ఫిఫా వరల్డ్ కప్: భారత్‌లో ఎక్కువ మంది వీక్షించిన మ్యాచ్ ఏదో తెలుసా?

హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సాకర్ అభిమానులు ఈ వరల్డ్ కప్‌ను తెగ ఆస్వాదిస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులతో రష్యాలోని స్టేడియాలన్నీ మారుమోగిపోతున్నాయి.
ఈ వరల్డ్ కప్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు గాను సుమారు 10 లక్షల మంది సాకర్ అభిమానులు రష్యాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇక, అక్కడి దాకా వెళ్లి చూసే అవకాశం లేనివాళ్లు వివిధ మార్గాల్లో మ్యాచ్‌లు చూస్తూ ఆనందిస్తున్నారు. గత వరల్డ్ కప్‌లతో పోలిస్తే ఈ వరల్డ్ కప్‌కు భారతదేశంలో కూడా భారీగా క్రేజ్ పెరిగింది.

భారత్‌లో గణనీయంగా పెరిగిన పుట్‌బాల్ వీక్షకుల సంఖ్య
టీవీ, ఆన్‌లైన్‌లో మ్యాచ్‌లు వీక్షించే అభిమానుల సంఖ్య భారత్‌లో గణనీయంగా పెరిగినట్లు బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్) తన నివేదికలో పేర్కొంది. మొదటి రెండు రోజులకే(నాలుగు మ్యాచ్‌లు) నిమిషానికి 4.7 కోట్ల మంది అభిమానులు వీక్షించినట్లు బార్క్ ఓ నివేదికలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

11.7 కోట్లకు చేరిన వీక్షకుల సంఖ్య
అయితే తాజాగా ఈ వీక్షకులు సంఖ్య 11.7 కోట్లకు పెరిగినట్లు బార్క్ మరోసారి వెల్లడించింది. ఫిఫా వరల్డ్ కప్‌కు సంబంధించి మొదటి తొమ్మిది రోజులకు(26మ్యాచ్‌లు) సంబంధించి వీక్షకుల వివరాలను బార్క్ తన నివేదికలో పేర్కొంది. దీనిలో సుమారు 9.9కోట్ల మంది టెలివిజన్ ద్వారా, ఆన్‌లైన్ ద్వారా 1.8 కోట్ల మంది చూసినట్లు తెలిసింది.

టాప్‌లో పశ్చిమ బెంగాల్
అయితే మ్యాచ్ పరంగా చూసుకుంటే భారత్‌లో అత్యధికంగా గ్రూప్-డిలో డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీ-మెక్సికో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌నే అత్యధికంగా వీక్షించినట్లు వెల్లడైంది. ఈ మ్యాచ్‌ను భారత్‌లో సుమారు 70లక్షల మంది చూసినట్లు బార్క్ వెల్లడించింది. ఇక, రాష్ట్రాల వారీగా ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లను వీక్షించిన వాటిలో పశ్చిమ బెంగాల్ ముందంజలో ఉంది.

గ్రామీణ ప్రాంతాల నుండి వీక్షకులు సంఖ్య 41 శాతం
ఆ తర్వాత స్థానాల్లో కేరళ, ఈశాన్య రాష్ట్రాలు, మహారాష్ట్రలు ఉన్నాయి. స్థానిక భాషల్లోనూ(హిందీ, మలయాళం, బెంగాలీ, తమిళం, తెలుగు) వీక్షకుల సంఖ్య 46 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్‌కు భారత్‌లో కూడా బాగా ప్రాచుర్యం కల్పించడంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ ఫుట్‌బాల్‌కు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల నుండి వీక్షకులు సంఖ్య 41 శాతంగా ఉందని తెలిపింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications