Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2026: బ్రెజిల్‌ను వణికించిన మొరాకో.. తొలిరోజే బిగ్ ట్విస్ట్!

FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ సమరంలో 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్ జట్టుకు ఆశించిన స్థాయిలో ఆరంభం లభించలేదు. గ్రూప్-సీలో మొరాకోతో జరిగిన తమ మొదటి లీగ్ మ్యాచ్‌ను బ్రెజిల్ 1-1తో డ్రా చేసుకుంది. గెలిస్తే వచ్చే మూడు పాయింట్లలో కేవలం ఒక్క పాయింట్ మాత్రమే దక్కించుకోవడంతో బ్రెజిల్ కు రెండు పాయింట్ల నష్టం వాటిల్లింది. బ్రెజిల్ స్టార్ ఆటగాడు నెయ్‌మార్ జూనియర్ పూర్తి ఫిట్ నెస్ లేకపోవడం వల్ల ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో బ్రెజిల్ జట్టుపై స్పష్టమైన ప్రభావం కనిపించింది.

మొరాకో తొలి గోల్.. బ్రెజిల్‌పై ఒత్తిడి
న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో మొరాకో జట్టు బ్రెజిల్‌కు గట్టి పోటీని ఇచ్చింది. మ్యాచ్ ప్రారంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే 21వ నిమిషంలో మొరాకో జట్టు ఖాతా తెరిచింది. బ్రాహిమ్ డియాజ్ అందించిన అద్భుతమైన థ్రూ బాల్‌ను అందుకున్న ఇస్మాయిల్ సైబారీ, బ్రెజిల్ డిఫెన్స్‌ను చేధిస్తూ గోల్ కీపర్ అలిసన్‌ను దాటుకుని బంతిని నెట్‌లోకి పంపాడు. దీంతో మొరాకో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

FIFA World Cup 2026 Morocco Holds Brazil To 1-1 Draw Big Blow For 5-Time Champions Details

వినీసియస్ జూనియర్ అదిరిపోయే కౌంటర్
మొరాకో సాధించిన ఆధిక్యాన్ని బ్రెజిల్ ఎక్కువ సేపు నిలవనివ్వలేదు. మ్యాచ్ 32వ నిమిషంలో బ్రెజిల్ స్టార్ ఆటగాడు వినీసియస్ జూనియర్ సమాధానం ఇచ్చాడు. బ్రూనో గిమారేస్ అందించిన పాస్‌ను లెఫ్ట్ ఫ్లాంక్ నుంచి అందుకున్న వినీసియస్, తన అద్భుతమైన నైపుణ్యంతో లోపలికి కట్ చేస్తూ కుడి కాలితో సూటిగా గోల్ పోస్ట్‌లోకి షాట్ కొట్టాడు. దీంతో స్కోరు 1-1తో సమమైంది.

మొరాకో గోల్ కీపర్ అద్భుతం
హాఫ్ టైమ్‌కు ముందే బ్రెజిల్‌కు ఆధిక్యం సాధించే అవకాశం లభించినప్పటికీ.. లూకాస్ పాక్వెటా చేసిన ప్రయత్నాన్ని మొరాకో గోల్ కీపర్ 'బౌనూ' అద్భుతంగా అడ్డుకున్నాడు. రెండో హాఫ్‌లో కూడా బౌనూ పలు కీలకమైన సేవ్‌లు చేస్తూ మొరాకోను మ్యాచ్‌లో నిలబెట్టాడు. మ్యాచ్ రెండో భాగంలో ఇరు జట్లు గోల్స్ చేయడానికి శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఎవరికీ విజయం దక్కలేదు.

బ్రెజిల్ సుదీర్ఘ నిరీక్షణ
బ్రెజిల్ జట్టు చివరిసారిగా 2002లో ప్రపంచ కప్ గెలిచింది. అప్పటి నుంచి గడిచిన 24 ఏళ్లలో ఆ జట్టు కనీసం ఫైనల్‌కు కూడా చేరలేకపోయింది. మరోవైపు గత ఖతార్ ప్రపంచ కప్‌లో సెమీస్ చేరి అందరినీ ఆశ్చర్యపరిచిన మొరాకో.. ఈ ఏడాది ప్రారంభంలో ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ టైటిల్ ను కూడా గెలుచుకుని పూర్తి ఫామ్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్‌ను డ్రాగా నిలువరించడం ద్వారా మొరాకో తన సత్తాను మరోసారి నిరూపించుకుంది.

Story first published: Sunday, June 14, 2026, 10:43 [IST]
Other articles published on Jun 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+