Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA WC 2026: ఫిఫా వరల్డ్‌కప్‌లో సంచలనం.. స్పెయిన్‌ను వణికించిన బుజ్జీ దేశం

ఫుట్‌బాల్ ప్రపంచకప్ అంటేనే సంచలనాలకు వేదిక. ఎవరూ ఊహించని చిన్న జట్లు సరికొత్త చరిత్ర లిఖించడం, దిగ్గజ దేశాలకు ముచ్చెమటలు పట్టించడం మనం తరచూ చూస్తుంటాం. 2026 ఫిఫా వరల్డ్ కప్ గ్రూప్-హెచ్ విభాగంలో యూరప్ దిగ్గజం స్పెయిన్‌తో సరికొత్త జట్టు కేప్ వెర్డే తలపడిన మ్యాచ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా గ్రూప్ 'హెచ్' ప్రారంభ మ్యాచ్‌లోనే ఊహించని అద్భుతం జరిగింది. టోర్నమెంట్‌లో హాట్ ఫేవరెట్‌గా, డిఫెండింగ్ యూరోపియన్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన బలమైన స్పెయిన్ జట్టుకు.. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న చిన్న దేశం కేప్ వర్దే కోలుకోలేని షాక్ ఇచ్చింది. సోమవారం జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరాటంలో కేప్ వర్దే జట్టు స్పెయిన్‌ను 0-0 తో నిలువరించి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఫుట్‌బాల్ ప్రపంచంలోనే అత్యంత బలమైన అటాకింగ్ లైన్ ఉన్న స్పెయిన్ ఆటగాళ్లు, కేప్ వర్దే డిఫెన్స్‌ను, వారిగోల్‌కీపర్ 'వోజిన్హా'ను దాటుకుని ఒక్క గోల్ కూడా చేయలేకపోయారు.

ఈ చారిత్రాత్మక డ్రా తర్వాత కేప్ వర్దే పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఈ చిన్న దేశం సాధించిన అద్భుత ప్రదర్శనతో ఇంటర్నెట్ ఒక్కసారిగా షేక్ అయింది. గూగుల్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కేప్ వర్దే గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఎగబడుతున్నారు. దీంతో ఈ ద్వీప దేశానికి సంబంధించిన గ్లోబల్ సెర్చ్ వాల్యూమ్ మునుపెన్నడూ లేనంతగా ఒక్కసారిగా పెరిగింది.

FIFA World Cup 2026 Tiny Cape Verde Stuns Heavyweights Spain With Historic 0-0 Draw Full Details

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు, సాధారణ ప్రజలు అసలు ఈ కేప్ వర్దే ఎక్కడుంది? దీని నేపథ్యం ఏంటి? అని గూగుల్‌లో విపరీతంగా శోధిస్తున్నారు. పశ్చిమ ఆఫ్రికా తీరంలో అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న ఈ 10 అగ్నిపర్వత దీవుల సమూహం గురించి, కేవలం 5 లక్షల జనాభాతో ఈ జట్టు సాధించిన నమ్మశక్యం కాని ఫీట్ గురించి తెలుసుకుని ప్రపంచం ముక్కున వేలేసుకుంటోంది. నిన్నటి వరకు అంతగా పరిచయం లేని ఈ డెబ్యూటెంట్ దేశం, ఇప్పుడు స్పెయిన్‌కు చెమటలు పట్టించి రాత్రికి రాత్రే గ్లోబల్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

కేప్ వెర్డే చారిత్రక ప్రయాణం గురించి తెలుసుకోవాలంటే మొదట దాని భౌగోళిక పరిస్థితులను గమనించాలి. పశ్చిమ ఆఫ్రికా తీరం నుంచి అట్లాంటిక్ మహాసముద్రంలో సుమారు 570 కిలోమీటర్ల దూరంలో ఉన్న పది అగ్నిపర్వత ద్వీపాల సముదాయమే ఈ కేప్ వెర్డే (కాబో వెర్డే). కేవలం ఐదు లక్షల కంటే కొద్దిగా ఎక్కువ జనాభా మాత్రమే ఉన్న ఈ చిన్న దేశం, ఫిఫా ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించిన అతి చిన్న దేశాలలో ఒకటిగా నిలిచింది. యూరప్ ఛాంపియన్ అయిన స్పెయిన్ వంటి బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు ఈ చిన్న జట్టు సిద్ధమవుతుండడం నిజంగా ఓ ఫుట్‌బాల్ అద్భుతం.

