FIFA WC 2026: మెస్సీ రికార్డుల సునామీ: జోర్డాన్‌పై అర్జెంటీనా ఘన విజయం!
FIFA WC 2026: డల్లాస్ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్ జె మ్యాచ్‌లో అర్జెంటీనా 3-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ 80వ నిమిషంలో అద్భుతమైన ఫ్రీ-కిక్ ద్వారా గోల్ చేసి వరల్డ్ కప్ చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఇప్పటికే గ్రూప్ టాపర్‌గా నిలిచి లాస్ట్ 32 రౌండ్లో కేప్ వెర్డెతో తలపడేందుకు అర్హత సాధించిన అర్జెంటీనా.. ఈ విజయంతో గ్రూప్‌లో తన అజేయ రికార్డును కాపాడుకుంది. ఈ టోర్నీలో మెస్సీకి ఇది ఆరో గోల్ కాగా.. గోల్డెన్ బూట్ రేసులో మెస్సీ ముందంజలో ఉన్నాడు. అలాగే ప్రపంచ కప్‌లో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో గోల్స్ చేసిన మొదటి ఆటగాడిగా లియోనెల్ మెస్సీ చరిత్ర సృష్టించాడు.
లియోనెల్ మెస్సీ స్థానంలో కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన నికోలస్ ఒటామెండి మ్యాచ్ ఆరంభంలోనే హెడర్ ద్వారా గోల్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అయితే 19వ నిమిషంలో గియోవాని లో సెల్సో అర్జెంటీనా ఖాతా తెరిచాడు. పెనాల్టీ ఏరియా వెలుపల మొహమ్మద్ అబు తాహా చేసిన ఫౌల్ కారణంగా లభించిన ఫ్రీ-కిక్‌ను రియల్ బెటిస్ మిడ్‌ఫీల్డర్ లో సెల్సో అద్భుతంగా గోల్‌గా మలిచాడు. ఆ తర్వాత అర్జెంటీనా ఒత్తిడిని కొనసాగించింది. లౌటారో మార్టినెజ్ కొట్టిన షాట్ గోల్ పోస్ట్‌కు తగిలి వెనక్కి రాగా.. రీబౌండ్‌లో మార్కోస్ సెనెసి చేసిన ప్రయత్నాన్ని జోర్డాన్ గోల్ కీపర్ అబులైలా అడ్డుకున్నాడు. అయితే ఈ క్రమంలో నిజార్ అల్ రష్దాన్ హై-బూట్ ఫౌల్ కారణంగా సెనెసి గాయపడటంతో, వీడియో అసిస్టెంట్ రిఫరీ సమీక్ష తర్వాత రెఫరీ అర్జెంటీనాకు పెనాల్టీ ఇచ్చారు. దీనిని మార్టినెజ్ గోల్‌గా మార్చడంతో అర్జెంటీనా ఆధిక్యం 2-0కి చేరింది.

ద్వితీయార్థంలో జోర్డాన్ పుంజుకునే ప్రయత్నం చేసింది. అర్జెంటీనా తరఫున లియోనెల్ మెస్సీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న సమయంలో జోర్డాన్ ఆటగాడు ఎహ్సాన్ హద్దాద్ ఇచ్చిన పాస్‌ను సబ్‌స్టిట్యూట్ మూసా అల్ తమారి గోల్‌గా మలిచి ఆధిక్యాన్ని 2-1కి తగ్గించాడు. కానీ ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన మెస్సీ తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. అమెర్ జామూస్‌ను దాటుకుంటూ వెళ్లే క్రమంలో ఫ్రీ-కిక్ సాధించిన మెస్సీ.. జోర్డాన్ డిఫెండర్ల గోడను దాటుకుంటూ బంతిని నెట్‌లోకి పంపాడు. ప్రపంచ కప్‌లో మెస్సీకి ఇది రికార్డు స్థాయి 19వ గోల్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 12 షాట్లతో 2.13 ఎక్స్‌పెక్టెడ్ గోల్స్ (xG) నమోదు చేయగా.. జోర్డాన్ కేవలం 5 షాట్లతో 0.74 xG మాత్రమే సాధించగలిగింది.
ఈ మ్యాచ్ అర్జెంటీనా ఆటగాళ్లకు పలు రికార్డులను తెచ్చపెట్టింది. తన వరల్డ్ కప్ అరంగేట్రంలోనే ఫ్రీ-కిక్ ద్వారా గోల్ చేసిన లో సెల్సో.. 2010లో గ్రీస్‌పై మార్టిన్ పలెర్మో తర్వాత అరంగేట్ర మ్యాచ్‌లో గోల్ చేసిన మొదటి అర్జెంటీనా ఆటగాడిగా నిలిచాడు. అలాగే 21వ శతాబ్దంలో ప్రపంచ కప్‌లో డైరెక్ట్ ఫ్రీ-కిక్ గోల్ చేసిన రెండో అర్జెంటీనా ఆటగాడిగా నిలిచాడు (గతంలో మెస్సీ 12 ఏళ్ల క్రితం నైజీరియాపై ఈ ఘనత సాధించాడు). మరోవైపు లౌటారో మార్టినెజ్ తన 9వ ప్రపంచ కప్ మ్యాచ్‌లో 17వ ప్రయత్నంలో మొదటి గోల్ సాధించాడు. అర్జెంటీనా తరఫున ఇది అతనికి 38వ గోల్ కాగా.. దేశం తరఫున అత్యధిక గోల్స్ చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఇటీవలే 39వ పుట్టినరోజు జరుపుకున్న మెస్సీ, 1958లో ఏంజెల్ లాబ్రూనా తర్వాత 39 ఏళ్ల వయసులో ప్రపంచ కప్ మ్యాచ్ ఆడిన రెండో అర్జెంటీనా ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా ఒకే ప్రపంచ కప్ మ్యాచ్‌లో రెండు డైరెక్ట్ ఫ్రీ-కిక్ గోల్స్ చేసిన నాలుగో జట్టుగా అర్జెంటీనా (గతంలో జపాన్-2010, యుగోస్లేవియా-1974, బ్రెజిల్-1966) నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications