Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA WC 2026: చరిత్ర సృష్టించిన భారత సంతతి ఫుట్‌బాలర్!

FIFA WC 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు టర్కీపై 2-0తో అద్భుత విజయంతో శుభారంభం చేసింది. ఈ మ్యాచ్ ద్వారా భారత సంతతికి చెందిన వింగర్ నిషాన్ వేలుపిళ్లై ఫిఫా ప్రపంచ కప్‌లో అధికారికంగా అరంగేట్రం చేశాడు. దీనితో ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మెగా టోర్నీ ఫిఫా వరల్డ్ కప్ బరిలోకి దిగిన తొలి భారత సంతతి ఫుట్ బాలర్‌గా నిషాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ఆంగ్లో ఇండియన్ మూలాలు.. సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి!
25 ఏళ్ల నిషాన్ వేలుపిళ్లై ఆంగ్లో-ఇండియన్ కుటుంబానికి చెందినవాడు. అతని తల్లి గిలియన్ వేలుపిళ్లై భారతీయ మూలాలు ఉన్న మహిళ కావడం గమనార్హం. ఆస్ట్రేలియా జట్టులో మోస్ట్ టాలెంటెడ్ యువ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్న నిషాన్ వేలుపిళ్లై.. ఆదివారం టర్కీతో జరిగిన గ్రూప్-డి మ్యాచ్‌లో 61వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా స్టేడియంలోకి అడుగుపెట్టాడు. తొలి గోల్ చేసిన ఇరాన్‌కుందా స్థానంలో వచ్చిన నిషాన్.. మ్యాచ్ ముగిసేవరకు డిఫెన్స్‌లో ఎంతో పటిష్టంగా రాణించాడు. ఆస్ట్రేలియా తన 2-0 ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

FIFA World Cup 2026 Nishan Velupillay Becomes First Indian-Origin Footballer to Play in World Cup

చైనాపై అరంగేట్ర గోల్‌తో మొదలైన ప్రస్థానం
ఆస్ట్రేలియాలోని స్థానిక క్లబ్‌లు, మెల్‌బోర్న్ విక్టరీ అకాడమీ ద్వారా నిషాన్ వేలుపిళ్లై ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లోకి దూసుకొచ్చాడు. 2024లో చైనాతో జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నిషాన్ వేలుపిళ్లై.. మైదానంలోకి వచ్చిన కేవలం 7 నిమిషాల్లోనే గోల్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పటి నుంచి నిషాన్ కెరీర్ వేగంగా దూసుకెళ్లింది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా తరఫున 8 మ్యాచ్‌లు ఆడిన ఈ యువ ఆటగాడు 3 కీలక గోల్స్ సాధించాడు.

కోచ్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న నిషాన్ వేలుపిళ్లై
క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల్లో నిషాన్ వేలుపిళ్లై చూపించిన అసాధారణ ప్రతిభే ఆస్ట్రేలియా హెడ్ కోచ్ టోనీ పోపోవిక్‌ను ఆకట్టుకుంది. దీనితో ప్రపంచ కప్ ఆడే 26 మంది సభ్యుల తుది ఆస్ట్రేలియా జట్టులో నిషాన్‌కు చోటు దక్కింది. టర్కీతో జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సాధారణంగా అటాకింగ్ ఆడే నిషాన్‌కు కోచ్ రక్షణ బాధ్యతలను అప్పగించారు. టర్కీ ఫార్వర్డ్ ఆటగాళ్లు గోల్ చేయకుండా అడ్డుకోవడంలో నిషాన్ క్రమశిక్షణతో కూడిన ఆటను ప్రదర్శించి కోచ్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.

ఆస్ట్రేలియా సంచలనం.. టర్కీకి షాక్!
ఈ మ్యాచ్ లో మొదటగా 27వ నిమిషంలో 20 ఏళ్ల నెస్టోరీ ఇరాన్‌కుందా అద్భుతమైన ఫీల్డ్ గోల్ చేసి ఆస్ట్రేలియాకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 75వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్ కానర్ మెట్‌కాఫ్ 20 గజాల దూరం నుంచి బంతిని నెట్‌లోకి పంపి స్కోరును 2-0 గా మార్చాడు. సుదీర్ఘమైన 24 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ ఆడుతున్న టర్కీని ఆస్ట్రేలియా రక్షణ శ్రేణి సమర్థవంతంగా అడ్డుకుంది. నిషాన్ వేలుపిళ్లై వంటి యువ రక్తం తోడవడంతో ఆస్ట్రేలియా ఈ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుని నాకౌట్ రేసులో ముందంజ వేసింది.

Story first published: Sunday, June 14, 2026, 19:37 [IST]
Other articles published on Jun 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+