Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నెదర్లాండ్: గెలుపుకు ముందు భార్యలు, ప్రియురాళ్లతో...

సాల్వడార్/ఫోర్టాలెజా: ప్రపంచ కప్ సమయంలో శృంగారం వద్దని, భార్యల్ని అసలే కలవొద్దని మెజార్టీ కోచ్‌లు పట్టుబట్టిన విషయం తెలిసిందే. కానీ స్పెయిన్ పైన చారిత్రక విజయం సాధించడానికి ముందు నెదర్లాండ్స్ ఆటగాళ్లందరూ తమ భార్యలు, ప్రేయసిలను కలిసే వీలు కల్పించాడు ఆ జట్టు కోచ్.

వాళ్లను కలవడం వల్ల తమ ఆటగాళ్లు తాజాగా మైదానంలోకి దిగారని కోచ్ చెబుతున్నాడు. తమ విజయానికి మాత్రం అదే కారణం కాదని, ఆటగాళ్ల మానసిక స్థితి వాతావరణాన్ని బట్టి మారుతుందని, అందుకే ఆటగాళ్లు సంతోషిస్తారని భావించి గురువారం ఉదయం వారి భార్యలు, ప్రేయసులను కలవడానికి అనుమతించానని, అయినంత మాత్రాన తమ గెలుపుకు ఇదే కారణమని మాత్రం చెప్పడం లేదన్నారు.

Fifa World Cup: Spain suffer worst defeat as defending champions

కోస్టాకు అవమానం!

స్పెయిన్ ఆటగాడు డిగో కోస్టాను అన్ని రకాలుగా దురదృష్టం వెంటాడుతోంది. కోస్టా బ్రెజిల్‌లో జన్మించాడు. అతని కుటుంబం స్పెయిన్‌కు వలస వెళ్లడంతో అక్కడే ఫుట్‌బాలర్‌గా ఎదిగాడు. జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. వరల్డ్ కప్ సాకర్ చాంపియన్‌షిప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ దారుణంగా విఫలమైంది. కోస్టా గోల్స్ చేయలేకపోగా, జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు.

తీవ్రమైన ఒత్తిడిలో మ్యాచ్ ఆడడం వల్లే అతను రాణించలేకపోయాడన్నది విశ్లేషకుల అభిప్రాయం. కోస్టా మైదానంలో కనిపించినంత సేపు బ్రెజిల్ అభిమానులు అతనిని హేళన చేశారు. ఎటువైపు వస్తే అటువైపు స్టాండ్స్‌లో మ్యాచ్‌ని తిలకిస్తున్న ప్రేక్షకులు కోస్టాను తిట్టిపోశారు. బ్రెజిల్‌లో పుట్టి మరో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడమా అంటూ మండిపడ్డారు. ఒకవైపు ప్రేక్షకుల వెక్కిరింతలు, మరోవైపు స్పెయిన్ పరాజయం కోస్టాను అవమాన భారంతో తలదించుకునేలా చేశాయి.

Story first published: Tuesday, November 14, 2017, 10:06 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+