ఎవరీ బ్యూటీఫుల్ ట్విన్ సిస్టర్స్? ఫిఫా వరల్డ్‌కప్‌లో క్రేజీ సీన్! (వీడియో)
FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లు స్టేడియంలో ఆటగాళ్ల ఆట వల్ల మాత్రమే కాకుండా గ్యాలరీలో కూర్చుని సందడి చేసే ఫ్యాన్స్ వల్ల కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంటాయి. ఇటీవల పోర్చుగల్, కొలంబియా జట్ల మధ్య జరిగిన చివరి లీగ్ స్టేజ్ మ్యాచ్‌లో పోర్చుగల్ ఓడిపోయినప్పటికీ.. ఆ మ్యాచ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో గాల్లోకి ఎగురుతూ తన సిగ్నేచర్ స్టైల్ అయిన బైస్కిల్ కిక్ ద్వారా గోల్ చేసేందుకు యత్నించాడు. రొనాల్డో చేసిన ఈ అద్భుతమైన ప్రయత్నం తృటిలో తప్పిపోయింది. అయితే ఆ సమయంలో కూర్చున్న ఇద్దరు బ్యూటీఫుల్ కవల సోదరీమణుల హావభావాలు కెమెరా కంటికి చిక్కాయి. ఆ క్షణం సోషల్ మీడియాలో ఓ పెద్ద తుఫానును సృష్టించింది.
వైరల్ అయిన ఈ క్షణానికి కేంద్ర బిందువుగా నిలిచింది పోర్చుగల్ దేశానికి చెందిన ట్విన్ సిస్టర్స్ మారియా నీవా, మటిల్డే నీవా. రొనాల్డో షాట్ గోల్‌పోస్ట్‌కు అత్యంత సమీపం నుంచి పక్కకు వెళ్లిన వెంటనే.. టీవీ బ్రాడ్‌కాస్టర్స్ కెమెరాను ప్రేక్షకుల గ్యాలరీ వైపు తిప్పారు. అక్కడ కూర్చున్న మారియా, మటిల్డేల ముఖాల్లోని ఆశ్చర్యం, ఉత్కంఠ, రొనాల్డోపై ఉన్న గౌరవం కలగలిసిన హావభావాలు అద్భుతంగా అనిపించాయి. ఈ రియాక్షన్ క్షణాల్లో కోట్లాది మంది ఫుట్‌బాల్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. మ్యాచ్ ముగియక ముందే వీరిద్దరి వీడియో క్లిప్స్, మీమ్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారాయి.

ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ ట్విన్ సిస్టర్స్ కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు. మారియా నీవా సోషల్ మీడియాలో పోర్చుగల్ జట్టుకు మద్దతు ఇస్తూ తరచుగా తన ఫోటోలు, వీడియోలను పంచుకుంటూ ఉంటుంది. ఇకపోతే ఆమె కవల సోదరి మటిల్డే నీవాకు పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టుతో చాలా ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఆమె పోర్చుగల్ స్టార్ వింగర్ ఫ్రాన్సిస్కో కాన్సిసియో సతీమణి కావడం విశేషం. ఈ ప్రత్యేక అనుబంధం వల్లే ఈ కీలక మ్యాచ్‌లో తమ జట్టును, ఆటగాళ్లను ప్రోత్సహించడానికి ఈ సోదరీమణులు గ్యాలరీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
సోషల్ మీడియాలో ఫుట్‌బాల్ అభిమానులు ఈ వైరల్ మూమెంట్‌పై లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రొనాల్డో చేసిన ఆ అద్భుతమైన ప్రయత్నం విఫలమైనప్పుడు మైదానంలో ఉన్న ప్రతి పోర్చుగల్ మద్దతుదారుడి మానసిక స్థితి కూడా సరిగ్గా ఈ ఇద్దరు సోదరీమణుల లాగే ఉందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. పోర్చుగల్ జట్టు కొలంబియాపై గెలవలేకపోయినప్పటికీ.. ఈ కవల సోదరీమణులు మాత్రం ఇంటర్నెట్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications