Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2026: కప్పు కొట్టేదెవరో తేల్చేసిన సూపర్‌కంప్యూటర్! టాప్ ప్లేస్ ఆ జట్టుదే!!

FIFA World Cup 2026: క్రీడా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిఫా వరల్డ్ కప్ 2026 సమరానికి సర్వం సిద్ధమైంది. జూన్ 11 నుంచి అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు వేదికగా ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో ఈ సారి రికార్డు స్థాయిలో 48 జట్లు తలపడనున్నాయి. టోర్నమెంట్ ప్రారంభానికి ముందే ప్రముఖ స్పోర్ట్స్ అనలిటిక్స్ సంస్థ 'ఆప్టా' తన సూపర్ కంప్యూటర్ ద్వారా 10 వేల సార్లు ఈ టోర్నీని సిమ్యులేట్ చేసి ఏ జట్టు గెలిచే అవకాశం ఎక్కువగా ఉందో విశ్లేషించింది. ఈ అంచనాల ప్రకారం.. ఈసారి వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు అత్యధికంగా స్పెయిన్ జట్టుకు ఉన్నట్లు తేలింది.

హాట్ ఫేవరెట్‌గా స్పెయిన్!
ఆప్టా సూపర్ కంప్యూటర్ అంచనాల ప్రకారం.. ప్రస్తుత యూరోపియన్ ఛాంపియన్స్ అయిన స్పెయిన్ 16.1 శాతం అవకాశాలతో హాట్ ఫేవరెట్‌గా నిలిచింది. ఆ జట్టు యువ సంచలనం లామిన్ యమల్ ఫామ్, మిడ్ ఫీల్డర్ రోడ్రి కెప్టెన్సీ స్పెయిన్‌కు కొండంత బలాన్ని ఇస్తున్నాయి. స్పెయిన్ తర్వాత 2018 ఛాంపియన్ ఫ్రాన్స్ 13.0 శాతంతో రెండో స్థానంలో, థామస్ టుచెల్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ 11.2 శాతంతో మూడో స్థానంలో నిలిచాయి. ఇక 2022 డిఫెండింగ్ ఛాంపియన్, లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు 10.4 శాతం అవకాశాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ 4 జట్ల మధ్యే ప్రధాన పోటీ నెలకొననుంది.

FIFA World Cup 2026 Prediction Opta Supercomputer Names Spain as Top Favorite Full Details

సూపర్ కంప్యూటర్ హెచ్చరిక
ఈ ముగ్గురు అగ్రగాములతో పాటు క్రిస్టియానో రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్ (7 శాతం), కార్లో అన్సెలోట్టి కోచింగ్‌లోని ఐదుసార్లు ఛాంపియన్ బ్రెజిల్ (6.6%), జర్మనీ (5.1%) జట్లు కూడా టైటిల్ రేసులో బలంగా ఉన్నాయి. ముఖ్యంగా రొనాల్డో, మెస్సీ ఇద్దరికీ ఇది 6వ వరల్డ్ కప్ కావడం విశేషం, తద్వారా వారు సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. మరోవైపు నెదర్లాండ్స్, నార్వే, కొలంబియా, మొరాకో జట్లు టోర్నీలో ప్రమాదకరమైన జట్లుగామారే అవకాశం ఉందని, ఏమాత్రం అలసత్వంగా ఉన్నా ఇవి పెద్ద జట్లకు షాక్ ఇవ్వగలవని సూపర్‌కంప్యూటర్ హెచ్చరించింది.

ఆతిథ్య జట్లకు కష్టమే..!
టోర్నమెంట్‌కు ఆతిథ్యమిస్తున్న అమెరికా, మెక్సికో, కెనడా జట్లు తమ సొంత గడ్డపై రాణించే అవకాశాలు ఉన్నప్పటికీ.. టైటిల్ గెలిచే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. అమెరికాకు 1.2 శాతం, మెక్సికోకు 1.0 శాతం మాత్రమే విజయావకాశాలు ఉన్నట్లు అంచనా వేశారు. ఈ ఏడాది కేప్ వర్దె, కురాకో, జోర్డాన్, ఉజ్బెకిస్తాన్ జట్లు తొలిసారి వరల్డ్ కప్‌లోకి అరంగేట్రం చేస్తున్నాయి. ఇందులో కురాకో జట్టు 10,000 సిమ్యులేషన్లలో ఒక్కసారి కూడా కప్ గెలవలేకపోయింది. జూలై 19న న్యూజెర్సీలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫిఫా చీఫ్ జియాని ఇన్ఫాంటినో విజేతకు ట్రోఫీని అందించనున్నారు.

Story first published: Tuesday, June 2, 2026, 12:26 [IST]
Other articles published on Jun 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+