Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Fifa World Cup 2026: మెస్సీకి గాయం.. వరల్డ్ కప్ ముందు బిగ్ షాక్!

Fifa World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి కేవలం కొన్ని వారాల మిగిలి ఉన్న వేళ.. అర్జెంటీనా అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్, గ్లోబల్ ఐకాన్ లియోనెల్ మెస్సీ గాయపడినట్లు తెలుస్తోంది. మేజర్ లీగ్ సాకర్‌లో భాగంగా ఇంటర్ మయామి జట్టు తరఫున ఆడుతున్న సమయంలో మెస్సీ స్టేడియం వీడి వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఫిఫా వరల్డ్ కప్ టోర్నీకి ముందు అర్జెంటీనా ఫుట్ బాల్ అభిమానుల్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఆదివారం రాత్రి మయామిలోని నువ్ స్టేడియంలో ఇంటర్ మయామి, ఫిలడెల్ఫియా యూనియన్ జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. భారీ వర్షం కారణంగా పిచ్ మొత్తం తడిగా మారిన ఈ మ్యాచ్‌లో.. 73వ నిమిషంలో లియోనెల్ మెస్సీ అకస్మాత్తుగా తన ఎడమ కాలు వెనుక భాగాన్ని పట్టుకుని ఇబ్బంది పడుతూ కనిపించాడు. ఆ వెంటనే తనే స్వయంగా సబ్‌స్టిట్యూట్ చేయాల్సిందిగా కోరాడు. దాంతో మ్యాచ్ మధ్యలోనే మెస్సీ మైదానాన్ని వీడి నేరుగా టన్నెల్‌లోకి వెళ్ళిపోయాడు. అయితే మెస్సీ నడుచుకుంటూనే వెళ్లడం అభిమానులకు కాస్త ఉపశమనం కలిగించే విషయమే అయినప్పటికీ.. గాయం తీవ్రత ఎంత ఉందనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో మయామి జట్టు 6-4 తేడాతో విజయం సాధించింది.

FIFA World Cup 2026 Lionel Messi Injury Scare Ahead of the Mega Tournament Full Details

మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంటర్ మయామి కోచ్ గిల్లెర్మో హోయోస్ మెస్సీ ఫిట్‌నెస్ గురించి స్పందించారు. మెస్సీకి నిజంగానే గాయమైందా లేదా అనేది ఇప్పడే చెప్పడం తొందరపాటు అవుతుందని ఆయన అన్నారు. "ప్రస్తుతానికి మెస్సీ గాయంపై ఎలాంటి మెడికల్ రిపోర్ట్ రాలేదు, త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి. వర్షం కారణంగా పిచ్ చాలా బరువుగా మారింది, దీనికి తోడు అతను తీవ్ర అలసటతో ఉన్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనే ముందుజాగ్రత్త చర్యగానే మెస్సీని మైదానం నుండి వెనక్కి రప్పించాం" అని కోచ్ స్పష్టం చేశారు.

38 ఏళ్ల లియోనెల్ మెస్సీ 2023లో ఇంటర్ మయామి జట్టులో చేరినప్పటి నుంచి తన వర్క్‌లోడ్‌ను ఎంతో జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నాడు. గత కొన్నేళ్లుగా మెస్సీ తరచూ హామ్‌స్ట్రింగ్ సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మయామి ప్రీ-సీజన్ మ్యాచ్‌లకు కూడా ఈ కారణంగానే అతను దూరమయ్యాడు. ఎనిమిది సార్లు ప్రతిష్టాత్మక 'బాలోన్ డి ఓర్' అవార్డు గెలుచుకున్న మెస్సీకి ఒకవేళ తీవ్రమైన గాయమైతే.. రాబోయే వరల్డ్ కప్‌లో టైటిల్ డిఫెండ్ చేసుకోవాలనుకుంటున్న అర్జెంటీనా ఆశలకు అది కోలుకోలేని దెబ్బ అవుతుంది.

అమెరికా, కెనడా, మెక్సికో దేశాల సంయుక్త ఆతిథ్యంలో జూన్ 11 నుంచి ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రారంభం కానుంది. అర్జెంటీనా జట్టు జూన్ 16న కాన్సాస్ సిటీలో అల్జీరియాతో తన మొదటి మ్యాచ్ ఆడాల్సి ఉంది. వరల్డ్ కప్ బ్రేక్‌కు ముందు ఇంటర్ మయామి జట్టుకు ఇదే చివరి మ్యాచ్ కావడం గమనార్హం. మెస్సీ ఇప్పటివరకు అధికారికంగా ఈ వరల్డ్ కప్ ఆడతానని ప్రకటించనప్పటికీ.. అతను బరిలోకి దిగడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. అదే జరిగితే ఆరు వరల్డ్ కప్ టోర్నీలు ఆడిన ఆటగాడిగా మెస్సీ సరికొత్త రికార్డు సృష్టిస్తాడు. వచ్చే వారం అర్జెంటీనా జట్టును ప్రకటించనుండగా.. జూన్ మొదటి వారంలో హోండురాస్, ఐస్‌లాండ్ జట్లతో జరిగే వార్మప్ మ్యాచ్‌ల నాటికి మెస్సీ కోలుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.

Story first published: Monday, May 25, 2026, 14:12 [IST]
Other articles published on May 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+