For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రేక్ చేయలేని ఫుట్‌బాల్ వరల్డ్ కప్ రికార్డులు ఇవిగో..

FIFA World Cup Records That Are Under Real Threat

హైదరాబాద్: ప్రపంచంలోని క్రీడాభిమానులందరినీ ఉర్రూతలూగించేందుకు ఫిఫా వరల్డ్ కప్ రష్యా వేదికగా సిద్ధమైంది. ఈ క్రమంలో మేటి క్రీడాకారుల విన్యాసాలు.. వారి అద్భుత ప్రదర్శనకు తుడిచి పెట్టుకుపోనున్న రికార్డులు అన్నీ మన కళ్లముందుకు రాబోతున్నాయి. 20 సార్లుగా ప్రపంచకప్‌ టోర్నీలు జరిగినా కొన్ని రికార్డులు మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉండిపోయాయి.

 అరంగేట్రంలోనే కప్‌

అరంగేట్రంలోనే కప్‌

ఉరుగ్వే (1930), ఇటలీ (1934) ప్రపంచకప్‌ అరంగేట్రంలోనే టైటిల్‌ పట్టేశాయి. అప్పుడు ఆ రెండు జట్లు ఆతిథ్య దేశాలు కావడం విశేషం. రష్యాలో జరగనున్న ఈ వరల్డ్‌కప్‌లో ఐస్‌లాండ్‌, పనామా తొలిసారి బరిలో దిగనున్నాయి. మరి ఆ రెండు జట్లు ఉరుగ్వే, ఇటలీ సరసన నిలుస్తాయా.. లేదా అనేది చూడాల్సిందే.

10.8 సెకన్లలోనే గోల్‌

10.8 సెకన్లలోనే గోల్‌

దక్షిణకొరియా, జపాన్‌ సంయుక్తం గా ఆతిథ్యమిచ్చిన 2002 వరల్డ్‌క్‌పలో టర్కీ స్ట్రయికర్‌ హకన్‌ సుకుర్‌ మ్యాచ్‌ మొదలైన 10.8 సెకన్లలో గోల్‌ కొట్టి అత్యంత వే గంగా గోల్‌చేసిన రికార్డు సాధించాడు. రెఫరీ విజిల్‌ వేశాడో లేదో..మెరుపు వేగంతో కదిలిన సుకుర్‌ బంతిని దొరకబుచ్చుకొని గోల్‌పోస్ట్‌లోకి తరలించాడు. చెక్‌ ఆటగాడు వక్లావ్‌ మాసెక్‌ రికార్డు (16 సెకన్లు)ను అధిగమించాడు.

భారీ విజయం

భారీ విజయం

క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధించిన రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. 2002 వరల్డ్‌ కప్‌ క్వాలిఫయింగ్స్‌లో అమెరికన్‌ సమోవాతో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 31-0తో ఘన విజయం సాధించింది.

 56 సెకన్లలో అవుట్‌

56 సెకన్లలో అవుట్‌

మ్యాచ్‌ అలా మొదలైందో లేదో రెడ్‌కార్డ్‌తో మైదానం వీడిన రికార్డు ఉరుగ్వే డిఫెండర్‌ గాబ్రియేల్ బటిస్టుటా సొంతం. 1986 వరల్డ్‌క్‌పలో స్కాట్లండ్‌తో మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాడిని మొరటుగా అడ్డుకోవడంతో 56వ సెకనులోనే రెఫరీ బటిస్టుటాకు రెడ్‌కార్డ్‌ చూపడంతో బయటకు వెళ్లాల్సి వచ్చింది.

ఒక మ్యాచ్‌.. లక్షా 73వేలమంది

ఒక మ్యాచ్‌.. లక్షా 73వేలమంది

ఓ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ను అత్యధికంగా ఎంతమంది తిలకించారో తెలుసా..అక్షరాలా లక్షా 73వేల 830మంది. 1950 ప్రపంచక్‌పనకు బ్రెజిల్‌ ఆతిథ్యమిచ్చింది. ఎస్టాడొ డి మర్‌కానా స్టేడియంలో బ్రెజిల్‌-ఉరుగ్వే జట్ల మధ్య జరిగిన ఈ టైటిల్‌ పోరుకు అనధికారిక లెక్కల ప్రకారం 1,99,854మంది హాజరయ్యారు. ఈ రికార్డు నేటివరకూ పదిలంగా ఉండడానికి కారణం..అప్పట్లో మర్‌కానా స్టేడియంలో స్టాండ్లేతప్ప సీట్లు లేకపోవడం. ప్రస్తుతం అంతర్జాతీయ పుట్‌బాల్‌ మ్యాచ్‌లన్నీ సీట్లు కలిగిన స్టేడియాలలోనే జరుగుతున్నాయి. ఇక ప్రపంచంలో అతి పెద్ద స్టేడియం అయిన ఉత్తరకొరియాలోని ప్యాంగ్‌యాంగ్‌ సామర్థ్యం కూడా 1.50,000 మాత్రమే.

Story first published: Thursday, May 31, 2018, 14:47 [IST]
Other articles published on May 31, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+