Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా: వరల్డ్‌కప్ ట్రోఫీని తయారు చేసింది ఎవరో తెలుసా?

FIFA World Cup Trophy Is Made of 11 Pounds of 18-Karat Gold Worth $168,000

హైదరాబాద్: రష్యా వేదికగా 32 దేశాలు పాల్గొన్న ఫిపా వరల్డ్ కప్ ఫైనల్లో ఫ్రాన్స్‌ టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో జులై 15 (ఆదివారం) నాడు క్రొయేషియాతో జరిగిన పైనల్లో ఫ్రాన్స్‌ 4-2 తేడాతో విజయం సాధించి వరల్డ్ కప్‌ను రెండోసారి ముద్దాడింది.

ఫిఫా వరల్డ్ కప్‌లో టైటిల్ విజేతగా నిలిచిన జట్టు అందుకునే ట్రోఫీకి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. రష్యా వేదికగా జరిగిన 21వ వరల్డ్ కప్‌ టైటిల్ విజేత కోసం ట్రోఫీ తయారు చేసేందుకు అయ్యే ఖర్చు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. సుమారు 20 మిలియన్ల అమెరికా డాలర్లు.

1974లో ఇటలీకి చెందిన కళాకారుడు సిల్వియో

1974లో ఇటలీకి చెందిన కళాకారుడు సిల్వియో

పిఫా వరల్డ్ కప్ ట్రోఫీ డిజైన్‌ని 1974లో ఇటలీకి చెందిన కళాకారుడు సిల్వియో గజనిగా తయారు చేశాడు. అప్పటి నుంచి అదే మోడల్‌తో తయారు చేసిన ట్రోఫీని ఫిఫా ప్రతి నాలుగేళ్లకు నిర్వహించే వరల్డ్ కప్‌లో టైటిల్ విజేతకు బహుకరిస్తున్నారు. సిల్వియో తయారు చేసిన ట్రోఫీనే తాజాగా ఫ్రాన్స్‌ కూడా అందుకుంది.

ముందు జట్టు నుంచి తీసుకుని మెరుగులు

ముందు జట్టు నుంచి తీసుకుని మెరుగులు

ప్రతి నాలుగేళ్లకొకసారి జరిగే వరల్డ్ కప్‌కు ముందు ఈ ట్రోఫీని అంతకుముందు అందుకున్న జట్టు నుంచి తీసుకుని మెరుగులు దిద్దుతారు. అయితే ఈ మెరుగులను ఎక్కడపడితే చేయించరు. ఇటలీకి చెందిన జీడీఈ బెర్టోనీ కంపెనీలో మాత్రమే వరల్డ్ కప్‌ను చేయిస్తారు. తాజాగా ప్రాన్స్‌కు బహుకరించిన 18 క్యారెట్ల బంగారంతో 13.5 పౌండ్ల బరువుతో ఈ ట్రోఫీని తయారు చేశారు.

వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచిన జట్టుకు బహుమతిగా

వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచిన జట్టుకు బహుమతిగా

ఇలాంటి ట్రోఫీనే మరొకదాన్ని పూర్తి బంగారంతో తయారు చేసి గత వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచిన జట్టుకు అందిస్తారు. 2014లో బ్రెజిల్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో జర్మనీ టైటిల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో గతేడాది సిల్వియో 1972లో తయారు చేసిన ట్రోఫీని జర్మనీ అందుకుంది.

జర్మనీకి అదే ఆకృతిలో తయారు చేసిన మరో ట్రోఫీని

జర్మనీకి అదే ఆకృతిలో తయారు చేసిన మరో ట్రోఫీని

దీంతో జర్మనీ వద్ద ఉన్న ట్రోఫీని నిర్వాహకులు జర్మనీ నుంచి తీసుకుని ఫ్రాన్స్‌కు ఇస్తారు. ఆ స్థానంలో జర్మనీకి అదే ఆకృతిలో తయారు చేసిన మరో ట్రోఫీని అందిస్తారు. ఇప్పుడు జర్మనీకి ఇచ్చిన ట్రోఫీని సిద్ధం చేసేందుకు 20 మిలియన్‌ డాలర్లు ఖర్చు అయింది. 14.5 అంగుళాల ఎత్తులోని ఈ ట్రోఫీపై ఇద్దరు అథ్లెట్లు భూమిని తమ చేతులతో ఎత్తుతున్నట్లు ఉంటుంది.

ఏ ఏడాది ఏ జట్టు విజేతగా నిలిచిందో

ఏ ఏడాది ఏ జట్టు విజేతగా నిలిచిందో

ట్రోఫీ అడుగుభాగాన ఏ ఏడాది ఏ జట్టు విజేతగా నిలిచిందో రాసి ఉంటుంది. 1930 నుంచి 1970 మధ్య జరిగిన వరల్డ్‌కప్ పోటీల్లో విజేతగా నిలిచిన జట్టు గ్రీకు దేవత ‘నైక్‌'ను పోలి ఉంటుంది. చివరిసారిగా 1970లో ఈ ట్రోఫీని బ్రెజిల్‌ సొంతం చేసుకుంది. అనంతరం 1983లో ఈ ట్రోఫీ చోరీకి గురైంది. చోరీకి గురైన ఈ ట్రోఫీ ఇప్పటి వరకు దొరకలేదు.

Story first published: Tuesday, July 17, 2018, 16:19 [IST]
Other articles published on Jul 17, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+