Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2026: మెక్సికో శుభారంభం.. సౌతాఫ్రికా కొంపముంచిన రెడ్ కార్డ్స్!

ఫుట్‌బాల్ పండుగ ఫిఫా ప్రపంచకప్ 2026 ఘనంగా మొదలైంది. ఆతిథ్య మెక్సికో టీమ్ శుభారంభం చేసింది. గురువారం అంగరంగ వైభవంగా జరిగిన ఆరంభ వేడుకల అనంతరం హోరాహోరీగా సాగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య మెక్సికో టీమ్ 2-0తో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆటగాళ్ల ప్రదర్శన కంటే.. ఇరు జట్లకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు రెడ్ కార్డ్స్‌తో మైదానం వీడటం చర్చనీయాంశమైంది.

నిబంధనలను ఉల్లంఘించిన ముగ్గురు ఆటగాళ్లకు మ్యాచ్ రిఫరీ రెడ్‌ కార్డులు ఇచ్చాడు. వీరిలో ఇద్దరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కాగా.. ఒకరు మెక్సికన్‌ ప్లేయర్‌ ఉన్నారు. రెడ్ కార్డు ప్రభావంతో 9 మందితోనే దక్షిణాఫ్రికా మ్యాచ్‌ ఆడి మూల్యం చెల్లించుకుంది.

FIFA World Cup 2026: కన్నీటి పర్యంతమైన మ్యాచ్ రిఫరీ!

FIFA World Cup 2026: కన్నీటి పర్యంతమైన మ్యాచ్ రిఫరీ!

ఆరంభంలోనే మెక్సికో పంజా

మ్యాచ్ ప్రారంభమైన 9వ నిమిషంలోనే మెక్సికో బోణీ కొట్టింది. సౌతాఫ్రికా గోల్‌కీపర్ రోన్వెన్ విలియమ్స్ చేసిన చిన్న పొరపాటును మెక్సికో మిడ్‌ఫీల్డర్ ఎరిక్ లిరా అద్భుతంగా వాడుకున్నాడు. లీరా అందించిన పాస్‌ను జూలియన్ క్వినోనెస్ గోల్‌గా మలిచి మెక్సికోకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. 2006 తర్వాత ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లలో నమోదైన అత్యంత వేగవంతమైన గోల్ ఇదే కావడం విశేషం.

FIFA World Cup 2026 Three Red Cards Brandished as Co-Hosts Mexico Cruise to 2-0 Victory Over South Africa

రెడ్ కార్డ్‌తో మారిన ఆట

ఫస్టాఫ్ గేమ్ ముగిసేసరికి మెక్సికో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. సెకండాఫ్ ప్రారంభమైన కొద్దిసేపటికే (49వ నిమిషంలో) సౌతాఫ్రికా ఆటగాడు యా యా సిథోల్.. మెక్సికో ప్లేయర్ బ్రయాన్ గుటియరెజ్‌ను కిందపడేయడంతో అంపైర్ నేరుగా రెడ్ కార్డ్ ఇచ్చి మైదానం బయటకు పంపించేసాడు. 1994 తర్వాత ఒక ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో రెడ్ కార్డ్ పొందిన తొలి ఆటగాడిగా సిథోల్ నిలిచాడు.


హిమెనెజ్ చారిత్రాత్మక గోల్

మెక్సికో తరఫున 4వ ప్రపంచకప్ ఆడుతున్న సీనియర్ స్ట్రైకర్ రాల్ హిమెనెజ్ ఎట్టకేలకు తన కల నిజం చేసుకున్నాడు. 67వ నిమిషంలో రాబర్టో అల్వరాడో అందించిన క్రాస్‌ను హిమెనెజ్ అద్భుతమైన హెడర్ ద్వారా గోల్‌గా మలిచి మెక్సికోకు 2-0తో ఆధిక్యాన్ని అందించాడు. ప్రపంచకప్ చరిత్రలో గోల్ కొట్టిన అత్యంత వృద్ధ ఆటగాళ్లలో ఒకడిగా 35 ఏళ్ల హిమెనెజ్ నిలిచాడు. ఇదే మ్యాచ్‌లో మెక్సికోకు చెందిన 17 ఏళ్ల గిల్బెర్టో మోరా బరిలోకి దిగి, ప్రపంచకప్‌లో ఆతిథ్య దేశం తరఫున ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

ముగింపులో హైడ్రామా

సౌతాఫ్రికా సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ థెంబా జ్వానే హింసాత్మకంగా ప్రవర్తించాడనే నెపంతో 'వార్' (VAR) పరిశీలన తర్వాత రెడ్ కార్డ్ ఇచ్చి పంపారు. మ్యాచ్ అదనపు సమయంలో మెక్సికో డిఫెండర్ సీసర్ మోంటెస్ కూడా రెడ్ కార్డ్ పొందాడు. ఒకే మ్యాచ్‌లో ముగ్గురు ఆటగాళ్లు నేరుగా రెడ్ కార్డ్‌లు అందుకోవడం 1998 తర్వాత ఇదే తొలిసారి. చివరకు మెక్సికో 2-0తో పూర్తి ఆధిపత్యం చెలాయించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

Fifa World Cup 2026: అదిరిపోయే ఆరంభం.. ఉర్రూతలూగించిన షకీరా! (వీడియో)

Fifa World Cup 2026: అదిరిపోయే ఆరంభం.. ఉర్రూతలూగించిన షకీరా! (వీడియో)
Story first published: Friday, June 12, 2026, 8:39 [IST]
Other articles published on Jun 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+