Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA WC 2026: అత్యధిక పారితోషికం పొందుతున్న టాప్-5 ఆటగాళ్లు వీరే..!

FIFA WC 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ అనేక సరికొత్త రికార్డులకు వేదికవుతోంది. 96 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారిగా ఈ ఏడాది ఏకంగా 48 జట్లు కప్పు కోసం పోటీపడుతున్నాయి. అంతే కాకుండా మూడు దేశాల్లోని 16 నగరాల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ ప్రపంచకప్‌కు అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. అర్జెంటీనా తరఫున డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న 38 ఏళ్ల లియోనెల్ మెస్సీ, పోర్చుగల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న 41 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డో రూపంలో ఇద్దరు బిలియనీర్ ఆటగాళ్లు ఒకేసారి ఆడుతుండటం కూడా ఇదే తొలిసారి.

అయితే ఈ సారి ప్రపంచ కప్ టికెట్ల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కేవలం మిలియనీర్లు మాత్రమే స్టేడియానికి వెళ్లి మ్యాచ్ లు చూసేలా రేట్లు ఆకాశాన్ని తాకాయి. జులై 19న న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం ఫిఫా అధికారికంగా ఒక టికెట్ ధరను ఏకంగా 32,970 డాలర్లు (సుమారు రూ. 27.5 లక్షలు) గా నిర్ణయించింది. ఇది 2022 ఖతార్ ప్రపంచకప్ ఫైనల్ టికెట్ ధర కంటే 20 రెట్లు ఎక్కువ. అయితే ఈ మెగా టోర్నీలో ఆడుతున్న ఆటగాళ్లలో అత్యధిక పారితోషికం పొందుతున్న టాప్ 5 ఫుట్ బాల్ ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

FIFA World Cup 2026 Top 5 Highest-Paid Footballers Cristiano Ronaldo and Lionel Messi Lead

1. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్)

*ఆన్-ఫీల్డ్ ఆదాయం: $235 మిలియన్లు( సుమారు రూ. 2,235 కోట్లు)
*ఆఫ్-ఫీల్డ్ ఆదాయం: $65 మిలియన్లు(సుమారు రూ. 618 కోట్లు)
ఫుట్‌బాల్‌లోనే కాకుండా ప్రపంచ క్రీడా రంగంలోనే వరుసగా నాలుగో ఏడాది అత్యధిక సంపాదన కలిగిన అథ్లెట్‌గా క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. తన కెరీర్‌లో $2 బిలియన్ల(19,000 కోట్లు) కంటే ఎక్కువ సంపాదించిన ఏకైక యాక్టివ్ ప్లేయర్ ఈయనే. ఫోర్బ్స్ ప్రకారం ప్రస్తుతం రొనాల్డో నికర ఆస్తి విలువ $1.2 బిలియన్లు( రూ. 11,400 కోట్లు). 2023లో మిడిల్ ఈస్ట్‌కు మారిన తర్వాత గత నెలలోనే అల్-నస్ర్ జట్టు సౌదీ ప్రో లీగ్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన రొనాల్డో.. తన 6వ ప్రపంచకప్‌లో ఎలాగైనా తొలి టైటిల్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు.

2. లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా)

*ఆన్-ఫీల్డ్ ఆదాయం: $70 మిలియన్లు (సుమారు రూ. 665 కోట్లు)
*ఆఫ్-ఫీల్డ్ ఆదాయం: $70 మిలియన్లు(సుమారు రూ. 665 కోట్లు)
తన చిరకాల ప్రత్యర్థి రొనాల్డో లాగే అర్జెంటీనా స్టార్ మెస్సీ కూడా $1.1 బిలియన్ల(రూ. 10,450 కోట్లు) నికర ఆస్తితో ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో చేరాడు. రొనాల్డో, మెక్సికోకు చెందిన గిల్లెర్మో ఒచోవాతో పాటు మెస్సీ కూడా తన 6వ ప్రపంచకప్ ఆడుతూ రికార్డు సృష్టించాడు. జూన్ 24న 39వ వసంతంలోకి అడుగుపెట్టనున్న ఈ ఇంటర్ మయామి స్టార్ ఆటగాడు, అర్జెంటీనాకు 4వ ప్రపంచకప్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. మిరోస్లావ్ క్లోజ్ పేరిట ఉన్న వరల్డ్ కప్ హిస్టరీలోనే అత్యధిక గోల్స్ (16) రికార్డును అధిగమించడానికి మెస్సీకి మరో 4 గోల్స్ అవసరం.

