Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పోయిందనుకున్న టిక్కెట్.. దొరికినా మ్యాచ్ మిస్సయ్యింది..!

Fifa World Cup: England fan travels 3200km to Russia, forgets World Cup ticket

హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఫిఫా ఫుట్‌బాల్ మ్యాచ్‌కు ప్రపంచ నలుమూలల నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో రష్యాకు వచ్చారు. ఒక్కొక్కరూ విభిన్న రీతిలో ప్రయాణించి స్టేడియానికి వస్తున్న వీళ్లలో వయస్సుతో సంబంధం లేకుండా అభిమానులు తరలి వస్తున్నారు. అయితే, మ్యాచ్ చూసేందుకు భారీగా క్రేజ్ ఉండడంతో కొద్ది రోజుల ముందుగానే ఔత్సాహికులు టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇలా ముందుగానే బుక్ చేసుకున్న ఓ అభిమాని ఇంట్లోనే టిక్కెట్ మర్చిపోయి వింతైన అనుభవాలు ఎదుర్కొన్నాడు.

ఇంగ్లాండ్‌-పనామా మ్యాచ్‌ చూసేందుకు

ఇంగ్లాండ్‌-పనామా మ్యాచ్‌ చూసేందుకు

ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్‌-పనామా మ్యాచ్‌ చూసేందుకు ఓ అభిమాని రష్యా వచ్చాడు. అతని పేరు డాగ్లస్‌ మోర్టన్‌. వయస్సులో చాలా పెద్దవాడు. ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌ నుంచి సుమారు రెండు వేల మైళ్లు దాటుకుని ఈ మ్యాచ్‌ చూసేందుకు వచ్చాడు. ఓ హోటల్‌లో బస చేశాడు. మరికొద్ది గంటల్లో మ్యాచ్‌ ప్రారంభకానుండటంతో మోర్టన్‌ మైదానానికి బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు. తీరా చూస్తే అతడు ఏ మ్యాచ్‌కు వెళ్లాలని టిక్కెట్‌ కొనుకున్నాడో.. దాన్ని ఇంట్లోనే మరిచిపోయాడు.

మోర్టన్‌ వెంటనే తన బాధను ఆ హోటల్‌లోనే

మోర్టన్‌ వెంటనే తన బాధను ఆ హోటల్‌లోనే

దీంతో తీవ్ర నిరాశ చెందిన మోర్టన్‌ వెంటనే తన బాధను ఆ హోటల్‌లోనే ఉన్న ఓ మీడియా రిపోర్టర్‌ డాన్‌ హౌవెల్స్‌కు చెప్పాడు. ఆ ముసలాయన బాధకు కరిగిపోయిన డాన్‌.. మెర్టన్‌తో దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నాడు. ‘ఈయన పేరు మోర్టన్‌. ఇంగ్లాండ్‌-పనామా మ్యాచ్‌ చూసేందుకు వచ్చాడు. కానీ, మ్యాచ్‌ టిక్కెట్‌ను బ్రిస్టల్‌లోని తన ఇంట్లోనే మరిచిపోయాడు. ఎవరి దగ్గరైనా ఎక్స్‌ట్రా టిక్కెట్‌ ఉంటే సాయం చేయండి' అని పేర్కొన్నాడు.

మ్యాచ్‌ ప్రారంభయ్యే 40 నిమిషాల ముందుగానే

ఇది చూసిన ఓ అభిమాని డాన్‌కు మ్యాచ్‌ టిక్కెట్‌ అందజేశాడు. హమ్మయ్య మోర్టన్‌ ఇక సంతోషంగా మ్యాచ్‌ చూస్తాడులే అనుకుంటున్న సమయంలో చాలాసేపు కనిపించకుండా పోయాడు. వెంటనే డాన్‌ మరో ట్వీట్‌ చేశాడు. ‘మ్యాచ్‌ చూసేందుకు టిక్కెట్‌ దొరికిందని చెప్పండి. మోర్టన్‌ ఎక్కడున్నా తాను బస చేసిన హోటల్‌ రిసెప్షన్‌లో టిక్కెట్‌ తీసుకుని మ్యాచ్‌ చూసేందుకు వెళ్లమని చెప్పండి' అని తెలిపాడు. ఎవరి ద్వారానో విషయం తెలుసుకున్న మోర్టన్‌ మ్యాచ్‌ ప్రారంభయ్యే 40 నిమిషాల ముందుగానే టిక్కెట్‌ను అందుకున్నాడు.

ఇంగ్లాండ్‌ 6-1తో పనామాను చిత్తుచిత్తుగా ఓడించి

ఇంగ్లాండ్‌ 6-1తో పనామాను చిత్తుచిత్తుగా ఓడించి

దురదృష్టవశాత్తూ అతడు మ్యాచ్‌ను చూసేందుకు సరైన సమయానికి మైదానానికి వెళ్లలేకపోయాడట. ఈ విషయాన్ని కూడా డానే తెలిపాడు. పాపం ఎంతమంది సహకరించినా.. మోర్టన్‌‌ను దురదృష్టం వెంటాడుతునే ఉంది. పనామాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ విజయం సాధించి నాకౌట్‌కు దూసుకెళ్లింది. గోల్స్‌ మోత మోగించిన ఇంగ్లాండ్‌ 6-1తో పనామాను చిత్తుచిత్తుగా ఓడించింది. కెప్టెన్‌ హ్యారీ కేన్‌ హ్యాట్రిక్‌తో మెరిశాడు.

Story first published: Monday, June 25, 2018, 16:26 [IST]
Other articles published on Jun 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+