Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫుట్ బాల్ ప్రపంచ కప్: స్పెయిన్ దా? నెదర్లాండ్స్ దా?

spain team
జొహాన్నెస్‌బర్గ్: సాకర్ అభిమానులను విశేషంగా అలరిస్తున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఆసక్తికరమైన ముగింపుకు రంగం సిద్ధమయింది. ప్రపంచకప్ సాకర్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించడానికి యూరోపియన్ దిగ్గజాలు స్పెయిన్, నెదర్లాండ్స్ సమాయత్తమయ్యాయి.

ఎవరు గెలిచినా చరిత్ర సృష్టించనున్న నేథ్యంలో ఇరు జట్లు ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ఫైనల్లో ఆదివారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇంతవరకూ ఒక్క ప్రపంచకప్‌ను కూడా కైవసం చేసుకోని స్పెయిన్, నెదర్లాండ్స్ జట్లు ఓ ప్రధాన టోర్నమెంట్ తుదిపోరులో తలపడడం ఇదే తొలిసారి.

ఈ నేపథ్యం లో 1950లో నాలుగోస్థానంతో సంతృప్తి చెందిన యూరోకింగ్ స్పెయిన్ తొలిసారి ప్రపంచకప్ టైటి ల్ గెలిచి సత్తా చాటాలని పరితపిస్తుండగా... 1974, 1978లలో ఫైనల్‌కు చేరినా అంద ని ద్రాక్షలా ఊరిస్తున్న కప్‌ను ఈసారైనా ఒడిసిపట్టాలని ఆరెంజ్ సేన కృతనిశ్చయంతో ఉంది. మొదటిసారి యూరప్ వెలుపల ఓ యూరోపియన్ జట్టు విజేతగా నిలవనున్న ఈ చారిత్రక ఫైనల్‌కు సాకర్ సిటీ స్టేడి యం వేదికగా నిలవనుంది.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+