‌గా తిరిగొస్తానని మెస్సీ పేర్కొన్నాడు. ఇకపోతే ప్రపంచ కప్‌‌కు ముందు అర్జెంటీనా తమ చివరి 33గేమ్‌లలో గెలుపొంది అత్యంత పటిష్ఠ ఫామ్‌లో ఉంది.

Story first published: Monday, June 6, 2022, 11:10 [IST]
Other articles published on Jun 6, 2022
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+