For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫేవరేట్ కాదు: వరల్డ్ కప్‌కు ముందు బాంబు పేల్చిన రొనాల్డో

By Nageshwara Rao
FIFA World Cup: Do not write Portugal off, warns Cristiano Ronaldo

హైదరాబాద్: రష్యా ఆతిథ్యమిస్తోన్న ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్‌ టైటిల్‌ ఫేవరేట్‌ కాదనే వాస్తవాన్ని అభిమానులు గ్రహించాలని ఆ జట్టు కెప్టెన్‌ క్రిస్టియానో రొనాల్డో పేర్కొన్నాడు. అయితే టోర్నీలో ఏదైనా సాధ్యమే అన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించాడు.

వరల్డ్ కప్ కోసం రష్యా వెళ్లనున్న పోర్చుగల్‌ జట్టుకు ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో రొనాల్డో మాట్లాడాడు. "వాస్తవంగా చూసుకుంటే మేం ఫేవరేట్లం కాదని మాకు తెలుసు. కానీ ఫుట్‌బాల్‌లో ఏదైనా సాధ్యమే. గ్రూప్‌ స్టేజి చాలా కఠినంగా ఉండబోతుంది. అయినా మంచి ఆటగాళ్లతో కూడిన మా జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తుందనే నమ్మకం ఉంది" అని అన్నాడు.

 ఆటలో ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తాం

ఆటలో ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తాం

"చివరి వరకూ విజయం కోసం పోరాడుతాం. ఆటలో ఏదైనా సాధ్యమే అని నిరూపిస్తాం. ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తాం. దేశం తరపున ఆడబోతుండడం గర్వంగా ఉంది" అని రొనాల్డో తెలిపాడు. పోర్చుగల్ జట్టు స్పెయిన్‌, మొరాకో, ఇరాన్‌లతో కలిసి గ్రూప్‌- బిలో ఉంది. టోర్నీలో భాగంగా పోర్చుగల్ జట్టు తన తొలి మ్యాచ్‌ని జూన్ 15న స్పెయిన్‌తో ఆడనుంది.

 పోర్చుగల్ జట్టు:

పోర్చుగల్ జట్టు:

పీటర్, రాఫెల్ గుయెర్రెరో, రిక్కార్డో పెరీరా, రూబెన్ డయాస్, అడ్రియన్ సిల్వా, బ్రూనో ఫెర్నాండెజ్, జోవో మారియో, జోవో మౌటిన్హో, మాన్యువల్ ఫెర్నాండెజ్, విలియమ్ కార్వాల్హో, ఆండ్రీ, ఆండోనీ లోప్స్, బీటో, రుయి పట్రిసియో, బ్రూనో ఆల్వ్స్, సెడ్రిక్ సోరేస్, జోస్ ఫాంటే, మారియో రుయ్, సిల్వా, బెర్నార్డో సిల్వా, క్రిస్టియానో రొనాల్డో, గెల్సన్ మార్టిన్స్, గోంకోలో గైడెస్, రికార్డో క్వారెస్మా

కోచ్: ఫెర్నాండో శాంటాస్

టాప్ ప్లేయర్లు: క్రిస్టియానో రొనాల్డో, బెర్నార్డో సిల్వా, పీపీ

 వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లు:

వరల్డ్ కప్‌లో మ్యాచ్‌లు:

June 15: vs Spain

June 20: vs Morocco

June 25: vs Iran

 గత రికార్డులు:

గత రికార్డులు:

No. of times team has played in WC (number): 6

No. of matches played (number): 26

No. of matches won: 13

No. of matches lost: 9

No. of times lost in finals (Number): 0

No. of times world cup won (number): 0

No. of goals scored in WC: 43

Story first published: Friday, June 8, 2018, 13:47 [IST]
Other articles published on Jun 8, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+