ఇంగ్లాండ్ ఓటమితో నిరాశ, నిస్పృహాల్లో కూరుకుపోయిన అభిమానులు.. ఆ బాధ నుంచి బయటపడేందుకు పలు రకాల వ్యాయామాలు, సంగీతం లాంటి సాధనలతోపాటు స్వేచ్ఛగా శృంగారంలో పాల్గొనాలని సూచించింది.
అంతేగాక కొంచెం కొత్తగా ఆలోచించండని పేర్కొంది. భిన్న రంగులలో ప్రపంచ కప్ వాల్ చార్ట్‌ను రూపొందించాలని సూచించింది.
1998లో అర్జెంటీనా చేతిలో ఓటమిపాలై ప్రపంచ కప్ ఫుట్‌బాల్ నుంచి నిష్క్రమించిన సమయంలో గుండె పోటుతో ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య 25శాతం పెరిగిందని ప్రభుత్వం గుర్తు చేసింది. ఈ నేపథ్యంలోనే యుకె ప్రభుత్వం తమ దేశ ప్రజలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సూచనలను జారీ చేసినట్లు తెలుస్తోంది.