ఆఫ్రికా క్వాలిఫైయర్స్ గ్రూప్‌లో అనూహ్య విజయం

ఫిఫా క్వాలిఫైయింగ్ రౌండ్‌లో కేప్ వెర్డే ప్రస్థానం ఓ సినిమా స్టోరీని తలపించింది. క్వాలిఫైయర్స్ ఆరంభంలో ఆఫ్రికన్ దిగ్గజం కామెరూన్ ఉన్న గ్రూప్‌లో ఈ జట్టు చోటు దక్కించుకుంది. మొదటి మ్యాచ్‌లోనే కామెరూన్‌ చేతిలో 4-1 తేడాతో పరాజయం పాలైనప్పుడు ఈ చిన్న దేశం ప్రపంచకప్ చేరడం అసాధ్యమని అంతా అనుకున్నారు. కానీ ఆ ఓటమి వారిని వెనక్కి లాగలేదు, మరింత కసితో ముందుకు సాగడానికి వ్యూహాలను మార్చుకోవడానికి దారితీసింది.

కేప్ వెర్డే జట్టుకు "బ్లూ షార్క్స్" అనే నిక్ నేమ్ ఉంది. ఈ జట్టు అద్బుతంగా పుంజుకుని గ్రూప్‌లోని ఇతర ప్రత్యర్థులపై వరుస విజయాలు నమోదు చేసింది. సెప్టెంబర్ 2025లో ప్రియాలో జరిగిన మ్యాచ్‌లో బలమైన కామెరూన్‌ను 1-0 తేడాతో ఓడించి గ్రూప్ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. చివరికి గ్రూప్ డి ముగిసేసరికి 10 మ్యాచ్‌లలో 7 విజయాలు, 2 డ్రాలు, ఒక్క ఓటమితో 23 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. చివరగా ఈస్వాతిని జట్టును 3-0తో ఓడించి తొలిసారి ప్రపంచకప్ వేదికపై అడుగుపెట్టింది.

వలస ఆటగాళ్ల నైపుణ్యంతో బలంగా మారిన జట్టు

తక్కువ జనాభా కలిగిన దేశం కావడంతో కేప్ వెర్డేలో స్థానికంగా ఫుట్‌బాల్ శిక్షణ ఇచ్చే మౌలిక వసతులు చాలా తక్కువ. అయితే ఈ సమస్యను ఎదుర్కొనేందుకు హెడ్ కోచ్ బుబిస్టా ఓ సరికొత్త వ్యూహం రచించారు. పోర్చుగల్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వంటి వెస్ట్రన్ యూరప్ దేశాలలో స్థిరపడిన కేప్ వెర్డే సంతతికి చెందిన ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి జట్టులోకి రప్పించారు. యూరోపియన్ ఫుట్‌బాల్ క్లబ్బులలో కఠినమైన శిక్షణ పొందిన ఈ ఆటగాళ్లు జట్టుకు సాంకేతిక ప్రతిభను తెచ్చిపెట్టారు.

ప్రస్తుతం లా లిగాలో ఆడుతున్న డిఫెండర్ లోగాన్ కోస్టా ఈ జట్టు డిఫెన్స్ ను పటిష్టం చేస్తుండగా,..వింగర్ జోవాన్ కబ్రాల్ తన అద్భుతమైన వేగంతో ప్రత్యర్థి డిఫెన్స్‌ను చీల్చగలడు. అమెరికా మేజర్ లీగ్ ఫుట్‌బాల్ లో ఆడుతున్న క్రీడాకారులు కూడా ఈ జట్టులో భాగస్వాములు కావడం విశేషం. సీనియర్ గోల్ కీపర్ వోజిన్హా, అనుభవజ్ఞుడైన ఫార్వర్డ్ ర్యాన్ మెండిస్ మ్యాచ్ కీలక సమయాలలో జట్టును ముందుండి నడిపిస్తూ తమ సత్తాను చాటుకుంటున్నారు.

సాధారణంగా చిన్న జట్లు కేవలం డిఫెన్స్ కే పరిమితమవుతుంటాయి. కానీ కేప్ వెర్డే మాత్రం 4-5-1 లేదా 4-3-3 ఫార్మేషన్ ఉపయోగించి దూకుడుగా ఆధునిక వ్యూహాత్మక ఫుట్‌బాల్ ఆడుతోంది. మిడ్‌ఫీల్డర్లు కెవిన్ పినా, లారోస్ డ్యువార్టే బంతిని తమ ఆధీనంలోకి తీసుకుని అద్భుత పాసులను అందిస్తారు. వింగ్స్‌పై ఉన్న ర్యాన్ మెండిస్ ప్రత్యర్థి శ్రేణులను చేధిస్తూ దూసుకుపోతుండగా.. యువ ఫార్వర్డ్ డైలాన్ లివ్రామెంటో తన అద్భుతమైన రన్నింగ్ గేమ్‌తో ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెడతాడు.

Story first published: Tuesday, June 16, 2026, 9:20 [IST]
Other articles published on Jun 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+