Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్ మోస్ట్ గ్లామరస్ ఫ్యాన్.. ఈమె ఎవరో తెలుసా?

FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచ కప్ 2026లో స్టేడియంలో ఇంగ్లండ్, క్రొయేషియా జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంటే.. స్టాండ్స్‌లో మాత్రం ఓ క్రొయేషియా సూపర్ ఫ్యాన్ అందరి దృష్టిని ఆకర్షించింది. తన బోల్డ్, గ్లామరస్ లుక్స్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే క్రొయేషియా మోడల్ ఇవానా నాల్ మైదానంలో అడుగుపెట్టడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆమె స్టేడియంలో సందడి చేసిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆమెను 'వరల్డ్ కప్ మోస్ట్ గ్లామరస్ ఫ్యాన్' అంటూ అభివర్ణిస్తున్నారు.

33 ఏళ్ల ఇవానా నాల్ క్రొయేషియా దేశ సాంప్రదాయ ఎరుపు-తెలుపు చెకర్డ్ థీమ్‌తో డీప్-నెక్ టాప్ ధరించి స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చింది. గ్యాలరీలో నిలబడి చేతులతో హార్ట్ షేప్ చూపిస్తూ కెమెరాలకు పోజులిచ్చింది. అనంతరం ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. "క్రొయేషియా, లెట్స్ గో" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. క్రొయేషియా బ్యూటీ ఇవానాకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు.

FIFA World Cup 2026 Most Glamorous Fan in Tournament Ivana Knoll Wows Stadium at Croatia Match

గతంలో 2022లో జరిగిన ఖతార్ వరల్డ్ కప్ సమయంలో ఇవానా నాల్ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆ టోర్నీలో ఆమె స్టైలిష్ ఎంట్రీలు ఆమెను సోషల్ మీడియా స్టార్‌గా మార్చేశాయి. ప్రస్తుతం ఆమె మోడలింగ్‌తో పాటు డీజేగా కూడా రాణిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.."ఒకవేళ ఇంగ్లండ్ ఆటగాళ్లు ఈ ఫోటోలు చూస్తే మ్యాచ్ పై వారి దృష్టి మరల్చడం ఖాయం" అంటూ సరదాగా కామెంట్ చేశాడు.

ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే ఇవానా క్రొయేషియా థీమ్ కలిగిన బికినీ టాప్ ధరించి అదిరిపోయే డీజే ప్రదర్శన కూడా ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.2018 ఫిఫా వరల్డ్ కప్‌లో రన్నరప్ గా నిలిచిన క్రొయేషియా జట్టు.. ఈ సారి కూడా అదే తరహాలో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్ కు దూసుకెళ్లాలని ఇవానా నాల్ ఆకాంక్షిస్తోంది. స్టేడియంలో ఆటగాళ్ల ఆట ఒక ఎత్తయితే.. గ్యాలరీలో ఇవానా అందాల సందడి మరో ఎత్తుగా నిలిచి ఈ మ్యాచ్‌లోనే హైలైట్‌గా నిలిచింది.

Story first published: Friday, June 19, 2026, 11:03 [IST]
Other articles published on Jun 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+