Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

FIFA World Cup 2026: రేపటి నుంచే ఫిఫా వరల్డ్ కప్.. ఎప్పుడు స్టార్ట్? ఎక్కడ చూడాలి?

FIFA World Cup 2026: క్రీడా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఫిఫా వరల్డ్ కప్ 2026' సరికొత్త రికార్డులతో ప్రారంభం కాబోతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మూడు ఉత్తర అమెరికా దేశాలైన అమెరికా, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. మొత్తం 16 నగరాల్లో రికార్డు స్థాయిలో 104 మ్యాచ్‌లు జరగనున్నాయి. జూన్ 11(గురువారం) మెక్సికోలో జరిగే తొలి మ్యాచ్‌తో ప్రారంభమయ్యే ఈ సాకర్ పండుగ జులై 19న న్యూయార్క్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. ఈ టోర్నీ ప్రారంభోత్సవ వేడుకలు మూడు దేశాల సంస్కృతులను ప్రతిబింబిస్తూ అత్యంత వైభవంగా జరగనున్నాయి.

ఒలింపిక్ ప్రారంభోత్సవ వేడుకలను అద్భుతంగా రూపొందించిన ప్రఖ్యాత క్రియేటివ్ డైరెక్టర్ 'మార్కో బాలిచ్' నేతృత్వంలో ఈ మూడు ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. మూడు దేశాల్లోని వేడుకలకు వేర్వేరు సాంస్కృతిక శైలులు ఉన్నప్పటికీ.. "ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఎలా ఏకం చేస్తుంది" అనే ఒకే ఒక ఉమ్మడి థీమ్‌తో వీటిని అనుసంధానించారు. ప్రతి దేశంలోనూ ఆయా జట్ల మ్యాచ్ ప్రారంభానికి సరిగ్గా 90 నిమిషాల ముందు ఈ వేడుకలు మొదలవుతాయి. మెక్సికో సిటీలో సుమారు 16 నిమిషాలు, టొరంటో, లాస్ ఏంజిల్స్‌లలో దాదాపు 13 నిమిషాల పాటు ఈ ప్రదర్శనలు సాగుతాయి. ఆ తర్వాత ఆటగాళ్లు వార్మ్-అప్ పూర్తి చేసుకుని మైదానంలోకి దిగుతారు.

FIFA World Cup 2026 kicks off on June 11 Opening Ceremony Schedule Performers Live Streaming Details

మెక్సికో సిటీ (జూన్ 11):
మెక్సికోలోని చారిత్రాత్మక 'మెక్సికో సిటీ స్టేడియం' (గతంలో ఎస్టాడియో అజ్టెకా) వేదికగా జూన్ 11న తొలి ప్రారంభోత్సవ వేడుక జరగనుంది. ఈ వేడుక ముగిసిన వెంటనే మెక్సికో, సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ వేడుకలో మెక్సికన్ సాంప్రదాయ కళలను ప్రదర్శించనున్నారు. ఇక్కడ గ్లోబల్ పాప్ స్టార్ షకీరా తన ప్రసిద్ధ 'డై డై' (Dai Dai) పాటతో పాటు బర్నా బాయ్, జె బాల్విన్, అన్రిక్ ఇగ్లేసియాస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ గాయకులు అలరించనున్నారు. ఈ వేడుక కోసం మెక్సికో సిటీలో జూన్ 11ను ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు.

టొరంటో, కెనడా (జూన్ 12):
కెనడా చరిత్రలోనే తొలిసారిగా మెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. టొరంటో స్టేడియంలో కెనడా, బోస్నియా-హెర్జెగోవినా మ్యాచ్‌కు ముందు స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు (GMT 17:30) ఈ వేడుక ప్రారంభమవుతుంది. 'కల్చరల్ మొజాయిక్' (సాంస్కృతిక వైవిధ్యం) థీమ్‌తో కెనడా వైవిధ్యాన్ని చాటిచెప్పేలా ఈ ప్రదర్శన ఉంటుంది. ఇందులో ప్రముఖ కళాకారులు అలానిస్ మోరిస్సెట్, అలెస్సియా కారా, మైకేల్ బుబ్లేలతో పాటు నోరా ఫతేహి కూడా లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు.

లాస్ ఏంజిల్స్, అమెరికా (జూన్ 12):
అమెరికా తన ప్రారంభోత్సవ వేడుకలను లాస్ ఏంజిల్స్ స్టేడియంలో నిర్వహించనుంది. అమెరికా, పరాగ్వే దేశాల మధ్య జరిగే మ్యాచ్‌కు ముందు ఈ వేడుకలు ఉంటాయి. అమెరికాలోని విభిన్న సంస్కృతులను ప్రతిబింబించేలా ఈ లైవ్ షోను ప్లాన్ చేశారు. ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధ పాప్ సింగర్ కేటీ పెర్రీ , ఫ్యూచర్, లీసా, రెమా వంటి స్టార్ సింగర్స్ తమ ప్రదర్శనలతో స్టేడియాన్ని హోరెత్తించనున్నారు. ఈ మూడు వేడుకలను ప్రత్యక్షంగా చూసేందుకు దాదాపు 2 లక్షల మంది అభిమానులు స్టేడియాలకు రానుండగా, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది టీవీల్లో వీక్షించనున్నారు.

లైవ్ ప్రసారాలు ఎలా చూడాలి?
భారతీయ కాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌లు, ప్రారంభోత్సవ వేడుకల సమయాలు మారుతుంటాయి. అంతర్జాతీయంగా బీబీసీ, ఐటీవీ, ఫాక్స్, టెలెముండో వంటి ఛానెళ్లలో ఇవి ప్రసారం కానున్నాయి. ఉచిత స్ట్రీమింగ్ కోసం 'Tubi' యాప్‌లో వీక్షించవచ్చు. అయితే మెక్సికో సిటీలో ఉపాధ్యాయ సంఘాల నిరసనలు, రోడ్ల దిగ్బంధనాల వంటి సవాళ్లు ఉన్నప్పటికీ.. భారీ భద్రత నడుమ టోర్నమెంట్‌ను విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Story first published: Wednesday, June 10, 2026, 14:28 [IST]
Other articles published on Jun 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+