3. కిలియన్ ఎంబాప్పే (ఫ్రాన్స్)

*ఆన్-ఫీల్డ్ ఆదాయం: $70 మిలియన్లు (సుమారు రూ. 665 కోట్లు)
*ఆఫ్-ఫీల్డ్ ఆదాయం: $25 మిలియన్లు(సుమారు రూ. 237 కోట్లు)
మెస్సీ కంటే మూడు ప్రపంచకప్‌లు తక్కువ ఆడినప్పటికీ, వరల్డ్ కప్ కెరీర్ రికార్డులో మెస్సీ కంటే కేవలం ఒకే ఒక్క గోల్ వెనుకబడి ఉన్నాడు ఎంబాప్పే. కేవలం 19 ఏళ్ల వయసులోనే (2018లో) ఫ్రాన్స్ ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఎంబాప్పే, ప్రస్తుతం ప్రపంచ ఫుట్‌బాల్‌లోనే అత్యంత క్రేజ్ ఉన్న ఆటగాడిగా మారాడు. ఈ టోర్నీకి ముందే ఆయన ఫెయిర్‌మాంట్ హోటల్స్, ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ 'అలాన్' లతో భారీ ఎండార్స్‌మెంట్ ఒప్పందాలను కుదుర్చుకున్నాడు.

4. ఎర్లింగ్ హాలాండ్ (నార్వే)

ఆన్-ఫీల్డ్ ఆదాయం: $60 మిలియన్లు (సుమారు రూ. 570 కోట్లు)
ఆఫ్-ఫీల్డ్ ఆదాయం: $20 మిలియన్లు(సుమారు రూ. 190 కోట్లు)
మాంచెస్టర్ సిటీ క్లబ్‌తో గతేడాది భారీ కాంట్రాక్ట్ పొడిగింపు ఒప్పందంపై సంతకం చేసిన 25 ఏళ్ల స్ట్రైకర్ హాలాండ్ ఈ జాబితాలో నాల్గో స్థానంలో ఉన్నాడు. స్పానిష్ క్లబ్ అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న ఎన్రికే రిక్వెల్మే తాను గెలిస్తే హాలాండ్‌ను జట్టులోకి తెస్తానని ప్రకటించడం ఇటీవల సంచలనమైంది. 1998 తర్వాత (హాలాండ్ పుట్టకముందు) నార్వే దేశం మళ్లీ ఇన్నాళ్లకు ప్రపంచకప్‌కు అర్హత సాధించడంతో ఈ టోర్నీలో హాలాండ్ ప్రదర్శనపై అందరి కళ్లూ నిలిచాయి.

5. వినీషియస్ జూనియర్ (బ్రెజిల్)

ఆన్-ఫీల్డ్ ఆదాయం: $40 మిలియన్లు (సుమారు రూ. 380 కోట్లు)
ఆఫ్-ఫీల్డ్ ఆదాయం: $20 మిలియన్లు(సుమారు రూ. 190 కోట్లు)
బ్రెజిల్ జట్టుకు ఈసారి కప్పు గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, అర్జెంటీనా, పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్ జట్లే ఫేవరెట్లు అని ఈ 25 ఏళ్ల వినీషియస్ జూనియర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయినప్పటికీ 24 ఏళ్ల బ్రెజిల్ ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించాలని ఈ సెలెకావ్ ఫార్వర్డ్ ఆటగాడు భావిస్తున్నాడు. ఇటీవల నైకీ (Nike) సంస్థ విడుదల చేసిన కొత్త ప్రకటనలో పాపులర్ గేమ్ 'ఫోర్ట్‌నైట్' స్కిన్‌తో వినీషియస్ కనిపించడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Story first published: Friday, June 12, 2026, 17:43 [IST]
Other articles published on Jun 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+