Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2026: ఇరాన్ టీమ్‌కు షాకిచ్చిన అమెరికా.. ఆదుకున్న మెక్సికో!

FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నీలో పాల్గొనబోతున్న ఇరాన్ ఫుట్ బాల్ జట్టుకు అమెరికాలో బస చేసేందుకు అనుమతి లభించలేదు. దీంతో ఇరాన్ జట్టు తన బేస్ క్యాంప్‌ను మెక్సికోలో ఏర్పాటు చేసుకుంది. మ్యాచ్ జరిగే రోజున మాత్రమే ఇరాన్ జట్టు అమెరికాకు వెళ్లి మ్యాచ్ ముగిసిన అనంతరం తిరిగి మెక్సికో చేరుకుంటుంది. ఈ మేరకు ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు తమ దేశంలో బస చేయడానికి మెక్సికో ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది.

ప్రస్తుత రాజకీయ, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ జట్టును టోర్నీ సమయంలో తమ దేశంలో రాత్రి వేళల్లో ఉంచుకోవడానికి అమెరికా నిరాకరించింది. ఇరాన్‌కు అమెరికా, ఇజ్రాయెల్‌లతో గత ఫిబ్రవరి నుంచి యుద్ధం నడుస్తోంది. ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి పలుమార్లు ప్రయత్నాలు జరిగినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ఫలితం రాలేదు. ఈ భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ ప్లేయర్లకు అమెరికా వీసా, బస నియమాల్లో ఆంక్షలు విధించింది.

FIFA World Cup 2026 USA Denies Stay to Iran Football Team Mexico Offers Base Camp Full Details

షెడ్యూల్ ప్రకారం ఇరాన్ జట్టు తన గ్రూప్ రౌండ్ మ్యాచ్‌లను అమెరికాలోనే ఆడాల్సి ఉంది. ఇరాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్, ఫిఫా ప్రకటించిన వివరాల ప్రకారం.. ఇరాన్ జట్టు మ్యాచ్ జరిగే రోజునే అమెరికాకు వెళ్లి ఆట ముగిసిన వెంటనే అదే రోజు మెక్సికోకు తిరిగి వచ్చేలా ప్లాన్ సిద్ధం చేసుకుంది. ఇందుకోసం కాలిఫోర్నియాకు దక్షిణంగా ఉన్న మెక్సికోలోని 'తిజువానా' నగరాన్ని ఇరాన్ జట్టు బేస్ క్యాంప్‌గా మార్చుకుంది.

ఈ విషయమై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షిన్‌బామ్ మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా ఇరాన్ జట్టుకు రాత్రి బస కల్పించేందుకు ఇష్టపడకపోవడంతో ఫిఫా తమ ప్రభుత్వాన్ని సంప్రదించిందని వెల్లడించారు. ఇరాన్ జట్టు మెక్సికోలో ఉండటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. ఫిఫా అభ్యర్థనను తాము వెంటనే ఆమోదించామని ఆమె స్పష్టం చేశారు. క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెక్సికో తెలిపింది.

ఫిఫా ప్రపంచ కప్ 2026 జూన్ 11 నుంచి ప్రారంభం కానుండగా.. జులై 19న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు అమెరికాతో పాటు మెక్సికో, కెనడాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ టోర్నీలో ఇరాన్ జట్టు గ్రూప్-జి (Group G) లో ఉంది. ఈ గ్రూప్‌లో ఇరాన్‌తో పాటు బెల్జియం, ఈజిప్ట్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. ఇరాన్ జట్టు జూన్ 15న ఇంగిల్‌వుడ్‌లోని సోఫీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో తన మొదటి మ్యాచ్ ఆడనుంది. అదే మైదానంలో జూన్ 21న బెల్జియంతో తలపడనుంది. ఆ తర్వాత సియాటెల్‌లోని ల్యూమెన్ ఫీల్డ్‌లో ఈజిప్ట్‌తో ఇరాన్ తన చివరి గ్రూప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. మెక్సికోలోని తిజువానా నుంచి ఇంగిల్‌వుడ్ కేవలం 225 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం ఇరాన్ జట్టుకు కాస్త ఉపశమనం కలిగించే విషయమే అయినప్పటికీ, సియాటెల్ నగరం మాత్రం దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో చివరి మ్యాచ్ రోజున ఇరాన్ ఆటగాళ్లకు సుదీర్ఘ ప్రయాణం తప్పేలా లేదు.

Story first published: Tuesday, May 26, 2026, 13:36 [IST]
Other articles published on May 26, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+